మోటోరోలా నుంచి “సిగ్నేచర్‌” స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్.. ఫీచర్స్ ఇవే ! | Motorola launched new smart phone Signature with amazing features and in reasonable prices

Date:


Science Technology

oi-Korivi Jayakumar

ఎప్పటికప్పుడు
కొత్త
కొత్త
ఫీచర్లతో
తక్కువ
ధరలోనే
ఫోన్లను
అందించేందుకు
కంపెనీలు
సైతం
పోటీ
పడుతున్నాయి.
ఇండియన్
మార్కెట్లో
ప్రముఖ
మొబైల్
ఫోన్ల
తయారీ
సంస్థ
మోటారోలా
మొబైల్స్
కి
సపరేట్
ఫ్యాన్స్
ఉంటారు.
ఇప్పటికే

కంపెనీ
నుంచి
రిలీజ్
అయిన
ఫోన్స్
టెక్
టెక్
ప్రియులను
బాగా
ఆకర్షించాయి.
బడ్జెట్
రేంజ్
నుంచి
ఫ్లాగ్
షిప్
రేంజ్
వరకు
పలు
ఫోన్‌లతో
మంచిగా
సక్సెస్
అయ్యింది.

క్రమంలోనే
మోటోరోలా
మరో
కొత్త
ప్రీమియం
ఫోన్‌ను
భారతీయ
మార్కెట్‌లో
విడుదల
చేయనుంది.

లేటెస్ట్
గా
మరో
ప్రీమియం
ఫ్లాగ్‌షిప్
స్మార్ట్‌ఫోన్‌తో
మార్కెట్‌లోకి
అడుగుపెట్టింది.
టెక్
ప్రియుల్లో
భారీ
అంచనాలు
నెలకొన్న
‘మోటోరోలా
సిగ్నేచర్‌’
స్మార్ట్‌ఫోన్‌ను
అధికారికంగా
విడుదల
చేసింది.
లాంచ్‌కు
ముందే
లీకుల
ద్వారా
ఆసక్తి
రేపిన

ఫోన్..
ఇప్పుడు
పూర్తి
స్పెసిఫికేషన్లు,
ధరలు,
విక్రయ
వివరాలతో
వినియోగదారుల
ముందుకు
వచ్చింది.
అవేంటో
మీకోసం
ప్రత్యేకంగా..

motorola-launched-new-smart-phone-signature-with-amazing-features-and-in-reasonable-prices


(
motorola
)
మోటోరోలా
సిగ్నేచర్‌
ఫీచర్స్..


సాఫ్ట్‌వేర్
&
పనితీరు..

మోటోరోలా
సిగ్నేచర్‌
స్మార్ట్‌ఫోన్
ఆండ్రాయిడ్
16
ఆధారిత
మోటోరోలా
హెలో
UIతో
పనిచేస్తుంది.
క్లీన్గా,
బ్లోట్‌వేర్
లేకుండా
ఉండే
యూజర్
ఎక్స్‌పీరియన్స్‌ను
అందించడమే
లక్ష్యంగా

UIని
రూపొందించారు.
ఫోన్‌కు
శక్తినిచ్చేది
తాజా
ఆక్టాకోర్
స్నాప్‌డ్రాగన్
8
జెన్
5
ప్రాసెసర్,
ఇది
హైఎండ్
గేమింగ్‌,
మల్టీటాస్కింగ్‌,
ఏఐ
ఆధారిత
ఫీచర్లకు
అద్భుతమైన
పనితీరును
అందిస్తుంది.


డిస్‌ప్లే
హైలైట్స్..


ఫోన్‌లో
6.8
అంగుళాల
సూపర్
హెచ్‌డీ
LTPO
ఎక్స్‌ట్రీమ్
AMOLED
డిస్‌ప్లేను
అందించారు.
165Hz
రిఫ్రెష్
రేటు
వల్ల
స్మూత్
స్క్రోలింగ్,
గేమింగ్
అనుభూతి
లభిస్తుంది.
అంతేకాకుండా
6200
నిట్స్
పీక్
బ్రైట్‌నెస్,
డాల్బీ
విజన్,
HDR10+
సపోర్ట్తో
అవుట్‌డోర్‌లోనూ
అద్భుతమైన
విజిబిలిటీ
అందిస్తుంది.


డిజైన్
&
డ్యూరబిలిటీ..

  • డిజైన్
    పరంగా
    మోటోరోలా
    సిగ్నేచర్‌
    ప్రీమియం
    ఫీల్
    ఇస్తుంది.
  • అల్యూమినియం
    ఫ్రేమ్,
    కార్నింగ్
    గొరిల్లా
    గ్లాస్
    విక్టస్
    2
    ప్రొటెక్షన్తో
    పాటు
  • IP68
    &
    IP69
    డస్ట్,
    వాటర్
    రెసిస్టెన్స్
    సర్టిఫికేషన్లు
    కలిగి
    ఉంది.
  • ఇది
    మిలిటరీ
    గ్రేడ్
    డ్యూరబిలిటీ
    టెస్టులను
    కూడా
    పూర్తి
    చేసిన
    ఫోన్
    కావడం
    విశేషం.


కెమెరా
సెటప్..

ఫోటోగ్రఫీ
ప్రేమికుల
కోసం
ఇందులో
పవర్‌ఫుల్
ట్రిపుల్
50MP
రియర్
కెమెరా
సెటప్
అందించారు.

50MP
OIS
ప్రైమరీ
సెన్సర్

50MP
అల్ట్రా
వైడ్
యాంగిల్
లెన్స్

50MP
పెరిస్కోప్
టెలిఫోటో
సెన్సర్

పెరిస్కోప్
కెమెరా
3x
ఆప్టికల్
జూమ్,
100x
హైబ్రిడ్
జూమ్ను
సపోర్ట్
చేస్తుంది.
ముందు
వైపు
50MP
సెల్ఫీ
కెమెరా
ఉంది.

ఫోన్‌తో
8K
@30fps
వీడియో
రికార్డింగ్
చేయవచ్చు.


బ్యాటరీ
&
ఛార్జింగ్..

  • మోటోరోలా
    సిగ్నేచర్‌లో
    5,200mAh
    సిలికాన్-కార్బన్
    బ్యాటరీ
    అమర్చారు.
  • ఇది
    90W
    ఫాస్ట్
    ఛార్జింగ్,
    50W
    వైర్‌లెస్
    ఛార్జింగ్కు
    సపోర్ట్
    చేస్తుంది.
  • ఒక్కసారి
    ఫుల్
    ఛార్జ్
    చేస్తే
    41
    గంటల
    వరకు
    బ్యాటరీ
    లైఫ్
    వస్తుందని
    కంపెనీ
    పేర్కొంది.
  • పవర్
    యూజర్లకు
    ఇది
    పెద్ద
    ప్లస్
    పాయింట్.


కనెక్టివిటీ
&
ఇతర
ఫీచర్లు..


ఫోన్‌లో
లేటెస్ట్
కనెక్టివిటీ
ఆప్షన్లు
అందుబాటులో
ఉన్నాయి.

5G
సపోర్ట్

Wi-Fi
7

Bluetooth
6.0

USB
Type-C
పోర్ట్

స్టీరియో
స్పీకర్లు
(డాల్బీ
అట్మాస్
సపోర్ట్)

ఇన్‌డిస్‌ప్లే
ఫింగర్‌ప్రింట్
సెన్సార్


ధరలు
&
ఆఫర్లు..

మోటోరోలా
సిగ్నేచర్‌
మూడు
స్టోరేజ్
వేరియంట్లలో
లభిస్తోంది.

12GB
RAM
+
256GB

₹59,999

16GB
RAM
+
512GB

₹64,999

16GB
RAM
+
1TB

₹69,999

హెచ్‌డీఎఫ్‌సీ
లేదా
యాక్సిస్
బ్యాంక్
కార్డులతో
కొనుగోలు
చేస్తే
రూ.5,000
వరకు
ఇన్‌స్టంట్
డిస్కౌంట్
లేదా
ఎక్స్ఛేంజ్
బోనస్
పొందవచ్చు.


ప్రీమియం
ఫ్లాగ్‌షిప్
స్మార్ట్‌ఫోన్
జనవరి
30
నుంచి
ఫ్లిప్‌కార్ట్‌లో
విక్రయాలకు
అందుబాటులోకి
రానుంది.
హైఎండ్
ఫీచర్లు,
పవర్‌ఫుల్
కెమెరా,
స్ట్రాంగ్
బ్యాటరీతో
మోటోరోలా
సిగ్నేచర్
ప్రీమియం
సెగ్మెంట్‌లో
గట్టి
పోటీ
ఇవ్వనుంది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Chinese New Year menu | Good Food

Lunar New Year's Day is often regarded as an...

The hope for peace to prevail

On a wintry day in January, when the sun...

Harry Styles on Pope Leo XIV Conclave Election Appearance

5. Pussycat DollAnne was the one who ended up...