యశస్వి జైశ్వాల్‌ సూపర్‌ సెంచరీ | Yashasvi Jaiswal Hits His Maiden odi international century

Date:


సౌతాఫ్రికాతో తొలి రెండు వ‌న్డేల్లో విఫ‌ల‌మైన టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఎట్టకేలకు తన ఫామ్‌ను అందుకున్నాడు. వైజాగ్ వేదిక‌గా జ‌రుగుతున్న సిరీస్ డిసైడ‌ర్ మూడో వ‌న్డేలో జైశ్వాల్ సెంచ‌రీతో చెల‌రేగాడు.

271 పరుగుల లక్ష్య చేధనలో జైశ్వాల్ కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. తొలుత ఆచితూచి ఆడిన యశస్వి.. క్రీజులో సెటిల్ అయ్యాక ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకు పడ్డాడు. వైజాగ్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. జైశూ 111 బంతుల్లో త‌న వ‌న్డే సెంచ‌రీ మార్క్ అందుకున్నాడు. 

కాగా మొద‌టి రెండు వ‌న్డేల్లో ఈ ముంబై ఆట‌గాడు విఫ‌లం కావ‌డంతో అత‌డిని జ‌ట్టు నుంచి త‌ప్పించాల‌ని చాలా మంది డిమాండ్ చేశారు. కానీ హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ మాత్రం జైశ్వాల్‌పై న‌మ్మ‌కం ఉంచాడు. దీంతో త‌న‌కు ల‌భించిన అవకాశాన్ని జైశ్వాల్ అందిపుచ్చుకున్నాడు. కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ గాయ‌ప‌డ‌డంతో జైశ్వాల్‌కు జట్టులో చోటుదక్కింది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related