India
-Bomma Shivakumar
కొవిడ్
మహమ్మారి
యావత్
ప్రపంచాన్ని
అతలాకుతలం
చేసిన
విషయం
తెలిసిందే.
ఈ
వైరస్
బారినపడి
లక్షలాది
మంది
ప్రాణాలు
కోల్పోయారు.
అయితే
కరోనా
వైరస్
విజృంభణ
తర్వాత
రోజులలో
యువతలో
ఆకస్మిక
మరణాల
సంఖ్య
పెరగడం
ఆందోళనకు
దారితీస్తోంది.
యువకులు
ఉన్నట్టుండి
ఒక్కసారిగా
కుప్పకూలి
మృతి
చెందడం
ఆందోళన
కలిగిస్తోంది.
అయితే
కొవిడ్
వ్యాక్సినేషన్
తీసుకున్న
యువతే
ఇలా
అకాల
మరణానికి
గురవుతున్నారంటూ
ఓ
వాదన
తెరపైకి
వచ్చింది.
అయితే
తాజాగా
ఇదే
విషయంపై
ఎయిమ్స్
సంస్థ
పరిశోధన
చేసింది.
కీలక
విషయాలను
వెల్లడించింది.
యువతలో
అకస్మాత్తు
మరణాలకు
కోవిడ్-19
టీకాకు
ఎటువంటి
శాస్త్రీయ
సంబంధం
లేదని
ఆల్
ఇండియా
ఇన్‌స్టిట్యూట్
ఆఫ్
మెడికల్
సైన్సెస్
(AIIMS)
తాజా
అధ్యయనం
తేల్చింది.
యువతలో
మరణానికి
గుండె
సంబంధిత
కరోనరీ
ఆర్టరీ
వ్యాధే
ప్రధాన
కారణమని
పరిశోధన
గుర్తించింది.
అయితే
అధిక
సంఖ్యలో
యువకులు
మృతి
చెందడానికి
గల
కారణాలు
మాత్రం
అంతుచిక్కకుండా
ఉన్నాయని..
మెరుగైన
దర్యాప్తు
అవసరం
అని
ఈ
అధ్యయనం
పేర్కొంది.
ఎయిమ్స్,
దిల్లీలో
ఒక
సంవత్సరం
పాటు
నిర్వహించిన
శవపరీక్షల
ఆధారిత
అధ్యయనం
ద్వారా..
యువకులలో
ఆకస్మిక
మరణాలకు
కోవిడ్-19
టీకాకు
ఎలాంటి
శాస్త్రీయ
ఆధారం
లేదని
తేల్చింది.
ఇటువంటి
మరణాలు
అంతర్లీన
గుండె
సంబంధిత,
ఇతర
వైద్య
కారణాల
వల్లే
సంభవిస్తాయని
స్పష్టం
చేసింది.
పోరెన్సిక్
మార్చురీ
నుండి
సేకరించిన
శవపరీక్ష
డేటా
ప్రకారం..
18
నుండి
45
సంవత్సరాల
వయస్సు
గల
వ్యక్తుల్లో
ఆకస్మిక
మరణం
ఇప్పుడు
ప్రధాన
ప్రజా
ఆరోగ్య
సమస్యగా
మారింది.
ఈ
మరణాలు
యువతలో
అరుదుగా
పరిగణించబడినప్పటికీ,
ప్రస్తుత
పరిస్థితులు
భిన్నంగా
ఉన్నాయని
అధ్యయనం
వివరించింది.
అధ్యయన
కాలంలో
పూర్తి
చేసిన
2,214
శవపరీక్షలలో,
180
కేసులు
(8.1
శాతం)
ఆకస్మిక
మరణాల
ప్రమాణాలకు
సరిపోయాయి.
ఈ
ఆకస్మిక
మరణాలలో
57.2
శాతం
యువ
వయోజనులలో
సంభవించగా,
46-
65
సంవత్సరాల
వయస్సు
వారిలో
42.8
శాతం
నమోదయ్యాయి.
యువతలో
ఆకస్మిక
మరణాలు
మొత్తం
శవపరీక్ష
కేసులలో
4.7
శాతంగా
ఉన్నాయి.
యువతలో
ఆకస్మిక
మరణాల
సగటు
వయసు
33.6
సంవత్సరాలుగా
ఉంది.
అయితే
యువతలో
సంభవించిన
సడెన్
మరణాల్లో
దాదాపు
మూడింట
రెండు
వంతులు
గుండె
సంబంధిత
కారణాలే
ఉన్నాయని
పరిశోధకులు
కనుగొన్నారు.
కరోనరీ
ఆర్టరీ
వ్యాధి
(CAD)
కారణంగా
మరణాలు
సంభవించినట్లు
తేల్చారు.
అలాగే
అరిథ్
మోజెనిక్
డిజార్డర్స్
(గుండె
లయ
లోపాలు),
కార్డియోమయోపతి
(గుండె
కండరాల
వ్యాధులు),
పుట్టుకతో
వచ్చే
లోపాల
కారణంగా
యువతలో
ఈ
సడెన్
డెత్
లు
జరుగుతున్నాయని
వివరించారు.
అలాగే
ఆకస్మిక
మరణానికి
గురైన
యువకుల్లో
సగానికి
పైగా
ధూమపానం
చేసేవారు.
ఇక
50
శాతానికి
పైగా
మద్యం
సేవించేవారు
ఉన్నారు.
ఇక
సుమారు
40
శాతం
మరణాలు
రాత్రి
లేదా
తెల్లవారుజామున
జరిగాయి.
సగానికి
పైగా
మరణాలు
ఇంట్లోనే
సంభవించినట్లు
అధ్యయనంలోనే
తేలింది.


