India
-Dr Veena Srinivas
అమెరికాలో
ఉన్నటువంటి
ఇండియన్లు
అనేక
అక్రమ
వ్యవహారాలలో
పట్టుబడటం
ఇప్పుడు
అమెరికా
దేశంలో
చదువుకోడానికి
వెళ్ళిన
విద్యార్థులకు,
అక్కడ
పనిచేస్తున్న
మన
వాళ్లకు
తీవ్ర
ఆందోళన
కలిగిస్తుంది.
అమెరికాలోని
ఇండియానా
రాష్ట్రంలో
తాజాగా
భారీ
కొకైన్
రవాణా
వ్యవహారం
వెలుగులోకి
వచ్చింది.
ఇండియానా
స్టేట్
పోలీస్
అధికారులు
సాధారణ
తనిఖీలలో
భాగంగా
ఒక
లారీని
ఆపి
చెక్
చేయగా
అందులో
140
కిలోల
కొకైన్
కనిపించింది.
భారీగా
కొకైన్
పట్టివేత,
ఇద్దరు
భారతీయులు
అరెస్ట్
సుమారు
309
పౌండ్ల
కొకైన్
ను
పోలీసులు
స్వాధీనం
చేసుకున్నారు.
దీని
విలువ
దాదాపు
ఏడు
మిలియన్
డాలర్లుగా
పోలీసులు
అంచనా
వేస్తున్నారు.
ఈ
ఘటనలో
భారత
సంతతికి
చెందిన
ఇద్దరు
ట్రక్
డ్రైవర్లను
పోలీసులు
అరెస్ట్
చేశారు.అరెస్ట్
అయిన
వారిని
కాలిఫోర్నియాకు
చెందిన
గురుప్రీత్
సింగ్,
జస్వీర్
సింగ్
లుగా
గుర్తించారు.
లారీలో
పట్టుబడిన
భారీ
డ్రగ్స్
ఇండియానా
స్టేట్
లోని
పుట్నమ్
కౌంటీలో
ఇంటర్
స్టేట్-70
రహదారిపై
వాహనంలో
సాంకేతిక
లోపాలు,
డ్రైవింగ్
శైలి
అనుమానాస్పదంగా
కనిపించడంతో
పోలీసులు
లారీని
ఆపి
తనిఖీ
చేయగా,
ముందు
వాహనం
ఖాళీగా
ఉందని
డ్రైవర్లు
చెప్పినప్పటికీ
డ్రగ్స్
స్వీపర్
డాగ్
హెచ్చరికతో
పోలీసులు
లారీని
క్షుణ్ణంగా
తనిఖీ
చేశారు.
ఈ
తనిఖీలో
లారీ
స్లీపర్
బెర్త్
లో
దుప్పటితో
కప్పిన
కార్డు
బోర్డు
బాక్సులలో
కొకైన్
ను
దాచి
ఉంచినట్లు
గుర్తించారు.
కొకైన్
లక్ష
13వేల
మంది
అమెరికన్ల
ప్రాణాలను
తీయగలదని
అంచనా
ఈ
కొకైన్
లక్ష
13వేల
మంది
అమెరికన్ల
ప్రాణాలను
తీయగలదని
హోమ్
ల్యాండ్
సెక్యూరిటీ
శాఖ
అంచనా
వేసింది.
వీరిద్దరూ
అక్రమంగా
అమెరికాలోకి
ప్రవేశించినట్టు
గుర్తించారు.
ఇందులో
జస్వీర్
సింగ్
పైన
గతంలో
దొంగతనం
కేసు
కూడా
నమోదయింది.
ప్రస్తుతం
వీరిద్దరి
పైన
ఐ
సి
ఈ
డిపోర్టేషన్
హోల్డ్
విధించారు.
ఇక
ఈ
వ్యవహారంతో
యూఎస్లో
ఉన్న
భారతీయుల
పైన
మరింత
కఠిన
వైఖరి
అమలవుతుంది.
భారతీయ
విద్యార్థులు,
ఉద్యోగులలో
ఆందోళన
ఇటువంటి
ఘటనలతో
అక్కడ
చదువుకోడానికి
వెళ్లిన
విద్యార్థులు,
ఉద్యోగాలు
చేస్తున్న
భారతీయులు
తీవ్ర
ఆందోళన
వ్యక్తం
చేస్తున్నారు.
దొంగతనాల
కేసులలో
భారతీయులు
పట్టుబడడం,
హత్య
కేసులలో
భారతీయులు
పట్టుబడడం,
భారీ
డ్రగ్స్
రవాణాలో
భారతీయులు
పట్టుబడటం
వంటి
చర్యలు,
అక్కడ
ఉన్న
మన
వారికి
కంటిమీద
కునుకు
లేకుండా
చేస్తున్నాయి.
చిన్న
అవకాశం
దొరికినా
భారతీయులను
డిపోర్ట్
చేయడానికి
రెడీ
భారతీయులు
అంటేనే
అనుమానాస్పదంగా
చూస్తున్న
యూఎస్
పోలీసులు,
అధికారుల
తీరుతో
అక్కడ
ఉన్నవారు
తలలు
బాదుకుంటున్నారు.
ఇక
తాజాగా
జరుగుతున్న
ఘటనలతో
యుఎస్
లో
కఠినమైన
ఆంక్షలు
విధిస్తున్న
ట్రంప్
ఏ
చిన్న
అవకాశం
దొరికినా
భారతీయులను
డిపోర్ట్
చేయడానికి
సిద్ధమయ్యారు.
ఇక
తాజా
ఘటనలతో
యూఎస్లో
భారతీయుల
పరిస్థితులు
బాగోలేదు
అనేది
స్పష్టంగా
అర్థమవుతుంది.


