India
oi-Bomma Shivakumar
తమిళనాడులో ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం అరవ రాజకీయం అంతా దళపతి విజయ్ చుట్టూనే తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ టీవీకే పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేస్తున్న ఆయనకు ఇప్పుడు రోజుకో చిక్కు వచ్చి పడుతోంది. కరూర్ తొక్కిసలాట ఘటన నుంచి మొదలు.. ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యవహారం వరకూ అన్నీ ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి.
ఇప్పటికే కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ కోర్టు చుట్టూ విజయ్ తిరుగుతున్నారు. విజయ్ ను ఎలాగైనా ఎన్డీయే కూటమిలోకి లాగాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కానీ విజయ్ ఎంట్రీని ఏఐఏడీఎంకే మాత్రం సహించడం లేదు. మరోవైపు విజయ్ కు సొంత ఇంట్లోనే తీవ్రమైన వ్యతిరేకత ఉంది. విజయ్ భార్య సంగీత విడాకులు కోరుతూ ఇటీవల ఓ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక విజయ్ చివరగా నటించిన జన నాయగన్ మూవీ విడుదలకు సెన్సార్ బోర్డు నో చెప్పింది. ఈ పరిణామాల మధ్య విజయ్ కు మరో బిగ్ షాక్ తగిలింది.
#AadhavArjuna apologizes for hurting the feelings of #SuperstarRajinikanth https://t.co/WgOTcJ6VZq
— Ramesh Bala (@rameshlaus) March 17, 2026
టీవీకే పార్టీ ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జున తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పై సంచలన ఆరోపణలు చేశారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు డీఎంకే పార్టీ ఆయన్ను భయపెట్టిందని.. దాంతో ఆయన వెనక్కి తగ్గారని సంచలన ఆరోపణలు చేశారు. అధవ్ అర్జున వ్యాఖ్యలతో తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అధవ్ అర్జునతో పాటు టీవీకే అధ్యక్షుడు విజయ్ కూడా రజనీకాంత్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్స్ వినిపించాయి.
. @actorvijay should meet #SuperstarRajinikanth at his home..
Jus a courtesy meeting.. No specific agenda as such..
In Cinema, #Superstar is the role model for Vijay..
Vijay should get his blessing as he is elder to him.. #Thalaivar always wished Vijay well..
— Ramesh Bala (@rameshlaus) March 17, 2026
ఈ క్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ లేఖను కూడా రిలీజ్ చేశారు. ‘కాలం మాట్లాడదు కానీ సమయం వచ్చినప్పుడు సమాధానం చెబుతుంది’ అని లేఖలో రజనీకాంత్ పేర్కొన్నారు. అధవ్ అర్జున వ్యాఖ్యలను ఖండించారు. తనకు మద్దతుగా నిలిచిన వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని లేఖలో స్పష్టం చేశారు. అయితే తాజాగా టీవీకే పార్టీ ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జున రజనీకాంత్ కు క్షమాపణలు చెప్పారు. తన మాటలు ఆయన్ను బాధపెట్టి ఉంటే క్షమించాలని ఓ బహిరంగ సమావేశంలో అధవ్ అర్జున మాట్లాడారు.
అయితే విజయ్ సైతం రజనీకాంత్ ను కలవాలని సోషల్ మీడియాలో పోస్టులు ప్రత్యక్షం అవుతున్నాయి. ఈ మేరకు ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ రమేశ్ బాలా.. తన ఎక్స్ మాధ్యమం వేదికగా పోస్టు చేశారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో రజనీకాంత్ ను తన నివాసంలో విజయ్ సమావేశం కావడం ఉత్తమం అని అభిప్రాయపడ్డారు. సినిమా ఇండస్ట్రీలో రజనీను విజయ్ రోల్ మోడల్ గా భావిస్తారని.. తమిళనాట ఎన్నికల నేపథ్యంలో రజనీకాంత్ బ్లెస్సింగ్స్ విజయ్ కు ఎంతో అవసరమని తెలిపారు. తలైవా ఎప్పుడూ విజయ్ మంచినే కోరుకున్నారని అన్నారు. ఈ క్రమంలో విజయ్.. రజనీను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


