Andhra Pradesh
oi-Sai Chaitanya
Tirumala:
తిరుమలలో
రద్దీ
కొనసాగుతోంది.
వరుస
సెలవుల
కారణంగా
రద్దీ
పెరిగింది.
పెరిగిన
రద్దీకి
అనుగుణంగా
టీటీడీ
నిర్ణయాలు
తీసుకుంటోంది.
తిరుమల
శ్రీవారి
ఆలయంలో
ఈనెల
30
నుంచి
జనవరి
8వ
తేదీ
వరకు
జరగనున్న
వైకుంఠద్వార
దర్శనాలకు
పూర్తిస్థాయిలో
ఏర్పాట్లు
చేసారు.
ఇదే
సమయంలో
కొత్త
సంవత్సరం
కావటంతో
భక్తుల
సంఖ్య
పెరిగే
అవకాశం
ఉంది.
దీంతో,
ఈ
సమయంలో
దర్శనంకు
వచ్చే
భక్తులకు
టీటీడీ
కీలక
సూచన
చేసింది.
వైకుంఠ
ద్వార
దర్శనం
కోసం
వచ్చే
భక్తులకు
టీటీడీ
ఈవో
సింఘాల్
కీలక
సూచనలు
చేసారు.
ఈ
పది
రోజులు
కూడా
పవిత్రమైనవే,
వాటిలో
ఏరోజు
స్వామివారిని
దర్శించుకున్నా
ఒకే
రకమైన
ప్రతిఫలం
లభిస్తుందని
సింఘాల్
చెప్పారు.
వైకుంఠ
ద్వార
దర్శనాల
కోసం
మొదటిసారి
ఈ-డిప్
విధానాన్ని
అందుబాటులోకి
తెచ్చామన్నారు.
మొదటి
మూడు
రోజుల
దర్శనాలకుగాను
దేశ
వ్యాప్తంగా
1,89,000
మంది
భక్తులకు
పూర్తి
పారదర్శక
విధానంలో
టోకెన్లు
జారీ
చేశామని
తెలిపారు.
టోకెన్లు
పొందినవారు
నిర్దేశిత
సమయంలోపు
తిరుమలకు
చేరుకుంటే
రెండు
గంటల్లోనే
శ్రీవారి
దర్శనాన్ని
పూర్తిగా
చేయిస్తామని
సింఘాల్
అన్నారు.
ఈ
మేరకు
మూడు
ప్రవేశమార్గాలను
కూడా
సిద్ధం
చేశామన్నారు.
కేటాయించిన
సమయానికి
వచ్చే
భక్తులకు
క్యూలైన్‌కు
దగ్గరగా
ఉన్న
ప్రవేశమార్గం
ద్వారా
లోపలికి
పంపుతామని
వెల్లడించారు.
సమయాని
కంటే
ముందుగా
వచ్చేవారిని
మరో
రెండు
ప్రవేశమార్గాల
గుండా
క్యూలైన్‌లోకి
తీసుకుని
వారికి
కేటాయించిన
సమయంలోనే
దర్శనానికి
పంపే
ఏర్పాట్లు
చేస్తున్నామని
తెలిపారు.
ఏకాదశికి
ముందు
29వ
తేదీన
మాత్రం
పరిమిత
సంఖ్యలో
టికెట్లు
జారీ
చేసి,
వారికి
అదేరోజు
దర్శనాలు
ముగిసేలా
చూస్తామని
సింఘాల్
అన్నారు.
ఆఫ్‌లైన్,
ఆన్లైన్లో
కలిపి
7,70,000
మందికి
పది
రోజుల్లో
శ్రీవారి
దర్శనం
కల్పించనున్నామని
ఈవో
వెల్లడించారు.
182
గంటల్లో
164
గంటలు
సామాన్యభక్తులకే
కేటాయించామని
తెలిపారు.
మిగిలిన
సమయం
మాత్రమే
వీఐపీలు,
వీవీఐపీలకు
కేటాయించామన్నారు.
ఈ
పది
రోజుల్లో
ప్రివిలేజ్
దర్శనాలు,
బ్రేక్
దర్శనాలను
మాత్రం
పూర్తిగా
రద్దు
చేశామని
చెప్పారు.
నేరుగా
వచ్చే
ప్రముఖులకే
దర్శనం
ఉంటుందన్నారు.
మాతృశ్రీ
తరిగొండ
వెంగమాంబ
కేంద్రంలో
ఉదయం
8
నుంచి
రాత్రి
12
గంటల
వరకు
నిరంతరాయంగా
అన్నప్రసాదాలు
అందిస్తామని
ఈవో
అనిల్‌కుమార్
సింఘాల్
తెలిపారు.
దాదాపు
16
రకాల
అన్నప్రసాదాలు,
పానీయాలు
సిద్ధం
చేస్తున్నామని
చెప్పారు.
వసతికి
సంబంధించి
ముందస్తు
ఏర్పాట్లు
ఇప్పటికే
పూర్తి
చేశామన్నారు.
తిరుమలలో
భద్రత
నిమిత్తం
పోలీసు
విభాగం
నుంచి
2400,
టీటీడీ
విజిలెన్స్
నుంచి
1100
మంది
సిబ్బందిని
నియమించామని
వెల్లడించారు.
టీటీడీకి
అనుబంధంగా
ఉన్న
ఆరు
లక్షల
మంది
శ్రీవారి
సేవకుల
సాయంతో
భక్తులకు
ఎలాంటి
ఇబ్బందులు
లేకుండా
చూస్తామని
ఈవో
పేర్కొన్నారు.


