Telangana
oi-Korivi Jayakumar
సంక్రాంతి
పండుగ
సందర్భంగా
తెలంగాణ
ప్రభుత్వం
చేనేత
కార్మికులకు
కీలక
ఉపశమనం
ప్రకటించింది.
నేతన్నలు
తీసుకున్న
రూ.1
లక్ష
వరకు
వ్యక్తిగత
రుణాలను
మాఫీ
చేస్తున్నట్లు
వెల్లడించింది.
ఈ
విషయాన్ని
హ్యాండ్లూమ్,
టెక్స్‌టైల్
శాఖ
మంత్రి
తుమ్మల
నాగేశ్వరరావు
తెలిపారు.
నేతన్నలకు
అప్పుల
భారం
తగ్గించి,
ఆర్థిక
స్థితిని
మెరుగుపరచాలనే
కారణంతోనే
ఈ
నిర్ణయం
తీసుకున్నట్టు
మంత్రి
స్పష్టం
చేశారు.
ఈ
రుణమాఫీతో
రాష్ట్రవ్యాప్తంగా
సుమారు
6,784
మంది
చేనేత
కార్మికులు
నేరుగా
లబ్ధి
పొందనున్నారు.
2017
నుంచి
2024
వరకు
పెండింగ్‌లో
ఉన్న
రుణాల
కోసం
ప్రభుత్వం
దాదాపు
రూ.27.14
కోట్లు
మంజూరు
చేసింది.
గత
కొన్నేళ్లుగా
అప్పుల
ఊబిలో
చిక్కుకున్న
నేతన్నలకు
ఇది
పెద్ద
ఊరట
అని
చెప్పవచ్చు.
ప్రభుత్వం
తీసుకున్న
ఈ
నిర్ణయం
పట్ల
సర్వత్రా
హర్షం
వ్యక్తం
అవుతోంది.
కాగా
రుణమాఫీతో
పాటు,
చేనేత
రంగాన్ని
బలోపేతం
చేసేందుకు
ప్రభుత్వం
పలు
చర్యలు
చేపట్టింది.
భవిష్యత్
అవసరాల
కోసం
అమలవుతున్న
చేనేత
భరోసా,
పొదుపు
పథకాలకు
రూ.303
కోట్లను
కేటాయించింది.
తీసుకున్న
రుణాలపై
వడ్డీ
భారం
తగ్గించేందుకు
పావలా
వడ్డీ
పథకాన్ని
కూడా
అమలు
చేస్తోంది.
అలానే
ఇందిరమ్మ
చీరల
పథకం
ద్వారా
నిరంతర
పని
కల్పిస్తూ,
టెస్కో
ద్వారా
వస్త్రాలను
ప్రభుత్వం
నేరుగా
కొనుగోలు
చేస్తోంది.
ఇప్పటివరకు
సుమారు
రూ.587
కోట్ల
విలువైన
వస్త్రాలను
కొనుగోలు
చేసినట్లు
మంత్రి
తుమ్మల
వెల్లడించారు.
మధ్యవర్తుల
ప్రమేయం
లేకుండా
కార్మికులకు
నేరుగా
ఆదాయం
అందేలా
ప్రభుత్వం
చర్యలు
తీసుకుంటోందని
ఆయన
చెప్పారు.
నేతన్నల
సంక్షేమమే
తమ
ప్రభుత్వ
ప్రాధాన్యతని
మంత్రి
తుమ్మల
నాగేశ్వరరావు
మరోసారి
పునరుద్ఘాటించారు.
ప్రభుత్వం
తీసుకున్న
ఈ
నిర్ణయంపై
రాష్ట్రవ్యాప్తంగా
చేనేత
సంఘాలు
హర్షం
వ్యక్తం
చేశాయి.
రుణమాఫీతో
పాటు
ఉపాధి,
మార్కెట్,
వడ్డీ
రాయితీల
రూపంలో
ప్రభుత్వం
అందిస్తున్న
సహాయానికి
కృతజ్ఞతలు
తెలిపారు.
ఓ
వైపు
కొద్ది
రోజుల్లోనే
పండుగ
జరుపుకునే
తరుణంలో
సర్కారు
మరో
పండుగ
లాంటి
వార్తను
అందించిందని
సంతోషం
వ్యక్తం
చేస్తున్నారు.


