రూ.10999 ప్రారంభ ధరతో స్మార్ట్‌టీవీలు విడుదల.. సంవత్సరం వారంటీతో సేల్!

Date:


oi
-Suravarapu Dileep

ఇండ్కల్‌ టెక్నాలజీస్‌కు చెందిన వోబుల్‌ గత సంవత్సరం భారత్‌ మార్కెట్‌లో తొలి స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. అయితే తాజాగా X, K సిరీస్‌లో గూగుల్ టీవీలను (Wobble X, K series Google TVs) విడుదల చేసింది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఈ రెండు సిరీస్ టీవీలు పనిచేస్తాయి. దీంతోపాటు HDR సపోర్టుతోపాటు వాయిస్‌ ఆధారంగా పనిచేసే రిమోట్‌లను కలిగి ఉన్నాయి.

డిస్‌ప్లే వేరియంట్స్ :
వోబుల్‌ K సిరీస్‌ గూగుల్‌ టీవీలు అనేక డిస్‌ప్లే వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఇందులో 32 అంగుళాల HD, 40 అంగుళాల FHD, 43 అంగుళాల FHD, 43 అంగుళాల 4K, 55 అంగుళాల 4K, 65 అంగుళాల 4K మోడల్స్‌ ఉన్నాయి. అన్ని వేరియంట్స్‌ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తాయి.

వోబుల్‌ X సిరీస్‌ స్మార్ట్‌టీవీలు QLED 4K రిజల్యూషన్‌ను కలిగి ఉన్నాయి. ఇందులో 43 అంగుళాలు, 50 అంగుళాలు, 55 అంగుళాల డిస్‌ప్లే మోడల్స్‌ ఉన్నాయి. ప్రతి వేరియంట్‌ 3840 x 2160 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 178 డిగ్రీల వ్యూయింగ్‌ యాంగిల్‌, 1.07 బిలియన్‌ కలర్స్‌ను సపోర్టు చేస్తుంది. దీంతోపాటు HLG, HDR10, డాల్బీ విజన్‌ను సపోర్టు చేస్తుంది.

ఆడియో అవుట్‌పుట్‌ :
వోబుల్‌ X సిరీస్‌ డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో 80W ఆడియో అవుట్‌పుట్‌ను అందిస్తుంది. అదే K సిరీస్‌ సూపర్‌ Fidelity ఆడియో ట్యూనింగ్‌ను కలిగి ఉంది. అయితే 32 అంగుళాలు, 40 అంగుళాలు, 43 అంగుళాల మోడల్స్‌ 30W అవుట్‌పుట్‌ను కలిగి ఉంది. అదే 55 అంగుళాల మోడల్ 36W, 65 అంగుళాల మోడల్ 40W ఆడియో అవుట్‌పుట్‌ను కలిగి ఉంది.

వోబుల్‌ X సిరీస్‌ స్మార్ట్‌టీవీలు 16GB స్టోరేజీతో A55 + A75 డ్యూయల్‌ కోర్‌ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇమేజ్‌ ప్రాసెస్, గేమింగ్‌ కోసం CRISP AI పిక్చర్‌ ఇంజిన్‌ను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్, ఆటో లోలేటెన్సీ మోడ్ కూడా ఉంది. K సిరీస్‌ 32 అంగుళాలు, 40 అంగుళాల మోడల్స్‌ 8GB స్టోరేజీతో A55 క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌ను కలిగి ఉన్నాయి. ఫ్రేమ్‌ స్టెబిలైజేషన్ ఇంజిన్‌ను కలిగి ఉంది. జీరో ఫ్రేమ్‌ డిజైన్‌, HDR10 సపోర్టు, 178 డిగ్రీల వ్యూయింగ్‌ యాంగిల్‌ ఉంది.

వోబుల్‌ K సిరీస్‌ 43 అంగుళాల FHD, 4K మోడల్స్‌ HDR10, డాల్బీ విజన్‌, డాల్బీ అట్మాస్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. K సిరీస్‌లోని 43 అంగుళాల 4K, 55 అంగుళాలు, 65 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్స్‌ AI అవుట్‌పుట్‌ అగ్మెంటేషన్‌ ఫీచర్‌ ఉంది. దీంతో ఫేసియల్‌ డిటెక్షన్‌, ఆబ్జెక్ట్ రికగ్నైజేషన్, సీన్ అనాలసిస్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. వోబుల్‌ K సిరీస్ 55, 65 అంగుళాల మోడల్స్ 16GB స్టోరేజీ సపోర్టు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ సామర్థ్యాలతో A55 + A72 డ్యూయల్‌ కోర్ చిప్‌ తో పనిచేస్తాయి.

ధర వివరాలు :
వోబుల్‌ K సిరీస్ 32 అంగుళాల HD మోడల్‌ ధర రూ.10999 గా ఉంది. 40 అంగుళాల FHD ధర రూ.14,499, 43 అంగుళాల FHD ధర రూ.17499, 43 అంగుళాల 4K మోడల్ ధర రూ.20499, 55 అంగుళాల 4K మోడల్‌ ధర రూ.20499, 65 అంగుళాల 4K మోడల్‌ ధర రూ.30499 గా ఉంది.

అదో వోబుల్‌ X సిరీస్‌ 43 అంగుళాల QLED 4K మోడల్‌ ధర రూ.23999, 50 అంగుళాల QLED 4K మోడల్‌ ధర రూ.30499, 55 అంగుళాల QLED 4K మోడల్ ధర రూ.34999 గా ఉంది. ఈ అన్ని మోడల్స్ సంవత్సరం వారంటీతో అందుబాటులో ఉన్నాయి.

Best Mobiles in India



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related