Telangana
oi-Bomma Shivakumar
ఇన్సురెన్స్
డబ్బు
కోసం
కట్టుకున్న
భర్తనే
హతమార్చింది
ఓ
మహిళ.
ఆ
డబ్బుతో
ఎంచక్కా
ప్రియుడితో
హ్యాపీగా
ఉండాలని
ప్లాన్
వేసింది.
పథకం
ప్రకారం..
భర్తను
చంపేసి
గుండెపోటు
డ్రామా
ఆడింది.
కానీ
చివరికి
పోలీసులకు
దొరికిపోయింది.
ఈ
షాకింగ్
ఘటన
నిజామాబాద్
జిల్లా
మాక్లూర్
మండలం
బోర్గాం(కే)
గ్రామంలో
వెలుగుచూసింది.
తన
వివాహేతర
సంబంధానికి
భర్త
అడ్డు
వస్తుండటం
అదే
విధంగా
భర్తపై
ఉన్న
ఇన్సూరెన్స్
డబ్బుల
కోసమే
రమేష్
ను
సౌమ్య
హత్య
చేయించినట్లు
పోలీసుల
విచారణలో
తేలింది.
నిజామాబాద్
జిల్లాలో
భర్తను
హత్య
చేసిన
కేసులో
బిగ్
ట్విస్ట్
వెలుగులోకి
వచ్చింది.
నిందితురాలు
సౌమ్యకు
దిలీప్
అనే
యువకుడితో
వివాహేతర
సంబంధం
ఉన్న
నేపథ్యంలో
ఈ
వివాహేతర
సంబంధానికి
తన
భర్త
పల్లాటి
రమేష్
అడ్డుగా
ఉన్నాడని
భావించి
అతడిని
హతమార్చేందుకు
ప్లాన్
వేసింది.
అలాగే
తన
భర్త
మరణిస్తే
అతడి
పేరుపై
ఉన్న
రూ.
2
కోట్ల
ఇన్సురెన్స్
డబ్బులతో
ప్రియుడితో
సెటిల్
అవ్వొచ్చని
ప్లాన్
వేసింది.
ఈ
మర్డర్
కు
ప్రియుడు
దిలీప్
సాయం
తీసుకుంది.
ఈ
విషయాలన్నీ
పోలీసుల
విచారణలో
బయటపడ్డాయి.
ఏం
జరిగిందంటే..?
నిజామాబాద్
జిల్లా
మాక్లూర్
మండలం
బోర్గాం(కే)
గ్రామానికి
చెందిన
పల్లాటి
రమేశ్(35),
సౌమ్య
దంపతులు.
వీరికి
పిల్లలు
లేరు.
రమేశ్
ఓ
ప్రైవేట్
కంపెనీలో
ఉద్యోగం
చేస్తున్నాడు..
సౌమ్య..
ఓ
ప్రైవేట్
స్కూల్
లో
టీచర్
గా
పనిచేస్తోంది.
అయితే
అదే
స్కూల్
లో
పనిచేసే
దిలీప్
తో
ఆమెకు
వివాహేతర
సంబంధం
ఏర్పడింది.
ఈ
విషయం
తెలిసిన
రమేశ్..
భార్య
సౌమ్యను
పలుమార్లు
మందలించాడు.
ఈ
క్రమంలో
తన
భర్తను
వదిలించుకుని
ప్రియుడు
దిలీప్
తో
జంప్
అవ్వాలని
సౌమ్య
నిర్ణయించుకుంది.
ఈ
క్రమంలో
రమేశ్
ను
హత్య
చేసేందుకు
ప్లాన్
వేశారు.
దిలీప్..
తన
స్నేహితుడు
అభిషేక్
ను
సాయం
కోరగా..
అతడు
అంగీకరించాడు.
ఈ
క్రమంలోనే
గతేడాది
ఆగస్టులో
రమేశ్
బైక్
పై
వెళ్తుండగా
అభిషేక్
కారుతో
వెనకాల
నుంచి
వచ్చి
గుద్ది
వెళ్లిపోయాడు.
ఈ
ప్రమాదంలో
రమేశ్
చేయి
విరిగింది.
ప్లాన్
ఫలించలేదు.
దీంతో
ఈ
సారి
ప్లాన్
మార్చారు.
సుపారీ
గ్యాంగ్
తో
చంపేందుకు
కుట్ర
పన్నారు.
అది
కూడా
పలు
కారణాల
వల్ల
బెడిసి
కొట్టింది.
ఇక
లాభం
లేదని
తామే
రమేశ్
ను
చంపేయాలని
ప్లాన్
వేశారు.
డిసెంబర్
19
న
రాత్రి
రమేశ్
భోజనం
చేయగానే
నిద్ర
మాత్రలు
కలిపిన
నీటిని
సౌమ్య
భర్తకు
ఇచ్చింది.
ఆ
నీళ్లు
తాగి
రమేశ్
గాఢ
నిద్రలోకి
వెళ్లాడు.
వెంటనే
అక్కడకు
ప్రియుడు
దిలీప్..
అతని
ఫ్రెండ్
అభిషేక్
వచ్చి
రమేశ్మెడకు
టవల్‌చుట్టి,
ముఖంపై
దిండు
అదిమిపెట్టి
ఊపిరాడకుండా
చేసి
చంపేసి
వెళ్లిపోయారు.
మరుసటిరోజు
ఉదయం
రమేశ్
హార్ట్
ఎటాక్
తో
నిద్రలోనే
మృతి
చెందాడని
సౌమ్య
కుటుంబ
సభ్యులు,
బంధువులను
నమ్మించింది.
అదే
రోజు
అంత్యక్రియలు
కూడా
పూర్తయ్యాయి.
అయితే
రమేశ్
మెడపై
గాయాలు,
సౌమ్య
ప్రవర్తన
గమనించిన
మృతుడి
సోదరుడు
పోలీసులకు
ఫిర్యాదు
చేశాడు.
దాంతో
రంగంలోకి
దిగిన
పోలీసులు
మృతదేహాన్ని
వెలికితీసి
పోస్టు
మార్టం
నిర్వహించారు.
ఈ
క్రమంలో
రమేశ్
ది
హత్యగా
రిపోర్టులో
తేలింది.
దాంతో
సౌమ్యను
తమదైన
శైలిలో
పోలీసులు
విచారించగా
నిజం
మొత్తం
బయటకు
వచ్చింది.
దీంతో
సౌమ్య
ఆమె
ప్రియుడు
దిలీప్,
అభిషేక్
మరికొంత
మందిని
పోలీసులు
అరెస్ట్
చేశారు.


