రూ.200 కంటే తక్కువ ధరలో Vi రీఛార్జ్‌ ప్లాన్‌లు.. లిస్ట్‌, ప్రయోజనాలు..!

Date:


News

oi-Suravarapu Dileep

|

వోడాఫోన్‌ ఐడియా (Vodafone Idea) టెలికాం నెట్‌వర్క్‌ యూజర్ల పరంగా దేశంలో మూడో స్థానంలో ఉంది. ఇతర టెలికాం సంస్థలతో పోలిస్తే అనేక ప్రత్యేక రీఛార్జ్‌ ప్లాన్‌లను కలిగి ఉన్నాయి. ఈ సంవత్సరం తొలి భాగంలో 5G నెట్‌వర్క్‌ ను ప్రారంభించింది. ముంబైలో తొలుత 5G ను అందుబాటులోకి తీసుకొచ్చింది. క్రమంగా ప్రధాన నగరాలు, పట్టణాలకు విస్తరిస్తోంది. ప్రస్తుతం రూ.200 కంటే తక్కువ ధరలో వోడాఫోన్‌ ఐడియా (VI) బెస్ట్ డేటా ప్లాన్‌ లను అందిస్తోంది.

* రూ.95 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌ లో (Vi Rs95 Recharge Plan) 4GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ డేటా వ్యాలిడిటీ 14 రోజులుగా ఉంటుంది. దీంతోపాటు 28 రోజుల వ్యాలిడిటీతో Sony LIV మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ ను పొందవచ్చు.

* వోడాఫోన్‌ ఐడియా రూ.101 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌ లో (Vi Rs101 Recharge Plan) భాగంగా యూజర్లు 5GB డేటాను పొందుతారు. దీంతోపాటు జియోహాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ ను కూడా వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది.

* వోడాఫోన్‌ ఐడియా రూ.145 రీఛార్జ్‌ ప్లాన్ :
ఈ ప్లాన్‌ లో (Vi Rs145 Recharge Plan) భాగంగా వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్‌ యూజర్లు రోజువారీ 1GB డేటాను పొందుతారు. కాలింగ్‌, SMS ప్రయోజనాలను ఈ ప్లా్న్‌ లో అందించడం లేదు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.

* Vi రూ.151 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌ లో (Vi Rs151 Recharge Plan) భాగంగా యూజర్లు 4GB డేటాను పొందుతారు. జియోహాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ ను కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌ లో ఇంకా ఎటువంటి అదనపు ప్రయోజనాలు పొందలేరు.

* వోడాఫోన్‌ ఐడియా రూ.169 రీఛార్జ్‌ ప్లాన్ :
ఈ ప్లాన్‌ లో (Vi Rs169 Recharge Plan) భాగంగా వోడాఫోన్‌ ఐడియా యూజర్లు 8GB డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు జియోహాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ ను కూడా పొందవచ్చు. డేటా, ఓటీటీ వ్యాలిడిటీ 90 రోజులుగా ఉంటుంది.

* Vi రూ.175 రీఛార్జ్‌ ప్లాన్ :
ఈ ప్రీపెయిడ్‌ రీఛార్జ్ ప్లాన్‌ లో (Vi Rs175 Recharge Plan) యూజర్లు 10GB డేటాను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు ZEE5, SonyLIV, ఫ్యాన్‌కోడ్‌, Liongate Play, Playflix, మనోరమ మ్యాక్స్‌ సహా మరిన్ని ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు 350 కంటే ఎక్కువ టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు. వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.

* Vi రూ.202 రీఛార్జ్ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌ లో (Vi Rs202 Recharge Plan) వోడాఫోన్ ఐడియా యూజర్లు 5GB డేటాను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు జియోహాట్‌స్టార్‌, SonyLIV, ఫ్యాన్‌కోడ్‌, Playflix, Liongate Play, మనోరమ మ్యాక్స్‌ వంటి అనేక సబ్‌స్క్రిప్షన్‌లను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ నెల రోజులుగా ఉంటుంది.

More News

Best Mobiles in India

English summary

Vodafone idea Offers best data recharge plans under Rs200 here is the list and benefits

Story first published: Thursday, November 27, 2025, 16:02 [IST]



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Sarwat Hussain Digital Media centre opened at Osmania University’s Journalism department

The Department of Journalism and Mass Communication at Osmania...

Kashus Culpepper Talks Debut Album ‘Act I’

Over the past year, Kashus Culpepper’s musical confluence of...