రూ.300 కంటే తక్కువ ధరలో వోడాఫోన్‌ ఐడియా రీఛార్జ్‌ ప్లాన్‌లు.. పూర్తి వివరాలు..!

Date:


News

oi-Suravarapu Dileep

|

వోడాఫోన్ ఐడియాకు (Vodafone idea) ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ ఊరట లభించింది. ఏజీఆర్‌ బకాయిలు రూ.87,695 కోట్లు ఫ్రీజ్‌ చేయడం సహా అయిదేళ్ల మారటోరియంకు ఆమోదం తెలిపింది. 2031-32 నుంచి 2040-41 వరకు ఈ చెల్లింపులను పూర్తి చేసేందుకు వీలు కలిగినట్లు తెలిపింది. ప్రస్తుతం వోడాఫోన్‌ ఐడియా (Vi) 20 కోట్ల మంది ప్రయోజనాలను కాపాడడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం వోడాఫోన్‌ ఐడియా (Vi) యూజర్ల పరంగా దేశంలో మూడో స్థానంలో ఉంది. Vi ప్రత్యేక రీఛార్జ్‌ ప్లాన్‌లను కలిగి ఉంది. ఈ జాబితాలో అనేక రీఛార్జ్‌ ప్లాన్‌లు ఉన్నాయి.

రూ.179 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో (Vi Rs179 Recharge plan) భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు. దీంతోపాటు మొత్తంగా 300 SMS లను వినియోగించుకోవచ్చు. మొత్తంగా 1GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 24 రోజులుగా ఉంది.

రూ.189 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో (Vi Rs189 Recharge plan) భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు. దీంతోపాటు మొత్తంగా 300 SMS లను వినియోగించుకోవచ్చు. మొత్తంగా 1GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 26 రోజులుగా ఉంది.

రూ.199 రీఛార్జ్ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో (Vi Rs199 Recharge plan) భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. మొత్తంగా 300 SMS లను పొందవచ్చు. దీంతోపాటు మొత్తంగా 2GB డేటాను వినియోగించుకోవచ్చు. Vi యాప్‌ లో లైవ్‌ న్యూస్‌, టీవీ షోలు, సినిమాలను వీక్షించవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.

రూ.209 రీఛార్జ్ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో (Vi Rs209 Recharge plan) భాగంగా వోడాఫోన్‌ ఐడియా యూజర్లు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. దీంతోపాటు మొత్తంగా 300 SMS ను పొందవచ్చు. 2GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. కాలర్‌ట్యూన్స్‌ను కూడా ఉచితంగా పొందవచ్చు.

రూ.218 రీఛార్జ్‌ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Vi Rs218 Recharge plan) భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు మొత్తంగా 3GB డేటా, 300 SMS లను అందిస్తోంది. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ నెలరోజులుగా ఉంటుందని వోడాఫోన్‌ ఐడియా తెలిపింది.

రూ.239 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Vi Rs239 Recharge plan) యూజర్లు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. దీంతోపాటు 300 SMS లను పొందవచ్చు. 2GB డేటాను ఉపయోగించుకోవచ్చు. వీటితోపాటు నెల రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.

రూ.299 రీఛార్జ్‌ ప్లాన్‌ :
వోడాఫోన్‌ ఐడియా యూజర్లు ఈ ప్లాన్‌లో (Vi Rs299 Recharge plan) భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ను అందిస్తోంది. రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 1GB డేటాను ఉపయోగించుకోవచ్చు. Vi యాప్‌ లో టీవీ షో, సినిమాలు, లైవ్‌ న్యూస్‌ను వీక్షించవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.

More News

Best Mobiles in India

English summary

Vodafone idea Offers best prepaid recharge plans under Rs300, here is the list

Story first published: Thursday, January 1, 2026, 12:26 [IST]



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related