India
oi-Chandrasekhar Rao
ఇండిగో
సంక్షోభం
నేపథ్యంలో
పౌర
విమానయాన
మంత్రిత్వ
శాఖ
వ్యూహాత్మక
నిర్ణయాన్ని
తీసుకుంది.
కొత్తగా
రెండు
పౌర
విమానయాన
సంస్థలకు
అనుమతులు
మంజూరు
చేసింది.
దీనికి
అవసరమైన
నో
అబ్జెక్షన్
సర్టిఫికెట్
ను
జారీ
చేసింది.
అల్
హింద్
ఎయిర్,
ఫ్లైఎక్స్‌ప్రెస్‌లకు
ఎన్ఓసీ
లభించాయి.
ఈ
రెండింటితో
పాటు
శంఖ్
ఎయిర్
కు
కూడా
ఎన్ఓసీ
అందింది.ఇండిగో
సంక్షోభం
వల్ల
తలెత్తిన
అంతరాయాల
దృష్టిలో
పెట్టుకుని
కేంద్రం
ఈ
నిర్ణయం
తీసుకుంది.
దేశీయ
విమాన
మార్కెట్‌పై
ఇండిగో,
ఎయిర్
ఇండియా
గ్రూప్‌లు
గుత్తాధిపత్యం
సాగిస్తోన్నాయనేది
బహిరంగ
రహస్యమే.
ఎయిర్
ఇండియా,
ఎయిర్
ఇండియా
ఎక్స్‌ప్రెస్‌లతో
కూడిన
ఈ
గ్రూప్
దేశీయ
ప్రయాణంలో
90
శాతం
పైగా
వాటాను
కలిగి
ఉంది.
ఇండిగో
వాటా
65
శాతం
పైమాటే.
ఈ
నెలలో
ఇండిగో
విమానాల్లో
తలెత్తిన
అంతరాయాలు
దేశవ్యాప్తంగా
ప్రయాణికులను
ఇబ్బంది
పెట్టాయి.
విస్తరిస్తున్న
భారత
మార్కెట్లో
ఒకట్రెండు
విమాన
సంస్థపై
అధిక
ఆధారపడటం
వల్ల
కలిగే
నష్టాలను
ఈ
సంఘటన
తేటతెల్లం
చేసింది.
ఏటా
పెరుగుతున్న
ప్రయాణీకుల
సంఖ్యకు
అనుగుణంగా
సరిపడా
పౌర
విమానయాన
సంస్థలు
అందుబాటులో
లేవనేది
మొన్నటి
ఇండిగో
సంక్షోభంతో
తేలిపోయింది.
దీంతో
కొత్త
పౌర
విమానయాన
సంస్థలకు
కేంద్ర
ప్రభుత్వం
తాజా
ఎన్ఓసీలను
జారీ
చేసింది.
ఈ
విషయాన్ని
పౌర
విమానయాన
శాఖ
మంత్రి
కింజరాపు
రామ్మోహన్
నాయుడు
ధృవీకరించారు.
శంఖ్
ఎయిర్,
అల్
హింద్
ఎయిర్,
ఫ్లైఎక్స్‌ప్రెస్
ప్రతినిధులతో
మంత్రిత్వ
శాఖ
సమావేశమైందని
ఆయన
పేర్కొన్నారు.
శంఖ్
ఎయిర్‌కు
గతంలోనే
క్లియరెన్స్
లభించగా,
మిగిలిన
రెండు
సంస్థలకు
ఎన్ఓసీలు
తాజాగా
మంజూరు
అయ్యాయి.
అల్
హింద్
ఎయిర్‌ను
కేరళకు
చెందిన
అల్
హింద్
గ్రూప్
నిర్వహిస్తోంది.
పౌర
విమానయానంలో
ఈ
సంస్థకు
మంచి
అనుభవం
ఉంది.
ఇప్పటికే
ఎన్ఓసీ
ఉన్న
శంఖ్
ఎయిర్
2026లో
వాణిజ్య
విమాన
సేవలు
ప్రారంభించాలని
చూస్తోంది.
ఈ
మూడు
సంస్థలూ
తమ
సేవలను
ప్రారంభించడానికి
ముందు
రెగ్యులేటరీ,
ఆపరేషనల్
దశలను
పూర్తి
చేయాల్సి
ఉంటుంది.
దేశ
విమానయాన
రంగం
వేగంగా
విస్తరిస్తున్న
నేపథ్యంలో
మరిన్ని
సంస్థలను
ప్రోత్సహించడం
ప్రభుత్వ
దీర్ఘకాలిక
లక్ష్యమని
రామ్మోహన్
నాయుడు
వివరించారు.
చిన్న
నగరాలు,
పట్టణాలకు
విమాన
కనెక్టివిటీని
మెరుగుపరిచే
‘ఉడాన్’
వంటి
పథకాలను
ఆయన
ఈ
సందర్భంగా
ఉదహరించారు.
ఉడాన్
పథకం
ద్వారా
స్టార్
ఎయిర్,
ఇండియా
వన్
ఎయిర్,
ఫ్లై91
వంటి
సంస్థలు
గతంలో
విమాన
సేవలు
లేని
మార్గాల్లో
కార్యకలాపాలు
ప్రారంభించాయి.
ఈ
సేవలు
చిన్న
నగరాలను
జాతీయ
ఏవియేషన్
నెట్‌వర్క్‌లో
చేర్చాయి.


