Telangana
oi-Sai Chaitanya
తెలంగాణ
రాజకీయాలు
ఆసక్తి
కరంగా
మారుతున్నాయి.
పార్టీ
నేతలతో
భేటీ
తరువాత
మాజీ
సీఎం
కేసీఆర్
కీలక
కాంగ్రెస్
ప్రభుత్వం
పై
మండిపడ్డారు.
నదీ
జలాలా
వినియోగం..
హక్కుల
రక్షణలో
ప్రభుత్వం
వైఫల్యం
చెందిందని
విమర్శించారు.
రేవంత్
ప్రభుత్వం
రియల్
ఎస్టేట్
వ్యాపారానికే
పరిమితం
అయిందని
ఆగ్రహం
వ్యక్తం
చేసారు.
త్వరలో
భారీ
సభలు
నిర్వహిస్తున్నట్లు
కేసీఆర్
వెల్లడించారు.
దీని
పైన
సీఎం
రేవంత్
ఘాటుగా
స్పందించారు.
దీంతో..
ఇప్పుడు
రేవంత్
లక్ష్యం
గా
మాజీ
మంత్రి
హరీష్
చేసిన
వ్యాఖ్యలు
సంచలనంగా
మారాయి.
సీఎం
రేవంత్
రెడ్డిపై
మాజీ
మంత్రి
హరీష్
రావు
హాట్
కామెంట్స్
చేశారు.
బీఆర్‌ఎస్
హయాంలో
తెలంగాణ
అద్భుత
ఆర్థిక
ప్రగతి
సాధించిందని
అన్నారు.
జీఎస్‌డీపీ,
తలసరి
ఆదాయంలో
కేసీఆర్
రాష్ట్రాన్ని
దేశానికే
తలమానికంగా
నిలిపారని
చెప్పారు.
మూడురెట్ల
జీఎస్‌డీపీ,
తలసరి
ఆదాయం
పెరిగిందన్నారు.
బీఆర్‌ఎస్
హయాంలో
ఆర్థిక
అరాచకత్వం
జరిగిందని
రేవంత్
ఆరోపించారని,
రాజకీయాల
కోసం
రాష్ట్రం
పరువు
తీయొద్దని
ఆయనను
కోరుతున్నానని
తెలి
పారు.
సొంత
పార్టీ
నేతలనే
తొక్కుకుంటూ
ఎదిగినట్లు
రేవంతరెడ్డే
స్వయంగా
చెప్పారని
హరీశ్
రావు
గుర్తుచేశారు.
రూ.50
కోట్లు
పెట్టి
రేవంత్
రెడ్డి
పీసీసీ
పదవిని
కొనుగోలు
చేసినట్లు
గతంలో
కోమటిరెడ్డి
చెప్పారని
గుర్తు
చేసారు.
తమది
అలాంటి
నాయకత్వం
కాదని,
నిజాయతీగా
త్యాగాల
పునాదులపై
ఎదిగిన
నాయకత్వమని
చెప్పారు.
ఎమ్మెల్యే
పదవులు,
మంత్రి
పదవులను
గడ్డిపోచల్లా
త్యాగాలు
చేసిన
చరిత్ర
తమ
పార్టీ
నేతలదని
హరీష్
పేర్కొన్నారు.
కేసీఆర్
ప్రజల
పక్షాన
ప్రశ్నిస్తే..
సీఎం,
నీళ్ళ
మంత్రికి
ఎందుకంత
నొప్పి
అని
నిలదీశారు.
ఎవరి
ఒత్తిడితో
నీటి
వాటాను
తగ్గించుకున్నారని
ప్రశ్నించారు.
45
టీఎంసీలకు..
మంత్రి
ఉత్తమ్
స్వయంగా
తన
దస్తూరితో
కేంద్రానికి
లేఖ
రాశారని
చెప్పారు.
ఉత్తమ్
కుమార్
రెడ్డి..
ఉత్తర
కుమారుడిలా
మిగిలిపోయారని
ఎద్దేవా
చేశారు.
కాంగ్రెస్
అనుభవమంతా
దోపిడికి,
లూటీకి
పనికొస్తుందని
కీలక
వ్యాఖ్యలు
చేసారు.
రేవంత్‌కు
ఒక
స్టాండ్,
సిద్దాంతం,
పద్ధతి
లేదన్నారు.
ధాన్యం,
డాక్టర్ల
ఉత్పత్తిలో
తెలంగాణను
నంబర్
వన్
చేసిందే
కేసీఆర్
అని
అన్నారు.
ఉత్తమ్
కుమార్
రెడ్డి..
ఇప్పుడైనా
ప్రిపేర్
అయ్యి
ప్రెస్‌మీట్స్
నిర్వహించాలని
ఎద్దేవా
చేశారు.
నీళ్ళ
మంత్రి
ఉత్తమ్‌కు
సగం
సగం
నాలెడ్జ్
మాత్రమే
ఉందంటూ
మాజీ
మంత్రి
హరీష్
రావు
వ్యాఖ్యానించారు.


