రైతు భరోసా అమలు పై మారిన నిర్ణయం, కొత్త లెక్కలు..!!

Date:


Telangana

oi-Sai Chaitanya

రైతు భరోసా నిధులు విడుదల ఎప్పుడు. కొంత కాలంగా రైతులు ప్రభుత్వం నుంచి ఈ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. తాజాగా జరిగిన మంత్రివర్గ భేటీలో ఈ మేరకు నిర్ణయం ఉంటుందని అంచనా వేసారు. అయితే… కేబినెట్ భేటీలో మాత్రం ఎలాంటి నిర్ణయం జరగలేదు. దీంతో.. అసలు ఈ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారనే సందేహం మొదలైంది. కాగా.. ఈ నిధుల విడుదల మాత్రం ప్రభుత్వంలోని ముఖ్యులు మాత్రం స్పష్టత ఇస్తున్నారు. దీంతో.. రైతులు ఈ నిధుల జమ ప్రకటన పైన ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు.

రైతులు నిరీక్షిస్తున్న రైతు భరోసా నిధుల విడుదల మరింత ఆలస్యం కనిపిస్తోంది. తాజాగా జరిగిన మంత్రివర్గ భేటీలో ఎలాంటి నిర్ణయం లేకపోవటంతో.. ప్రభుత్వం నిధుల విడుదల పైన ఆలోచన మారిందనే చర్చ జరుగుతోంది. అయితే… అధికారుల సమాచారం మేరకు రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియ రెగ్యులర్ ప్రాసెస్ కావటంతో.. కొత్తగా కేబినెట్ లో చర్చ అవసరం ఉండదని చెబుతున్నారు. ఇప్పటికే నిధుల సమీకరణ పూర్తి కావటంతో… ఈ నెలాఖరులో నిధులు విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. వాస్తవంగా సంక్రాంతి సమయంలోనే నిధులు విడుదల చేస్తారని రైతులు వేచి చూసారు. కాగా, తాజాగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావటంతో.. కోడ్ ఎత్తివేసిన వెంటనే రైతుల ఖాతాల్లో.. ఈ నెల 17వ తేదీ నిధులు జమ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పటి వరకు ప్రభుత్వం అధికారికంగా భరోసా నిధుల జమ పైన ఎలాంటి ప్రకటన చేయలేదు. అధికారులు మాత్రం ఈ నెలాఖరులోకా నిధుల విడుదలకు అవకాశం ఉందని చెబుతున్నారు.

కేబినెట్ లో నిర్ణయం వేచి చూసినా

ఈ నెల చివరి వారంలో రైతులకు పెట్టుబడిసాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని అధికారులు చెబుతున్నారు. యాసంగి సీజన్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఈ నిధులను ఒకే విడతలో రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు కసరత్తు వేగవంతం చేసినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. రైతులకు సాగు పెట్టుబడికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వారి ఖాతాల్లో నగదు జమ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు. మునిసిపల్‌ ఎన్నికల కోడ్‌, ఇతర సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైన ఈ ప్రక్రియను ఇప్పుడు వేగవంతం చేశారు. విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు డబ్బు అవసరమైన తరుణంలో ప్రభుత్వం రైతు భరోసా విడుదల చేస్తే తమకు ఎంతో ఊరట కలుగుతుందని రైతులు భావిస్తున్నారు. దీంతో.. ప్రభుత్వం ఈ నిధుల జమ పైన చేసే ప్రకటన కోసం రైతులు వేచి చూస్తున్నారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related