రైతు భరోసా ఆగిపోతోందా ? తేల్చేసిన తెలంగాణ సర్కార్..!

Date:


Telangana

oi-Syed Ahmed

తెలంగాణలో
రైతులకు
ఇన్
పుట్
సబ్సిడీ
కోసం
అమలు
చేస్తున్న
రైతు
భరోసా
పథకాన్ని
త్వరలో
ప్రభుత్వం
నిలిపేయబోతున్నట్లు
తాజాగా
ప్రచారం
జరుగుతోంది.

పథకంపై
క్షేత్రస్దాయిలో
జరుగుతున్న
సర్వే
నేపథ్యంలో

ప్రచారం
మొదలైంది.
ఇప్పటికే

పథకం
ద్వారా
లబ్దిపొందుతున్న
వారి
వివరాలను
సేకరిస్తున్న
తరుణంలో
మొదలైన

ప్రచారం
ప్రభుత్వాన్ని
ఇరుకునపెట్టింది.
దీంతో
సర్కార్
ఇవాళ
దీనిపై
స్పందించింది.

రైతు
భరోసా
ఆగిపోవడం
లేదని
తెలంగాణ
సర్కార్
ఇవాళ
ఫ్యాక్ట్
చెక్
ద్వారా
క్లారిటీ
ఇచ్చింది.

పథకం
ఆగిపోతున్నట్లు
వస్తున్న
వార్తలు
అబద్ధం,
నకిలీ,
దురుద్దేశంతో
కూడుకున్నవని
వెల్లడించింది.
తెలంగాణ
వ్యాప్తంగా
65
లక్షలకు
పైగా
రైతులకు
ప్రయోజనం
చేకూర్చే
రైతు
భరోసా
ఆపేయడం
లేదని
స్పష్టం
చేసింది.
నిజమైన
లబ్ధిదారులకు
మాత్రమే
ప్రభుత్వం
నుండి
ఆర్థిక
సహాయం
అందేలా
సంబంధిత
జిల్లా
కమిటీలు
గ్రౌండ్
వెరిఫికేషన్
నిర్వహిస్తున్నాయని,
ఆర్థిక
శాఖ
చెల్లింపు
కోసం
లబ్ధిదారుల
జాబితాను
సిద్ధం
చేస్తోందని,
తిరిగి
తనిఖీ
చేస్తోందని
తెలిపింది.
రైతు
భరోసా
ఆపేస్తున్నారనే
వార్తలు
లబ్దిదారుల్ని
పూర్తిగా
తప్పుదోవపట్టించేవి
అని
పేర్కొంది.

ప్రొఫెసర్
కొత్తపల్లి
జయశంకర్
తెలంగాణ
వ్యవసాయ
విశ్వవిద్యాలయం,
జర్మన్
టెక్నాలజీ
సహాయంతో,
వాణిజ్య
వినియోగంలో
ఉన్న,
ఇప్పటికీ
రైతు
భరోసా
పొందుతున్న
భూములను
లబ్ధిదారుల
జాబితా
నుండి
మినహాయించడానికి
‘ఉపగ్రహ
మ్యాపింగ్’
జరుగుతున్నట్లు
తెలిపింది.
గతేడాది
హైదరాబాద్,
చుట్టుపక్కల,
ఔటర్
రింగ్
రోడ్,
రీజినల్
రింగ్
రోడ్‌లలో
4
లక్షల
ఎకరాల
భూమి
వాణిజ్య
వినియోగంలో
ఉందని
గ్రౌండ్
సర్వేలో
వెల్లడైందని
తెలిపింది.

మ్యాపింగ్
ఉద్దేశం
లబ్ధిదారునికి
ఎంత
సాగు
భూమి
ఉందనేది
తెలుసుకోవడమే
అని
వెల్లడించింది.

రైతు
భరోసా
పొందుతున్న
భూమి
రియల్
ఎస్టేట్
వెంచర్,
కొండ,
రోడ్లు
లేదా
ఫామ్‌హౌస్
కాదా
అని
ధృవీకరించడానికి
కూడా
ఇది
సహాయపడుతుందని
తెలిపింది.
వాణిజ్య
ప్రయోజనం
కోసం
ఉపయోగిస్తున్న
భూములు
రైతు
భరోసా
ఆర్థిక
సహాయానికి
అర్హమైనవి
కావని
స్పష్టం
చేసింది.
మ్యాపింగ్
అనేది
రికార్డులతో
ఫీల్డ్
డేటాను
ధృవీకరించడానికి
మాత్రమే
అని
తెలిపింది.
మ్యాపింగ్
పూర్తయిన
తర్వాత,
గ్రౌండ్
రియాలిటీ
ఆధారంగా
జాబితా
నుండి
తొలగింపులు
ఉంటాయని
పేర్కొంది.

తెలంగాణ
వ్యాప్తంగా
65
లక్షల
మంది
లబ్ధిదారులకు
గత
సంవత్సరం
రూ.8,500-రూ.9000
కోట్లు
పంపిణీ
చేశామని
ప్రభుత్వం
తెలిపింది.
ఇందులో
ఎటువంటి
షరతులు
విధించలేదని
వెల్లడించింది.
తెలంగాణ
ప్రభుత్వం
షరతులు
విధించదని,
ఒక
రైతు
రావి
లేదా
ఖరీఫ్
సమయంలో
పంటను
పండించవచ్చని,
ఇప్పటికీ
అర్హత
కలిగి
ఉండవచ్చని
తెలిపింది.
ఒక
సీజన్‌లో
ఒకే
పంట
పండించినప్పటికీ
ఆర్థిక
సహాయం
అందిస్తామని
తెలిపింది.
లబ్ధిదారులకు
రెండు
సీజన్లకు
ఎకరానికి
రూ.12వేలు
ఇస్తామని
తెలిపింది.
జాబితా
నుండి
పేర్లు
తొలగించబడి
అభ్యంతరాలు
ఉన్నవారు
స్పష్టత
కోసం
జిల్లా
కలెక్టర్
లేదా
జిల్లా
స్థాయి
రెవెన్యూ
అధికారులను
సంప్రదించవచ్చని
తెలిపింది.





Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related