India
oi-Bomma Shivakumar
ఆ
పారిశుద్ధ్య
కార్మికురాలు
చేసిన
పనికి
అందరూ
ఫిదా
అవుతున్నారు.
రోడ్డు
వెంట
విధులు
నిర్వర్తిస్తున్న
ఆమెకు
రూ.
45
లక్షల
విలువైన
బంగారం
కలిగిన
ఓ
బ్యాగ్
కనిపించింది.
అయితే
ఆ
బ్యాగును
భద్రంగా
తీసుకెళ్లి
స్థానిక
పోలీస్
స్టేషన్
లో
అప్పజెప్పింది.
దాంతో
ఆమె
చేసిన
పనికి
కాలనీ
వాసులతో
పాటు
నెటిజన్లు
ప్రశంసల
వర్షం
కురిపిస్తున్నారు.
ఈ
ఘటన
తమిళనాడులో
జరిగింది.
తమిళనాడు
చెన్నెలోని
టీ
నగర్
కు
చెందిన
శానిటేషన్
వర్కర్
పద్మ
రోజూలాగే
ముప్పత్
మాన్
టెంపుల్
స్ట్రీట్
కాలనీలోని
రోడ్లను
శుభ్రం
చేస్తోంది.
అయితే
ఆమెకు
ఓ
బ్యాగ్
తారసపడింది.
ఏంటా
అని
బ్యాగ్
ను
ఓపెన్
చేయగా
అందులో
రూ.
45
లక్షల
విలువైన
బంగారు
ఆభరణాలు
కనిపించాయి.
దీంతో
ఒక్కసారిగా
షాక్
తిన్న
పద్మ..
ఆ
బ్యాగును
తీసుకుని
నేరుగా
పాండీ
బజార్
పోలీస్
స్టేషన్
కు
వెళ్లి
అధికారులకు
అప్పజెప్పింది.
దాంతో
ఆ
బ్యాగును
తీసుకున్న
పోలీసులు
విచారణ
చేపట్టారు.
అందులోని
బంగారు
ఆభరణాల
ఆధారంగా
బ్యాగ్
పోగొట్టుకున్న
వ్యక్తిని
వెతికే
పనిలో
నిమగ్నమయ్యారు.
ఈ
క్రమంలో
నంగనల్లూర్
కు
చెందిన
రమేశ్
అనే
వ్యక్తి
అప్పటికే
పోలీసులకు
ఫిర్యాదు
చేశాడు.
బంగారు
ఆభరణాలతో
కూడిన
తన
బ్యాగ్
పోయినట్లు
కంప్లైంట్
ఇచ్చాడు.
అయితే
ఈ
క్రమంలో
రమేశ్
చెప్పిన
సమాచారం..
బ్యాగులోని
బంగారు
ఆభరణాలను
క్రాస్
చెక్
చేసుకుని
ఆ
బ్యాగ్
రమేశ్
దేనని
నిర్ధారించుకున్నారు.
దాంతో
పోలీసులు
ఆ
బ్యాగ్
ను
రమేశ్
కు
అప్పజెప్పారు.
అయితే
రోడ్డు
వెంట
ఆ
బ్యాగ్
ను
చూడగానే
భద్రంగా
దాన్ని
పోలీస్
స్టేషన్
లో
అప్పజెప్పిన
పద్మపై
అటు
అధికారులు..
ఇటు
నెటిజన్లు
ప్రశంసల
వర్షం
కురిపిస్తున్నారు.
ఇక
పద్మ
భర్త
సుబ్రమణి
కూడా
ఇలాగే
ఓసారి
బ్యాగ్
దొరికితే
పోలీస్
స్టేషన్
లో
ఇచ్చి
ప్రశంసలు
పొందాడు.
అయితే
పద్మ
చేసిన
పనికి
తమిళనాడు
సీఎం
స్టాలిన్
ఫిదా
అయ్యారు.
పద్మకు
గౌరవ
సత్కారంతోపాటుగా
రూ.
లక్ష
నగదు
ప్రోత్సాహం
అందించారు.


