లక్నోలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. NEET ఒత్తిడితో ఇంత కిరాతకమా !!

Date:


India

oi-Korivi Jayakumar

ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నగరంలో సంచలన ఘటన వెలుగుచూసింది. వైద్య ప్రవేశ పరీక్ష NEET కోసం చదవాలని ఒత్తిడి చేయడంతో 21 ఏళ్ల యువకుడు.. ఆగ్రహంతో తండ్రిని హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా.. అసలు విషయం బయటికి రావడంతో పోలీసులతో పాటు స్థానికులు సైతం షాక్ అవుతున్నారు. ఈ కేసు వివరాలను పోలీసులు వెల్లడించగా.. కుటుంబ విభేదాలు, విద్యా ఒత్తిడి ఈ దారుణానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. వార్ధమాన్ పాథాలజీ యజమాని 50 ఏళ్ల మాన్వేంద్ర ప్రతాప్ సింగ్ ఫిబ్రవరి 20 నుంచి కనిపించకుండా పోయాడని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. గాలింపు చర్యల్లో భాగంగా పోలీసులు ఇంటిని తనిఖీ చేయగా.. అనుమానాస్పద పరిస్థితుల్లో ఇంట్లోని డ్రమ్‌లో మృతదేహం లభ్యమైంది. కుమారుడు అక్షత్ ప్రతాప్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.

అయితే NEET సన్నద్ధతపై తండ్రీకొడుకుల మధ్య తరచూ గొడవలు జరిగేవని విచారణలో తేల్చారు. అక్షత్‌పై వైద్య విద్య చదవాలనే ఒత్తిడి పెరగడంతో అతడు మానసికంగా తీవ్రంగా బాధపడినట్లు పోలీసులు తెలిపారు. 2018లో తల్లి మరణించిన తర్వాత కుటుంబంలో భావోద్వేగ ఒత్తిడి కూడా పెరిగినట్లు గుర్తించారు.

ఘటన జరిగిన రోజు పరీక్షల విషయంపై తీవ్ర వాగ్వాదం జరిగి, ఆగ్రహంతో కుమారుడు తండ్రిపై రైఫిల్‌తో కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం నిందితుడు మృతదేహాన్ని మూడవ అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఖాళీ గదికి తీసుకువచ్చి ఆధారాలను నాశనం చేయడానికి ప్రయత్నించాడని తెలిపారు. మృతదేహాన్ని ముక్కలుగా నరికి, కొన్ని శరీర భాగాలను సదరోనా గ్రామం సమీపంలో విసిరివేసినట్టు పేర్కొన్నారు. ఇక మిగిలిన భాగాలను ఇంట్లో ఉంచిన డ్రమ్‌లో దాచిపెట్టాడని పోలీసులు వివరించారు. శరీరంలోని కొన్ని భాగాలను గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కూడా స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ విక్రాంత్ వీర్ స్పష్టం చేశారు.

ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఫోరెన్సిక్ బృందం, సీనియర్ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కీలక ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించగా, నిందితుడిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆయుధం లైసెన్స్, ఘటనకు ఉపయోగించిన పరిస్థితులపై కూడా విచారణ జరుగుతోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related