లడ్డూ వివాదంలో కీలక మలుపు, మళ్లీ మొదలు..!!

Date:


Andhra Pradesh

oi-Sai Chaitanya

సంచలనంగా మారిన లడ్డూ వ్యవహారంలో మరో కీలక మలుపు. ఇప్పటికే ఈ అంశం రాజకీయంగా పతాక స్థాయికి చేరింది. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు లడ్డూ వివాదం పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 26న మండలిలో ఇందాపూర్ – హెరిటేజ్ పైన వస్తున్న విమర్శల పైన చర్చ జరగనుంది. లడ్డూ వివాదం పైన ప్రభుత్వం తాజాగా ఏక సభ్య కమిటీ నియమించింది. ఈ సమయంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది.

లడ్డూ వివాదం పై సుప్రీం నియమించిన సిట్ సుదీర్ఘ విచారణ చేసింది. ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అందులో కీలక అంశాలను ప్రస్తావించింది. ఈ నివేదిక ఆధారంగా కూటమి – వైసీపీ మధ్య తీవ్ర స్థాయిలో రాజకీయంగా విమర్శలు చెలరేగాయి. కాగా.. కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రభుత్వం లడ్డూ వివాదం పై ఏకసభ్య కమిషన్ ను నియమించింది. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ కు విచారణ బాధ్యతలు అప్పగించింది. అటు సిట్ పరిధిలో విచారణ ఉండగా.. ప్రభుత్వం మరో కమిటీ నియామకం పైన సుప్రీకోర్టులో సుబ్రమణ్య స్వామి పిటీషన్ దాఖలు చేసారు. దీని పైన విచారణ చేసిన సుప్రీంకోర్టు ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ చేయవచ్చని తేల్చి చెప్పండి. సిట్.. ప్రభుత్వం నియమించిన కమిటీ ఒకరి విచారణ మరొకరు పైన ప్రభావం పడకుండా చట్టానికి లోబడి విధులు నిర్వహించాలని స్పష్టం చేసింది.

45 రోజుల్లో నివేదిక.. ఏం తేల్చబోతున్నారు

దీంతో, ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిటీ పని ప్రారంభించేందు కు సిద్దమైంది. తాజాగా ఉండవల్లి నివాసం లో సీఎం చంద్రబాబు తో వన్ మ్యాన్ కమిటీ సభ్యులు మాజీ చీఫ్ సెక్రెటరీ దినేష్ కుమార్ భేటీ అయ్యారు. కమిటీ బాధ్యతలు తీసుకున్న దినేశ్ కుమార్.. తిరుపతి కేంద్రంగా పూర్తి విచారణ చేసే అవకాశం ఉంది. కల్తీ నెయ్యి సరఫరా అంశం లో జరిగిన నిర్లక్ష్యం …దానికి బాధ్యులు అయిన ఉద్యోగులు పై చర్యలకు దినేశ్ కుమార్ సిఫారసు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 45 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. అయితే, ఈ వ్యవహారం లో వచ్చిన ఆరోపణలు.. సిట్ ఛార్జ్ లో తేల్చి అంశాలు.. ఇప్పుడు దినేశ్ కుమార్ విచారణ వేళ అవే అంశాలు వెలుగులోకి వస్తాయా.. కొత్తగా మరేదైనా తేల్చుతారా అనేది ఆసక్తి కరంగా మారుతోంది. అయితే.. దినేశ్ కుమార్ కమిటీ నియామకం సమయంలోనే ప్రభుత్వ అసలు లక్ష్యం స్పష్టం చేసింది. దీంతో.. ఇప్పుడు ఈ కమిటీ ఎవరిని విచారణ చేయబోతోందీ… ఎలాంటి సమాచారం రాబడుతుంది… 45 రోజుల్లో ఇచ్చే నివేదికలో ఎవరిని బాధ్యులను చేస్తుందనేది రాజకీయంగానూ ఉత్కంఠ పెంచుతోంది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related