Cinema
oi-Korivi Jayakumar
ప్రముఖ
దర్శకుడు
తరుణ్
భాస్కర్
తెలుగు
ప్రేక్షకులకు
సుపరిచితులే.
షార్ట్
ఫిల్మ్స్
నుంచి
కెరీర్
స్టార్ట్
చేసి
పెళ్లిచూపులు
సినిమాతో
ఇండస్ట్రీలోకి
ఎంట్రీ
ఇచ్చారు.
మొదటి
సినిమాతోనే
అభిమానులను
మెస్మరైజ్
చేసి
టాలెంటెడ్
డైరెక్టర్
గా
నిరూపించుకున్నారు.
ఆ
తర్వాత
విశ్వక్
సేన్
తో
“ఈ
నగరానికి
ఏమైంది”
మూవీ
చేసి
ఆడియన్స్
ని
అలరించారు.
రీసెంట్
గానే
కీడా
కోలా
చిత్రంతో
మరోసారి
సక్సెస్అందుకున్నారు.
ప్రస్తుతం
దర్శకుడిగానే
కాకుండా
నటుడిగా
కూడా
రాణిస్తూ
ఫుల్
బిజీగా
ఉన్నారు.
అయితే
తరుణ్
భాస్కర్
పర్సనల్
విషయం
గురించి
మాత్రం
గత
కొద్దిరోజులుగా
వార్తల్లో
నిలుస్తున్నారు.
ఓ
టాలీవుడ్
హీరోయిన్
తో
ఆయన
ప్రేమలో
ఉన్నారంటూ
జోరుగా
ప్రచారం
జరుగుతోంది.
అంతే
కాకుండా
ప్రస్తుతం
ఆమెతోనే
కలిసి
ఉంటున్నారని
త్వరలో
పెళ్లి
కూడా
చేసుకోబోతున్నారని
సోషల్
మీడియాలో
టాక్
వినిపిస్తోంది.
ఈ
క్రమంలో
లేటెస్ట్
గా
తరుణ్
భాస్కర్
“రాజు
వెడ్స్
రాంబాయి”
సినిమా
ప్రీ
రిలీజ్
వేడుకకు
ముఖ్య
అతిథిగా
హాజరయ్యారు.
ఈ
సందర్భంగా
తరుణ్
తన
లవ్
స్టోరీ
గురించి
ఓపెన్
అయ్యారు.
దీంతో
ఆయన
చేసిన
కామెంట్స్
ఫుల్
వైరల్
గా
మారాయి.
ఈ
మేరకు
యాంకర్
ప్రశ్నిస్తూ..
మీరు
నిజ
జీవితంలో
చూసిన
గ్రేట్
లవ్
స్టోరీ
ఎవరిదైనా
ఉందా?
అంటూ
ప్రశ్నించారు.
అందుకు
తరుణ్
భాస్కర్
సమాధానం
చెబుతూ..
నాదే
అండీ
నేను
లవ్
లో
ఎంజాయ్
చేస్తున్నాను..
త్వరలో
మా
ప్రేమే
గ్రేట్
లవ్
స్టోరీ
అవుతుందేమో
అంటూ
వ్యాఖ్యానించారు.
వెంటనే
యాంకర్
కూడా
పేరు
నాకు
తెలుసు
కానీ
బయటకు
చెప్పను
అంటూ
నవ్వేసింది.
దీంతో
ఈ
యంగ్
డైరెక్టర్
చేసిన
కామెంట్స్
టాక్
ఆఫ్
ది
టౌన్
గా
మారాయి.
ప్రస్తుతం
ఈ
వీడియో
నెట్టింట
వైరల్
గా
మారింది.
ఈషా
రెబ్బాతో
ప్రేమలో
తరుణ్
?
ఇక
గత
కొద్దిరోజులుగా
డైరెక్టర్
తరుణ్
భాస్కర్
హీరోయిన్
ఈషా
రెబ్బాతో
ప్రేమలో
ఉన్నారంటూ
వార్తలు
వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం
వీరిద్దరూ
ఓం
శాంతి
శాంతి
సినిమాలో
నటిస్తున్నారు.
ఈ
మూవీ
మలయాళంలో
వచ్చిన
“జయ
జయహే”
సినిమాకు
రీమేక్
సినిమాగా
రానుంది.
ఈ
సినిమా
షూటింగ్
లోనే
వీరి
మధ్య
ప్రేమ
చిగురించిందని
అంటున్నారు.
దీపావళి
పండుగ
సందర్భంగా
కూడా
ఈషా
–
తరుణ్
కలిసి
కనిపించారు.
అయితే
ఇలా
వీరి
ప్రేమ
గురించి
వార్తలు
వస్తున్నా
కానీ
ఈ
జంట
ఇంకా
స్పందించలేదు.
తరుణ్
భాస్కర్,
ఈషా
ఇద్దరు
కూడా
వరంగల్
జిల్లాకు
చెందినవారు
కావటం
ఈ
వార్తలకు
మరింత
బలం
చేకూరుస్తోంది.


