Andhra Pradesh
oi-Sai Chaitanya
వసంత
పంచమి.
విద్యార్ధులకు
ఎంతో
ప్రత్యేకమైన
రోజు.
అక్షరాభ్యాసాలకు
మంచి
ముహూర్తంగా
భావిస్తారు.
ఇదే
రోజున
ఇంద్రకీలాద్రి
ఆలయంలో
ప్రత్యేక
ఏర్పాట్లు
చేస్తున్నారు.
ఆ
రోజు
భక్తులకు
శ్రీ
దుర్గమ్మవారు
సరస్వతీ
దేవి
రూపంలో
దర్శనం
ఇవ్వనున్నారు.
పెద్ద
సంఖ్యలో
చిన్నారులకు
అక్షరాభ్యాసం
చేసేందుకు
నిర్ణయించారు.
ఇదే
సమయంలో
ఆలయ
అధికారులు
కీలక
ప్రకటన
చేసారు.
విద్యార్ధులకు
అరుదైన
అవకాశం
కల్పించారు.
ఈ
నెల
23న
మాఘ
శుద్ధ
పంచమి.
ఈ
శ్రీ
పంచమిని
పురస్కరించుకుని
ఇంద్రకీలాద్రిపై
కొలువు
దీరిన
శ్రీదుర్గామల్లేశ్వర
స్వామి
వారి
దేవస్థానంలో
ప్రత్యేక
ఏర్పాట్లు
చేస్తున్నారు.
ఆ
రోజు
భక్తులకు
శ్రీ
దుర్గమ్మవారు
సరస్వతీ
దేవి
రూపంలో
దర్శనం
ఇవ్వనున్నారు.
దీంతో..అమ్మవారి
మూల
స్వరూపానికి
ప్రత్యేక
అలంకరణతో
పాటు,
మహామండపం
ఆరో
అంతస్తులో
ఉత్సవమూర్తిని
ప్రతిష్ఠించి
ప్రత్యేక
పూజలు
నిర్వహించనున్నారు.
యాగశాలలో
శ్రీ
సరస్వతీ
హోమం
సహా
పలు
వైదిక
కార్యక్రమాలు
నిర్వహించనున్నారు.
శ్రీ
పంచమి
రోజు
ఉదయం
6
గంటల
నుంచి
సాయంత్రం
7
గంటల
వరకు
సరస్వతీ
దేవి
రూపంలో
అమ్మవారిని
విద్యార్థులు
ఉచిత
దర్శనం
చేసుకునేందుకు
ఏర్పాట్లు
చేస్తున్నారు.
అమ్మవారి
దర్శనం
అనంతరం
విద్యార్థులకు
పెన్ను,
శక్తి
కంకణం,
అమ్మవారి
ఫొటోతో
పాటు
40
గ్రాముల
లడ్డూ
ప్రసాదాన్ని
ఉచితంగా
అందజేయను
న్నట్లు
ఆలయం
అధికారులు
వెల్లడించారు.
అయితే,
ఉచిత
దర్శనం
కోసం
వచ్చే
విద్యార్ధులకు
ఆలయ
అధికారులు
కొన్ని
సూచనలు
చేసారు.
వసంత
పంచమి
నాడు
విద్యార్ధులు
స్కూల్
యూనిఫామ్
ధరించి,
గుర్తింపు
కార్డుతో
వస్తే
వారికి
ఉచిత
దర్శనానికి
అనుమతి
ఇస్తామని
చెప్పారు.
ఇక..
వసంత
పంచమి
నాడు
తెలుగు
రాష్ట్రాల్లోని
అన్ని
ప్రముఖ
దేవాలయాల్లో
అమ్మవారు
సరస్వతీ
రూపంలో
దర్శనమివ్వనున్నారు.
ఇక
బాసర(నిర్మల్
జిల్లా),
వర్గల్(సిద్ధిపేట
జిల్లా)
దేవాలయాలకు
సైతం
భక్తులు
పోటెత్తనున్నారు.
మరో
వైపు..
నేటి
నుంచి
అంటే
సోమవారం
నుంచి
శ్యామలా
నవ
రాత్రులు
ప్రారంభమయ్యాయి.
సరస్వతీ
దేవి
అనుగ్రహం
లభించాలంటే
అమ్మవారిని
ఆరాధించే
సమయంలో
కొత్త
పుస్తకాలు,
పెన్ను
లేదా
పెన్సిళ్లు
పూజా
మందిరంలో
ఉంచి
పూజించాలి.
అదే
విధంగా
ఈ
రోజు
కళలకు
ఉపయోగించే
వస్తువులను
సైతం
పూజించాలి.
ముఖ్యంగా
సంగీత
వాయిద్యాలను
ఈ
రోజు
ప్రత్యేకంగా
పూజించడం
వలన
ఆయా
కళలలో
నిష్ణాతులు
అవుతారని
నమ్మతారు.


