వామ్మో.. బాబా వంగా భవిష్యవాణి నిజం అయింది!!

Date:


International

oi-Chandrasekhar Rao

ఇరాన్‌పై దాడుల అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ వరకే ఇది పరిమితం కాలేదు. గల్ఫ్ దేశాలకూ పాకింది. భారతీయులు.. ప్రత్యేకించి తెలుగువాళ్లు ఎక్కువగా నివసించే కువైట్, ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ వంటి దేశాలపైనా దాడులు సాగాయి. బహ్రెయిన్ లో ఏకంగా అమెరికా నావల్ బేస్ సైతం ఇరాన్ సంధించిన శక్తిమంతమైన మిస్సైళ్ల ధాటికి భస్మీపటలం అయింది.

ఇరాన్, ఇజ్రాయెల్, బహ్రెయిన్, యూఏఈ, ఖతార్‌లపై ఏకకాలంలో బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది ఇరాన్. అమెరికా, ఇజ్రాయెల్‌ల సంయుక్త దాడికి ప్రతీకారంగా ఈ చర్యకు దిగింది. ఈ దాడులు.. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలను మరింత పెంచాయి. అమెరికా, ఇజ్రాయెల్‌ జాయింట్ గా ఇరాన్‌లోని కీలక స్థావరాలపై దాడులు చేయగా.. దీనికి ప్రతిదాడికి దిగింది ఇరాన్. బహ్రెయిన్‌లోని యూఎస్ నేవీ బేస్ ను ధ్వంసం చేసిపడేసింది.

ఈ దాడుల వార్తలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడంతో- ఇక అందరి దృష్టి కూడా బల్గేరియన్ మహిళా ఆధ్యాత్మికవేత్త బాబా వంగా అంచనాలపై పడింది. 1996లో బాబా వంగా మరణించారు. ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆమె అప్పట్లోనే ఊహించారు. 2026 ప్రారంభంలోనే తూర్పు నుండి ఓ మహా యుద్ధం ఆరంభమౌతుందని ఆమె చెప్పిన జోస్యం చెప్పారు. ఇది ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టినట్టయిందని చాలామంది విశ్వసిస్తోన్నారు.

తాజా పరిణామాలను బాబా వంగా జోస్యంతో ముడిపెడుతూ సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చలు జరుగుతున్నాయి. ఈ ఘర్షణ క్రమంగా ప్రపంచమంతటా విస్తరించవచ్చని, ఆమె భవిష్యవాణి నిజమవుతోందని భావిస్తున్నారు. తాజాగా చోటు చేసుకుంటోన్న దాడులు ఒక్క ఇరాన్- ఇజ్రాయెల్ కే పరిమితం కావట్లేదు. గల్ఫ్ దేశాలన్నింటినీ ఆవంరించింది.

బాబా వంగా జోస్యం ప్రకారం- ఇది పాశ్చాత్య ప్రపంచాన్ని ముఖ్యంగా యూరప్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. యూరప్‌లోని భూమి పూర్తిగా నిస్సారంగా, అస్థిరంగా మారవచ్చని దశాబ్దాల కిందటే ఆమె అంచనా వేశారు, ఇది విస్తృతమైన ఆర్థిక, సామాజిక సవాళ్లకు దారితీస్తుంది. ఈ యుద్ధం తర్వాత రష్యా ఒక ప్రధాన ప్రపంచ శక్తిగా అవతరించి, అంతర్జాతీయ శక్తి సమతుల్యాన్ని పునర్నిర్మించగలదని అప్పట్లో పేర్కొన్నారు.

ఈ ఏడాదిలోనే శక్తిమంతమైన భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు తలెత్తుతాయని కూడా ఆమె అంచనా వేశారు. ఇవి మానవులకు, భూమికీ ఎంతగానో ప్రమాదకరమని హెచ్చరించారు. విపత్తులు భూమిని చుట్టుముట్టుతాయని పేర్కొన్నారు. ఇప్పుడు ఇరాన్- ఇజ్రాయెల్ సంక్షోభం వాస్తవ రూపాన్ని దాల్చిన నేపథ్యంలో ఈ విపత్తులు కూడా మానవాళికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయనడంలో సందేహాలు ఉండకపోవచ్చు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Joseph Duggar’s Wife Kendra Duggar Released From Jail After Arrest

Jessa Duggar (m. Ben Seewald)Jim Bob and Michelle's fifth...

Kanshi Ram returns – The Hindu

Standing outside Gate No. 2 of the Indira Gandhi...

Halide co-founder is suing Sebastiaan de With for taking code to Apple

Lux Optics co-founder Sebastiaan de With made headlines when...