Cinema
oi-Bomma Shivakumar
సూపర్
స్టార్
మహేశ్
బాబు-
దర్శక
ధీరుడు
రాజమౌళి
కాంబోలో
వస్తున్న
వారణాసి
మూవీ
నుంచి
గ్లింప్స్
వచ్చిన
విషయం
తెలిసిందే.
నవంబర్
15న
రామోజీ
ఫిల్మ్
సిటీలో
జరిగిన
గ్రాండ్
టైటిల్
రివీల్
ఈవెంట్
లో
సినిమా
టైటిల్
తో
పాటు..
ఈ
మూవీ
వరల్డ్
నుంచి
కొన్ని
దృశ్యాలను
చూపించారు.
ప్రస్తుతం
వాటి
గురించి
ఇండియానే
కాకుండా
ప్రపంచం
మొత్తం
మాట్లాడుకుంటోంది.
ఈ
స్పెషల్
గ్లింప్స్
చూసినవాళ్లంతా
ఇలా
ఆలోచించడం
కేవలం
రాజమౌళికే
సాధ్యం
అవుతుందని
ప్రశంసిస్తున్నారు.
అయితే
ఈ
మూవీ
గ్లింప్స్
లో
కొన్ని
ఆసక్తికర
ప్రదేశాలను
రాజమౌళి
చూపించారు.
అందులో
అందిరినీ
ఆశ్చర్యపరిచిన
వణాంచల్
లోని
ఉగ్రబట్టి
గుహ
ఒకటి.
నిజానికి
ఈ
గుహ
ప్రపంచంలో
ఎక్కడా
లేదు.
ఇది
రాజమౌళి
అద్భుత
సృష్టి
మాత్రమే.
ఆయన
ఊహల్లోంచి
పుట్టిందే
ఈ
గుహ.
అయితే
ఈ
గుహ
లోపల
శిరస్సు
లేకుండా
ఉన్న
దేవతా
రూపాన్ని
చూపించారు.
ఆమెనే
చిన్న
మస్తాదేవి.
భయంకర
రూపంలో
ఉన్న
చిన్నమస్తాదేవి
గురించి
పలు
ఆసక్తికర
కథనాలు
ఉన్నాయి.
అయితే
సినిమాలో
ఈ
దేవతకు..
కథకు
లింకు
ఏంటి
అనేది
మూవీ
రిలీజయ్యాకే
తెలుస్తుంది.
ఎవరీ
చిన్నమస్తాదేవి..?
పురాణాల్లో
ఉన్న
కథనాల
ప్రకారం..
చిన్నమస్తాదేవి
పార్వతి
దేవి
రూపంగా
పరిగణిస్తారు.
చిన్నమస్తాలో
చిన్న
అంటే
ఖండించిన,
మస్తా
అంటే
తల
అని
అర్థం
వస్తుంది.
బాగా
ప్రాచుర్యం
పొందిన
ఓ
కథ
ప్రకారం..
పార్వతీ
దేవి
తన
సేవకురాలైన
ఢాకిని,
వర్ణిణిలతో
కలిసి
ఓసారి
నదిలో
స్నానం
ఆచరిస్తుండగా..
ఢాకిని,
వర్ణిణి
తమ
ఆకలి
తీర్చమని
అడిగారు.
ఐతే
పార్వతీదేవి
చుట్టు
పక్కల
ఎంత
సేపు
వెతికినా
తినడానికి
ఏమీ
దొరకదు.
మరోవైపు
ఆకలి
కారణంగా
ఢాకిని,
వర్ణిణి
శరీరాలు
నల్లగా
మారిపోతుంటాయి.
దీంతో
వారి
ఆకలి
తీర్చేందుకు
తన
తలనే
నరుక్కుంటుంది
పార్వతీ
దేవి.
అలా
ఆమె
రక్తంతో
వారి
ఆకలి
తీర్చుతుంది.
అలాగే
ఆమె
తల
కూడా
ఆ
రక్తం
తాగడం
ఇక్కడ
చూడొచ్చు.
మరో
కథనం
ప్రకారం..
రాక్షస
సంహారం
చేసిన
తర్వాతా
తన
వెంటనున్న
శక్తులైన
జయ,
విజయల
ఆకలిని
తీర్చేందుకు
తన
తల
తానే
నరుక్కునే
విధానంగా
చెబుతారు.
ఇక
ఉత్తర్
ప్ర
దేశ్
లోని
వారణాసి
సమీపంలో
రామ్
నగర్
ప్రాంతంలో
ఒక
ప్రసిద్ధ
చిన్నమస్తా
దేవి
ఆలయం
ఉంది.
అలాగే
బెంగాల్
లోని
విష్ణుపూర్
ప్రాంతంలో
కూడా
అమ్మవారి
పీఠం
నెలకొని
ఉంది.
ఇక
ఈ
మూవీ
2027
సమ్మర్
లో
రిలీజ్
కానుంది.
ఈ
మూవీలో
మహేశ్
బాబుతోపాటుగా
ప్రియాంక
చోప్రా
మందాకిని
పాత్రలో
నటిస్తోంది.
అలాగే
ప్రతినాయకుడిగా
కుంభ
పాత్రలో
పృథ్విరాజ్
సుకుమారన్
నటిస్తున్నాడు.
ఈ
మూవీకి
ఎంఎం
కీరవాణి
మ్యూజిక్
అందిస్తున్నారు.
ఈ
మూవీని
దుర్గా
ఆర్ట్స్
బ్యానర్
పై
కేఎల్
నారాయణ
నిర్మిస్తున్నారు.


