Business
oi-Chandrasekhar Rao
అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు ధరలు తగ్గట్లేదు. మరింత పైపైకి ఎగబాకుతున్నాయి. దీని ప్రభావం చమురు కంపెనీల లాభాలపై పడుతోంది. గల్ఫ్ రీజియన్ లో యుద్ధం మొదలైనప్పటి నుండి భారతీయ రిఫైనరీలకు ముడిచమురు కొనుగోలు వ్యయం 95 శాతానికి పెరిగింది. ఇదివరకు బ్యారెల్ ధర 120.56 డాలర్లకు చేరుకోవడంతో ఇండియన్ ఆయిల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ లాభాలు భారీగా తగ్గాయి. గత కొన్ని నెలలుగా లాభాలు ఆర్జించిన ఈ కంపెనీలు ఇప్పుడు తమ మార్జిన్లను కోల్పోతున్నాయి.
ఈ పరిణామాలు దేశీయంగా పెట్రోల్, డీజిల్ రిటైల్ విక్రయ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. యుద్ధం ప్రారంభానికి ముందు 65 నుండి 70 డాలర్ల వరకు పలికిన క్రూడాయిల్ బ్యారెల్ ధర ఇప్పుడు 100 డాలర్ల మార్క్ ను దాటేసింది. గరిష్ఠంగా 120 డాలర్లకు చేరింది. ఆ తర్వాత తగ్గుముఖం పట్టింది గానీ అది స్వల్పమే. నేడు బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ఒక్కింటికి 114.57 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ధర కూడా కొద్దిగా కొద్దిగా తగ్గింది. ప్రస్తుతం బ్యారెల్‌కు 106.13 వద్ద ట్రేడ్ అవుతోంది.
ఈ పరిణామాల మధ్య వివిధ నగరాల్లో పెట్రోల్ రేట్ల వివరాలిలా ఉన్నాయి.
ఢిల్లీలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 94.77
కోల్‌కతాలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 105.41
ముంబైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 103.54
చెన్నైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ.101.06
భువనేశ్వర్‌లో పెట్రోల్ ధర: లీటరుకు రూ.100.94
డీజిల్ ధరలు ఇవీ..
ఢిల్లీలో డీజిల్ ధర: లీటరుకు రూ. 87.67
కోల్‌కతాలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.02
ముంబైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 90.03
చెన్నైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.61
భువనేశ్వర్‌లో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.52


