Telangana
oi-Dr Veena Srinivas
తెలంగాణ
సీఎం
రేవంత్
రెడ్డి
బీఆర్ఎస్
నాయకులపైన
తీవ్రస్థాయిలో
విరుచుకుపడ్డారు.
అక్రమ
మార్గాలు
ఎంచుకున్న
వారికి
ప్రజాస్వామ్య
బద్ధమైన
విచారణ
తప్పదని
సీఎం
రేవంత్
రెడ్డి
స్పష్టం
చేశారు.
బీఆర్ఎస్
నేతలు
చేయవలసిన
తప్పులన్నీ
చేశారని,
తప్పులు
చేసి
ప్రశ్నించకూడదు
అంటే
ఎలా
అంటూ
ఆయన
ఆగ్రహం
వ్యక్తం
చేశారు.
నేరాలు
చేస్తూ
తమను
ఎవరు
ప్రశ్నించ
కూడదనే
వారి
వైఖరి
విడ్డూరంగా
ఉందని
ముఖ్యమంత్రి
రేవంత్
రెడ్డి
పేర్కొన్నారు.
బీఆర్ఎస్
నేతలకు
పదవీ
వ్యామోహం
తగ్గడం
లేదు:
రేవంత్
రెడ్డి
హైదరాబాద్లోని
అమరవీరుల
స్మారక
ట్రస్ట్
నిర్వహించిన
కార్యక్రమంలో
ముఖ్యమంత్రి
రేవంత్
రెడ్డి
పాల్గొని
ప్రసంగించారు.
ఆ
తర్వాత
ఆయన
మీడియాతో
మాట్లాడుతూ
ఆసక్తికర
వ్యాఖ్యలు
చేశారు.
ప్రజల
తిరస్కరణకు
గురైన
కూడా
బీఆర్ఎస్
నేతలకు
పదవీ
వ్యామోహం
తగ్గడం
లేదని
ఆయన
టార్గెట్
చేశారు.
కేసీఆర్
కుటుంబానికి
సీఎం
రేవంత్
రెడ్డి
ప్రశ్న
తెలంగాణ
రాష్ట్రంలో
అన్ని
పదవులను
కేసీఆర్
కుటుంబమే
అనుభవించింది
అని
ఆరోపించిన
రేవంత్
రెడ్డి,
వందల
ఎకరాల
ఫామ్
హౌస్
లు,
వేలకోట్ల
వ్యాపారాలు
వారికి
ఏ
విధంగా
వచ్చాయో
చెప్పాలని
కెసిఆర్
కుటుంబాన్ని
ప్రశ్నించారు.
మరోవైపు
ఫోన్
ట్యాపింగ్
ను
ఒక
ఘోరమైన
నేరం
అని
రాష్ట్ర
రవాణ,
బీసీ
సంక్షేమ
శాఖ
మంత్రి
పొన్నం
ప్రభాకర్
బీఆర్ఎస్
నేతలను
విమర్శించారు.
మున్సిపల్
ఎన్నికల
సమయంలో
రాజకీయం
హుస్నాబాద్
లో
జరిగిన
విలేకరుల
సమావేశంలో
మంత్రి
మాట్లాడుతూ…వ్యక్తుల
వ్యక్తిగత,
ఆర్థిక,
వృత్తిపరమైన
జీవితాలపై
నిఘా
పెట్టడాన్ని
ఆయన
తీవ్రంగా
ఖండించారు.
హింసాత్మక
నిరసనలను
ప్రేరేపిస్తూ
గందరగోళం
సృష్టించడం
ద్వారా
ప్రతిపక్షాలు
రాజకీయ
లబ్ది
పొందాలని
చూస్తున్నాయని
ఆరోపించారు.
మున్సిపల్
ఎన్నికల
సమయంలో
దీనిని
రాజకీయంగా
వాడుకోవడానికి
ప్రయత్నిస్తున్నారని
మండిపడ్డారు.
కెసిఆర్
కు
నోటీసులు
గత
కొంతకాలంగా
ఫోన్
టాపింగ్
వ్యవహారం
పైన
దర్యాప్తు
జరుగుతోందని,
ఈ
దర్యాప్తులో
భాగంగానే
ఇప్పుడు
కెసిఆర్
కు
నోటీసులు
ఇచ్చారని,
విచారణ
జరుపుతున్నారని
ఆయన
అన్నారు.
కావాలని
రాద్ధాంతం
చేసి
ఎన్నికల
సమయంలో
రాష్ట్రంలో
గందరగోళం
సృష్టిస్తున్నారని
మంత్రి
పొన్నం
ప్రభాకర్
అసహనం
వ్యక్తం
చేశారు.


