విజనరీ చంద్రబాబు సలహా ఇవ్వలేదా? | Criticism on Union Civil Aviation Minister Rammohan

Date:


మోంథా తుపాన్‌ పీక నులిమేసిన మేధావితనం ఏమైంది?

ఇండిగో సంక్షోభంపై ఏకిపారేస్తున్న నెటిజన్లు

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ పైనా విమర్శలు

అర్నబ్‌ చర్చాగోష్టిలో టీడీపీ అభాసుపాలు

సాక్షి, న్యూఢిల్లీ/ సాక్షి, అమరావతి: ‘మోంథా తుపాన్‌ పీక నులిమేసిన మేధావితనం ఏమైంది? సెల్‌ఫోన్‌ను, కంప్యూటర్‌ను కనిపెట్టిన జ్ఞానం ఎక్కడికి పోయింది? హైదరా­బాద్‌నే నిర్మించిన, పెద్ద పెద్ద సంక్షోభాలను చిటికెలో పరిష్కరించిన నైపుణ్యం ఎక్కడికి పోయింది? ఇంతటి మేధావి ఇండిగో ఎయిర్స్‌లైన్స్‌ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు­కు ఎందుకు ఓ సలహా ఇవ్వలేదు?’ అంటూ నెటిజన్లు సీఎం చంద్ర­బాబును సోషల్‌ మీడియా వేదికగా ఏకిపారే­స్తున్నారు. ఇండిగో సృష్టించిన సంక్షోభానికి ఓ పక్క ప్రయాణికులు ఆగ్రహ జ్వాలలతో రగిలి పోతుంటే.. మరోపక్క ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు టీడీపీ ప్ర­యత్నించి దేశ వ్యాప్తంగా అభాసుపాలైంది.

ఈ సంక్షోభంపై ‘రిపబ్లిక్‌’ టీవీలో జరిగిన చర్చలో టీడీపీకి చెందిన అధి­కార ప్రతినిధి దీపక్‌ రెడ్డి వ్యాఖ్యలను జర్నలిస్టు అర్నబ్‌ గోస్వామి తీవ్రంగా పరిగణించారు. ‘ఈ సమస్యతో టీడీపీ­కి సంబంధం ఏమిటి? అసలు నారా లోకేశ్‌ ఎందుకు సమీక్ష చేస్తారు? ఏ హోదాతో చేస్తారు? అంటూ దీపక్‌ రెడ్డిని ప్రశ్నలతో నిలదీశారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దీపక్‌ రెడ్డి తెల్లమొహం వేసి, టాపిక్‌ మార్చే ప్రయత్నం చేయడంతో నవ్వులపాల­య్యారు. ఆ వీడియో కాస్త సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో వైరల్‌ కావడంతో దేశ వ్యాప్తంగా కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్‌­నాయుడు తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్‌ నాయుడు బాధ్యతలు స్వీకరించిన­ప్పటి నుంచి ఏదో ఒక సంఘటన తరచూ జరుగుతూనే ఉంది.

విమాన ప్రమాదాలు, టిక్కెట్‌ ధరలు పెరగడం, స్టాఫ్‌ వ్యవహార శైలి, గంటల తరబడి వేచి ఉండటం, ఫ్లైట్‌ క్యాన్సిల్స్, ఫ్లైట్‌ డిలే వంటి ఎన్నో సంఘట­నలు చోటు చేసు­కుంటూనే ఉన్నాయి. ఈ ఏడాది జూన్‌ 12న అహ్మదా­బాద్‌­లో ఎయిర్‌ ఇండియా ఘో­ర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘట­నలో 230 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాద సంఘటన స్థలానికి వెళ్లిన కేంద్ర మంత్రి రీల్‌ తరహాలో ఓ వీడియోను తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో పోస్ట్‌ చేశా­రు. బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ రావడం, షర్ట్‌ను మోచేతి వరకు మడత పెట్టడం చూసిన నెటిజన్లు మండిపడ్డారు. రామ్మోహన్‌ కేంద్ర మంత్రిగా ఉండటం వల్ల రాష్ట్రానికి ఒనగూరిన ప్రయోజనం ప్రత్యేకించి ఏమీ లేదని రాష్ట్ర ప్రజలు విమర్శిస్తున్నారు. 



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

90 Day Fiancé’s Julia Trubkina, Brandon Gibbs Welcome First Baby

The 90 Day Fiancé family has officially expanded. Brandon Gibbs...

Stopping GLP-1s raises cardiovascular risks: study

Boxes of Ozempic and Wegovy made by Novo Nordisk...

Niall Horan’s ‘Dinner Party’ Release Date, Tracklist Revealed

Niall Horan hopes you’re hungry, because it’s time for...