Andhra Pradesh
oi-Syed Ahmed
ఏపీలో
గతేడాది
వైసీపీ
పరాజయం
తర్వాత
ఆ
పార్టీకి,
ఎంపీ
పదవికీ,
రాజకీయాలకు
గుడ్
బై
చెప్పేసిన
ఒకప్పటి
కీలక
నేత
విజయసాయిరెడ్డి
పెద్ద
షాక్
ఇచ్చారు.
రాజకీయాలకు
గుడ్
బై
చెప్పడంపై
యూటర్న్
తీసుకున్నారు.
ఇప్పుడు
తిరిగి
రాజకీయాల్లోకి
వస్తానని
ప్రకటించారు.
ఇవాళ
హైదరాబాద్
లో
మద్యం
కుంభకోణంలో
ఈడీ
విచారణకు
హాజరై
తిరిగి
వెళ్తూ
ఆయన
కీలక
వ్యాఖ్యలు
చేశారు.
రాజకీయాల
నుంచి
తాను
తప్పుకోనని
విజయసాయిరెడ్డి
ప్రకటించారు.
తన
భవిష్యత్
ప్రణాళికలను
త్వరలో
ప్రకటిస్తానని
వెల్లడించారు.
ఈ
నెల
25తో
తనకు
రాజకీయాల్లో
ఏడాది
ముగుస్తుందని,
తిరిగి
రాజకీయాల్లోకి
వస్తానని
తెలిపారు.
అయితే
కోటరీ
వ్యవస్థ
ఇలాగే
కొనసాగితే
జగన్
మళ్లీ
అధికారంలోకి
రారని
తేల్చిచెప్పేశారు.
కూటమిని
విడగొడితేనే
జగన్‌కు
మళ్లీ
అధికారం
అన్నారు.
తాను
జగన్‌ను
విమర్శించలేదని,
ఆయనే
నన్ను
విమర్శించారని
తెలిపారు.
తాను
ప్రలోభాలకు
లొంగిపోయానని
జగన్
అన్నారని,ఆ
వ్యాఖ్యలను
జగన్
వెనక్కి
తీసుకోవాలని
విజయసాయి
రెడ్డి
కోరారు.
వైసీపీలో
నంబర్
2
స్థానం
అనేది
లేదని
స్వయంగా
వైఎస్
జగన్
చెప్పారని
ఈడీకి
తెలిపినట్లు
సాయిరెడ్జి
వెల్లడించారు.
ప్రాంతీయ
పార్టీల్లో
నంబర్
2
అనేది
ఉండదని
చెప్పానన్నారు.
కేసులు
చుట్టుముట్టిన
తర్వాతే
నన్ను
‘నంబర్2’గా
ప్రచారం
చేశారన్నారు.
ఈడీ
విచారణలో
అడిగిన
ప్రశ్నల్లో
కొన్ని
మాత్రమే
రికార్డు
చేశారని,
మరికొన్ని
ప్రశ్నలను
రికార్డు
చేయలేదన్నారు.
లిక్కర్
స్కాం
గురించి
తనకు
తెలియదని,
లిక్కర్
స్కాంలో
ఎవరు
ఇన్వాల్వ్
అయ్యారో
వారినే
అడగాలని
చెప్పానన్నారు.


