విజయ్ నిజ స్వరూపం ఇదేనా? టీవీకే మహిళా కార్యకర్త ఫైర్

Date:


India

oi-Lingareddy Gajjala

రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి అగ్ర నటుడు, టీవీకే (TVK) అధినేత విజయ్‌కు కాలం కలిసిరావడం లేదు. ఒకవైపు వరుసగా నమోదవుతున్న క్రిమినల్ కేసులు, మరోవైపు భార్యతో విడాకుల వ్యవహారం ముదురుతుండగా.. ఇప్పుడు పార్టీ లోపలి నుంచే ధిక్కార స్వరాలు వినిపించడం ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ముఖ్యంగా పార్టీ కీలక నాయకురాలు రంజనా నాచ్చియార్, విజయ్ వ్యక్తిగత ప్రవర్తనను మరియు రాజకీయ వైఖరిని ఎండగడుతూ చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. బయటి శత్రువుల కంటే ఇంట్లోనే (పార్టీలోనే) సెగ మొదలవ్వడంతో, ఈ సంక్షోభం నుంచి ‘దళపతి’ ఎలా గట్టెక్కుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అది వర్త్ కాదు…

రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నటుడు విజయ్, ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా తన భార్యతో విడాకుల వ్యవహారాన్ని ఉద్దేశించి “అది వర్త్ (Worth) కాదు” అంటూ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై అదే పార్టీకి చెందిన రంజనా నాచ్చియార్ ఘాటుగా స్పందించారు. “మీరు వర్త్ కాదు అన్నది మీ భార్యనో లేక మీ వైవాహిక బంధాన్నో స్పష్టం చేయండి” అంటూ విజయ్‌ను సూటిగా ప్రశ్నించారు. మహిళలకు కనీస గౌరవం ఇవ్వని భాష వాడుతూ రాజకీయం చేయడం అవసరమా అని ఆమె నిలదీశారు.

మాటల్లో హామీలు.. చేతల్లో వైరుధ్యాలు

విజయ్ తన ప్రసంగాల్లో ప్రతి కుటుంబానికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఇస్తానని హామీ ఇస్తున్నారని, కానీ కట్టుకున్న భార్యను మాత్రం ఇంట్లోకి రానివ్వడం లేదని రంజనా ఎద్దేవా చేశారు. “సమాజానికి మేనమామగా ఉంటానని చెప్పడం బాగుంది, కానీ సొంత బిడ్డకు తండ్రిగా బాధ్యత నెరవేర్చడం అంతకంటే ముఖ్యం” అంటూ విజయ్ వ్యక్తిగత, రాజకీయ వైఖరిలోని వైరుధ్యాలను ఎత్తిచూపారు.

Vijay యువతకు ఇచ్చే సందేశం ఇదేనా?

ఒక బహిరంగ వేదికపై మరో నటితో కలిసి కనిపించడం ద్వారా యువతకు విజయ్ ఏం సందేశం ఇస్తున్నారని ఆమె ప్రశ్నించారు. మహిళల గౌరవాన్ని కాపాడే భాష మీ పదాల్లో కనిపించకపోతే ఇక ఆ రాజకీయం ఎందుకు అని నిలదీశారు. విజయ్ నిజ స్వరూపం ఏమిటని విజయ్‌ను ప్రశ్నించారు. “రాజకీయ నాయకుడి ప్రతి కదలిక సమాజంపై ప్రభావం చూపుతుంది. పెళ్లయిన తర్వాత ఎలాగైనా జీవించవచ్చు అనే భావన యువతలో నాటుకుపోతే దానికి బాధ్యులెవరు?” అని రంజనా ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే తరానికి ఆదర్శంగా ఉండాల్సిన నాయకుడు తన ప్రవర్తనను సరిదిద్దుకోవాలని ఆమె సూచించారు



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Watch First Trailer for Netflix Documentary

Thanks to Netflix, we’re about to get a BTS...

BTS Drop New ‘The Return’ Doc Trailer

The upcoming doc will follow the band as they...

Pooh Shiesty Says He Should Be a Nike Balaclava Model

Pooh Shiesty thinks Nike owes him a check. During a...