India
oi-Chandrasekhar Rao
TVK
Vijay:
టీవీకే
చీఫ్
విజయ్
పుదుచ్చేరిలో
నిర్వహించిన
భారీ
ర్యాలీలో
ఆ
పార్టీ
నాయకులతో
గొడవకు
దిగిన
సీనియర్
ఐపీఎస్
అధికారిణి
ఈషా
సింగ్
పై
బదిలీ
వేటు
పడింది.
ఉన్నపళంగా
ఢిల్లీకి
బదిలీ
అయ్యారు.
ఈ
మేరకు
కేంద్ర
ప్రభుత్వం
ఉత్తర్వులు
జారీ
చేసింది.
ఈ
పరిణామం
తమిళనాడు,
పుదుచ్చేరి
రాజకీయాల్లో
చర్చనీయాంశమైంది.
టీవీకేకు
అనుకూలంగా
కేంద్ర
ప్రభుత్వం
వ్యవహరించిందనే
అభిప్రాయాలు
వ్యక్తమౌతోన్నాయి.
పార్టీని
విస్తరించే
క్రమంలో
కిందటి
నెల
విజయ్..
పుదుచ్చేరిలో
పర్యటించిన
విషయం
తెలిసిందే.
కరూర్
తొక్కిసలాటలో
41
మంది
మరణించిన
తర్వాత
టీవీకే
అధినేత
విజయ్
నిర్వహించిన
మొదటి
బహిరంగ
సభ
ఇది.
ఆ
సమయంలో
పార్టీ
ప్రధాన
కార్యదర్శి
బుస్సీ
ఆనంద్
ప్రసంగాన్ని
ఈషా
సింగ్
అడ్డుకున్నారు.
ఆయన
మాట్లాడుతుండగానే
మైక్
లాక్కున్నారు.
మైక్
లాక్కోవడానికి
సంబంధించిన
వీడియో
అప్పట్లో
వైరల్
అయింది.
ఈ
ఘటనతో
ఆమె
దేశవ్యాప్తంగా
గుర్తింపు
పొందారు.
పుదుచ్చేరిలోని
ఉప్పలం
ఎక్స్‌పో
గ్రౌండ్‌లో
ఈ
సభ
ఏర్పాటైంది.
కరూర్
తొక్కిసలాట
నేపథ్యంలో
హాజరయ్యేవారి
సంఖ్యపై
పరిమితులు
విధించింది
ప్రభుత్వం.
బుస్సీ
ఆనంద్
మాత్రం
మైక్
లో
మాట్లాడుతూ
ఎటువంటి
పరిమితులు
లేవని,
ఇంకా
స్థలం
చాలా
మిగిలివుందని
ప్రజలను
ఆహ్వానించారు.
ఆయన
మాట్లాడుతుండగానే
అక్కడే
ఉన్న
ఇషా
సింగ్
వెంటనే
జోక్యం
చేసుకున్నారు.
ప్రసంగాన్ని
మధ్యలోనే
ఆపివేశారు.
మైక్
లాక్కున్నారు.
మీ
చేతులకు
చాలా
మంది
రక్తం
అంటింది.
40
మంది
చనిపోయారు.
మీరేం
చేస్తున్నారు?”
అని
నిర్వాహకులను
ప్రశ్నించారు.
అనుమతించిన
సంఖ్యకు
మించి
ప్రవేశం
లేదని
స్పష్టం
చేశారు.
దీనికి
సంబంధించిన
వీడియో
సోషల్
మీడియాలో
భారీగా
వైరల్
అయ్యింది.
లేడీ
సింగంగా
ఆమెను
అభివర్ణించింది
సోషల్
మీడియా.
రాజకీయ
ఒత్తిళ్లకు
లొంగకుండా
నిబంధనలను
ధైర్యంగా
అమలు
చేసినందుకు
ప్రశంసించింది.
ఇప్పుడు
తాజాగా
ఆమె
బదిలీ
కావడం
చర్చనీయాంశమైంది.
ఆమెతో
పాటు
కేంద్ర
పాలిత
రాష్ట్రాల్లో
పని
చేస్తోన్న
మొత్తం
31
మంది
ఐఎఎస్,
18
మంది
ఐపీఎస్
అధికారులను
కేంద్ర
హోం
మంత్రిత్వ
శాఖ
బదిలీ
చేసింది.
1998లో
ముంబైలో
జన్మించిన
ఇషా
సింగ్
తండ్రి
యోగేష్
ప్రతాప్
సింగ్
కూడా
ఐపీఎస్
అధికారే.
తల్లి
అభా
సింగ్..
ఇండియన్
పోస్టల్
సర్వీస్
అధికారిణి.
ఆ
తర్వాత
న్యాయవాద
వృత్తిలోకి
అడుగుపెట్టారు.
ఇషా
కూడా
బెంగుళూరులోని
నేషనల్
లా
స్కూల్
విద్యార్థిని.
-
గౌతమి, సింహపురి, గోదావరి ఎక్స్ప్రెస్ లకు కొత్త హాల్ట్ స్టేషన్
-
Horoscope today: విశేష యోగాలతో ఈ రాశులవారికి సకల సంపదలు!
-
భారత్ కు మద్దతుగా పాక్ నుంచి సంచలన లేఖ..! ఆపరేషన్ సింధూర్ భేష్..!
-
Rythu Bharosa : వారికి రైతు భరోసా కట్!, రైతులకు ఊహించని షాక్.
-
PF ఖాతాతోనే ఇన్సూరెన్స్. EPFO చెప్పిన సూపర్ గుడ్ న్యూస్
-
యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్.. మీకు అష్ట దరిద్రాలు అంటూ అన్వేష్ శాపం!
-
DSC అభ్యర్ధులకు అలర్ట్, డీఎస్సీ 2026 షెడ్యూల్ వచ్చేస్తుంది.
-
ఈ రాత్రికే అంబరాన అద్భుతం: ఇప్పుడు తప్పితే మళ్లీ ఏడాది చివరికే ఛాన్స్
-
IRCTC బంపర్ ఆఫర్, కూర్గ్..మైసూర్ తో సహా – 5 రోజులు..ప్యాకేజీ..!!
-
6, 6, 6, 6, 6, 4: హార్దిక్ పాండ్యా.. మ్యాడ్ బ్యాటింగ్
-
Ind-NZ ODI Series: కివీస్ తో వన్డేలకు టీమ్ ఎంపిక..! బీసీసీఐ కీలక అప్డేట్..!
-
Amaravati: మంత్రులు, ఐఏఎస్ లు, జడ్జీలకు అమరావతిలో బిగ్ న్యూస్..!


