International
oi-Chandrasekhar Rao
Canada
earthquake
2025:
కెనడాలో
భారీ
భూకంపం
సంభవించింది.
నార్త్
పసిఫిక్
మహాసముద్రం
తీర
ప్రాంత
నగరంలో
భూమి
ప్రకంపించడం
వల్ల
అలలు
ఎగిసిపడ్డాయి.
తీరం
అల్లకల్లోలానికి
గురైంది.
పరిస్థితులను
దృష్టిలో
ఉంచుకుని
స్థానిక
అధికారులు
ముందు
జాగ్రత్త
చర్యలు
తీసుకున్నారు.
తీరాన్ని
ఖాళీ
చేయించారు.
బీచ్
లను
మూసివేశారు.
పరిస్థితులు
అదుపులోకి
వచ్చేంత
వరకూ
బీచ్
లల్లోకి
సందర్శకులను
ఎవరికీ
అనుమతించట్లేదు.
రిక్టర్
స్కేల్
పై
భూకంప
తీవ్రత
7.1గా
నమోదైంది.
కెనడా-
అలస్కా
కాలమానం
ప్రకారం
ఉదయం
11:41
నిమిషాలకు
భూమి
ప్రకంపించింది.
కెనడా-
అలస్కా
సరిహద్దుల్లోని
యకుటాట్
కు
78
కిలోమీటర్ల
దూరంలో
గల
ప్రాంతాన్ని
భూకంప
కేంద్రంగా
గుర్తించారు.
ఉపరితలం
నుంచి
32
కిలోమీటర్ల
లోతున
టెక్టానిక్
ప్లేట్లల్లో
చోటు
చేసుకున్న
పెను
కదలికల
వల్ల
భూమి
కంపించినట్లు
నేషనల్
సెంటర్
ఫర్
సెస్మాలజీ
వెల్లడించింది.
ఇది
షాలో
భూకంపం.
లోతు
తక్కువగా
ఉండే
భూకంపాలను
షాలోగా
పరిగణిస్తారు.
సాధారణం
కంటే
ఇవి
మరింత
ప్రమాదకరం.
ఒక్కసారి
షాలో
ఎర్త్
క్వెక్
సంభవించిందంటే..
ప్రధాన
ప్రకంపం
తర్వాత
కూడా
ప్రకంపనలు
సంభవిస్తుంటాయి.
దీనివల్ల
నష్టం
అధికంగా
ఉంటుంది.
భూ
ఉపరితలానికి
దగ్గరగా
ఉన్నప్పుడు
ఇలాంటి
భూకంపాలు
ఎక్కువ
శక్తిని
విడుదల
చేస్తాయి.
ఎక్కువ
విధ్వంసాన్ని
కలిగిస్తాయి.
ఇది
కూడా
అలాంటిదేనని
యూఎస్జీఎస్
తెలిపింది.
ఈ
భారీ
భూకంపం
తరువాత
చిన్నపాటి
ప్రకంపనలు
సంభవించాయి.
ప్రధాన
భూకంపం
సంభవించిన
fault
line
వెంట
భూమి
సర్దుబాట్ల
కారణంగా
ఇవి
ఏర్పడతాయి.
ఈ
ఆఫ్టర్‌షాక్‌లు
ప్రధాన
భూకంపం
తర్వాత
రోజులు,
వారాలు
లేదా
సంవత్సరాల
తరబడి
కూడా
కొనసాగవచ్చని,
వాటి
తీవ్రత
కూడా
మారుతుంటుందని
యూఎస్జీఎస్.
వివరించింది.
కొన్ని
సందర్భాల్లో
ఆఫ్టర్‌షాక్
తీవ్రత
ప్రధాన
భూకంప
తీవ్రతతో
సమానంగా
లేదా
అంతకు
మించి
కూడా
ఉంటుందని
తెలిపింది.
యాకుటాట్
సమీపంలో
సంభవించిన
ఈ
సీస్మిక్
యాక్టివిటీ
కారణంగా,
స్థానిక
ప్రజల్లో
భయాందోళనలు
వ్యక్తం
అయ్యాయి.
ఇళ్ల
నుంచి
బయటికి
పరుగులు
తీశారు.
కొన్నిచోట్ల
రోడ్లు
కోసుకుపోయాయి.
ప్రత్యేకించి-
ఫాల్ట్
లైన్స్
కు
దగ్గరగా
నివసించే
వారిలో
ఆందోళన
పెరిగింది.
భూకంప
స్థితిగతులపై
తదుపరి
సమాచారం
అందేంత
వరకు
జాగ్రత్తగా
ఉండాలని
అధికారులు
విజ్ఞప్తి
చేశారు.
ఈ
భూకంపం
వల్ల
కలిగే
ఎలాంటి
ప్రభావాలను
అయినా
ఎదుర్కోవడానికి
అత్యవసర
సహాయక
బృందాలు
సిద్ధంగా
ఉన్నాయి.


