విశాఖ నుంచి వెళుతున్న ఇరాన్ షిప్‌పై దాడి – 101 మంది గల్లతు..!!

Date:


International

oi-Bomma Shivakumar

శ్రీలంక తీరంలో ఇరాన్ కు చెందిన ఐరిస్‌ డెనా అనే యుద్ధనౌకపై దాడి జరిగింది. ఈ ఘటనలో 101 మంది గల్లంతు అయినట్లు సమాచారం. అలాగే ఒకరు మృతి చెందారు. మరో 78 మంది గాయపడినట్లు తెలుస్తోంది. శ్రీలంక నేవీ, శ్రీలంక డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఘటన మార్చి 4 న తెల్లవారుజామున జరిగినట్లు స్పష్టం అవుతోంది. అయితే ఈ నౌకపై దాడి చేసింది ఎవరో తెలియాల్సి ఉంది. అయితే దాడి జరిగిన సమయంలో యుద్ధనౌక పూర్తిగా నీటిలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. ఈ నౌక కొద్ది రోజుల క్రితం విశాఖ వేదికగా జరిగిన IFR( ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ)లో పాల్గొని తిరిగి ఇరాన్ వెళుతుండగా దాడి జరిగింది. ఐఎఫ్‌ఆర్ వేడుకను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు.

ఘటన విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన శ్రీలంక నేవీ అధికారులు సముద్రంలో చిక్కుకున్న వారిని గల్లెలోని కారాపిటియా టీచింగ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అయితే ఇదే విషయంపై శ్రీలంక నేవీ అధికారి మాట్లాడుతూ.. 101 మంది మిస్సింగ్ అనేది వాస్తవం కాదని తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన 32 మందిని శ్రీలంక నేవీ అధికారులు రక్షించి.. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

ఇదే విషయంపై శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత్ హెరాత్ మాట్లాడుతూ.. ఇరాన్ కు చెందిన యుద్ధనౌక నుంచి తమకు డిస్ట్రెస్ కాల్ వచ్చిందని.. మార్చి 4 ఉదయం 6 గంటలకు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించామని పేర్కొన్నారు. అయితే ఈ నౌకపై దాడి చేసింది ఎవరనేది ఇంకా స్పష్టంగా తెలియలేదని.. ఈ నౌక ప్రస్తుతం సముద్రంలో మునిగిపోయిందని స్పష్టం చేశారు.

ఇక మరో నేవీ ఆఫీసర్ ఈ ఘటనపై మాట్లాడుతూ.. ఆసుపత్రికి తరలించిన వారిలో ఓ వ్యక్తి మరణించినట్లు తెలిపారు. అలాగే ఈ దాడిలో దాదాపు 79 మందిని రక్షించి ఆసుపత్రికి చేర్చామని.. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం అవుతోంది.

మరోవైపు యుద్ధంపై ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. అమెరికాతో చర్చలు జరిపే ఆలోచన తమకు లేదని ఇరాన్ పేర్కొంది. అమెరికా యుద్ధాన్ని అలాగే కొనసాగించే అవకాశం ఉందని ఖమేనీ సన్నిహుతుడు స్పష్టం చేశారు ఇక తమతో చర్చలు జరిపేందుకు ఇరాన్ ప్రయత్నించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇరాన్ ఈ వ్యాఖ్యలు చేసింది. ట్రంప్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related