వెయ్యి మంది మానవ బాంబులు సిద్ధం.. మసూద్ అజార్ ఆడియో లీక్!

Date:


India

oi-Jakki Mahesh

నిషేధిత
ఉగ్రవాద
సంస్థ
జైషే
మొహమ్మద్
అధినేత
మసూద్
అజార్
భారత్‌పై
మరోసారి
విషం
చిమ్మాడు.
వెయ్యి
మందికి
పైగా
మానవ
బాంబులు
సిద్ధంగా
ఉన్నారంటూ
అతడు
విడుదల
చేసిన
ఆడియో
రికార్డింగ్
ఇప్పుడు
కలకలం
రేపుతోంది.
వందల
సంఖ్యలో
కాదు
వేల
సంఖ్యలో
ఆత్మాహుతి
దాడులకు
తమ
ముఠా
సిద్ధంగా
ఉందని..
తానే
వారిని
ఆపుతున్నానని
పేర్కొన్న

ఆడియో
రికార్డింగ్
ఇప్పుడు
బయటకు
వచ్చింది.



ఆడియోలో
ఏముంది?

సోషల్
మీడియాలో
వైరల్
అవుతున్న

ఆడియోలో
మసూద్
అజార్
గొంతును
పోలిన
వ్యక్తి
ఇలా
అన్నాడు.
“భారత్‌పై
దాడి
చేసేందుకు
సిద్ధంగా
ఉన్న
మానవ
బాంబులు
ఒకరు
కాదు,
ఇద్దరు
కాదు..
వందల
సంఖ్యలో
కూడా
కాదు.
కనీసం
వెయ్యి
మందికి
పైగా
నా
అనుమతి
కోసం
వేచి
చూస్తున్నారు.
నేను
గనుక
అసలు
సంఖ్యను
బయటపెడితే
రేపు
ప్రపంచ
మీడియాలో
పెద్ద
హంగామా
జరుగుతుంది.
వారు
ప్రాణ
త్యాగానికి
సిద్ధంగా
ఉన్నారు.”
అని

ఆడియోలో
మసూద్
అజార్
గొంతు
పలికినట్లుగా
ఉంది.
అయితే

ఆడియో
ఎప్పుడు
రికార్డ్
అయింది?
దీని
ప్రామాణికత
ఎంత?
అన్నది
మాత్రం
ఇంకా
స్వతంత్రంగా
నిర్ధారణ
కాలేదు.


భారత్
దెబ్బకు
బెంబేలెత్తిపోయి..

గత
ఏప్రిల్
22న
పహల్గాంలో
జరిగిన
ఉగ్రదాడిలో
26
మంది
భారతీయులు
ప్రాణాలు
కోల్పోయారు.
దీనికి
ప్రతీకారంగా
భారత
సైన్యం
పాకిస్థాన్‌లోని
బహవల్పూర్‌లో
ఉన్న
జైషే
మొహమ్మద్
ప్రధాన
కార్యాలయంపై
మెరుపు
దాడులు
(ఆపరేషన్
సిందూర్)
నిర్వహించింది.

దాడుల్లో
మసూద్
అజార్‌కి
అత్యంత
సన్నిహితులు,
బంధువులు
హతమయ్యారు.

పరాజయం
నుంచి
కోలుకోలేక,
తమ
ఉగ్రవాదుల్లో
స్థైర్యం
నింపేందుకే
అజార్
ఇటువంటి
రెచ్చగొట్టే
వ్యాఖ్యలు
చేస్తున్నట్లు
రక్షణ
నిపుణులు
భావిస్తున్నారు.


మసూద్
అజార్
నేపథ్యం

2001
పార్లమెంట్
దాడి,
2008
ముంబై
దాడుల
వెనుక
మాస్టర్‌మైండ్‌గా
మసూద్
అజార్
ఉన్నాడు.
2019
తర్వాత
అజార్
బహిరంగంగా
ఎక్కడా
కనిపించలేదు.
బహవల్పూర్‌లోని
అతడి
రహస్య
స్థావరంపై
గుర్తుతెలియని
వ్యక్తులు
బాంబు
దాడి
చేసిన
తర్వాత
అతడు
అజ్ఞాతంలోకి
వెళ్లిపోయాడు.
ఇటీవల
ఢిల్లీలో
జరిగిన
బాంబు
పేలుళ్లలో
15
మంది
మరణించగా..
దీనికి
సూత్రధారి
అయిన
ఉమర్
మొహమ్మద్‌కి
జైషే
మొహమ్మద్‌తో
సంబంధాలు
ఉన్నట్లు
ఢిల్లీ
పోలీసులు
గుర్తించారు.





Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related