Telangana
oi-Lingareddy Gajjala
రాజన్న
సిరిసిల్ల
జిల్లా
వేములవాడలోని
ప్రసిద్ధ
రాజన్న
ఆలయ
పరిసరాలు
మరోసారి
నాగుపాముల
కలకలంతో
ఉలిక్కిపడ్డాయి.
ఆలయ
సెంట్రల్
గోదాంలో
ఒక్కసారిగా
నాగుపాములు
కనిపించడంతో
ఉద్యోగులు,
సిబ్బంది
తీవ్ర
భయాందోళనకు
గురయ్యారు.
నిత్యం
ప్రసాదాల
నిల్వ,
సరఫరా
జరిగే
కీలక
గోదాంలో
పాములు
దర్శనమివ్వడంతో
పనులు
నిలిచిపోయే
పరిస్థితి
నెలకొంది.
గోదాంలో
మాత్రమే
కాకుండా,
ప్రసాదాల
విక్రయశాల,
ధర్మశాల
ప్రాంతాల్లో
కూడా
తరచూ
నాగుపాములు
కనిపిస్తున్నాయని
సిబ్బంది
ఆందోళన
వ్యక్తం
చేస్తున్నారు.
ఇప్పటికే
పలుమార్లు
పాములు
బయటపడటంతో
గోదాంలోకి
వెళ్లి
పని
చేయాలంటేనే
ఉద్యోగులు
భయపడుతున్నారు.
“ఏ
క్షణంలో
ఎక్కడ
పాము
కనిపిస్తుందో
తెలియడం
లేదు”
అంటూ
సిబ్బంది
వణికిపోతున్నారు.
సమాచారం
అందుకున్న
స్నేక్
స్నాచర్
వెంటనే
రంగంలోకి
దిగాడు.
ఇలాంటి
పరిస్థితులు
ప్రమాదకరం
ఇప్పటివరకు
ఆలయ
పరిసరాల
నుంచి
20కి
పైగా
నాగుపాములను
పట్టుకుని
అడవిలో
వదిలిపెట్టినట్టు
వెల్లడించాడు.
ఆలయ
పరిసరాల్లో
పాత
భవనాలు,
గోడల
పగుళ్లు,
భూగర్భ
గదులు
ఉండటమే
పాములు
చేరడానికి
కారణమై
ఉండొచ్చని
అంచనా
వేస్తున్నారు.
ఈ
ఘటనలు
బయటకు
రావడంతో
భక్తుల్లోనూ
ఆందోళన
మొదలైంది.
“నిత్యం
వేలాది
మంది
భక్తులు
వచ్చే
ఆలయంలో
ఇలాంటి
పరిస్థితులు
ప్రమాదకరం”
అంటూ
భక్తులు
ఆవేదన
వ్యక్తం
చేస్తున్నారు.
ముఖ్యంగా
చిన్న
పిల్లలు,
వృద్ధులు,
మహిళలు
సంచరిస్తున్న
ధర్మశాలలు,
ప్రసాదాల
విక్రయ
కేంద్రాల్లో
పాములు
కనిపించడం
తీవ్ర
భయాన్ని
కలిగిస్తోంది.
గతంలో
కూడా
పలుమార్లు..
ఇది
తొలిసారి
కాదు.
గతంలో
కూడా
పలుమార్లు
రాజన్న
ఆలయ
పరిసరాల్లో
నాగుపాములు
కలకలం
రేపాయి.
కొన్ని
నెలల
క్రితం
ధర్మశాల
వద్ద
నాగుపాము
కనిపించడంతో
భక్తులు
పరుగులు
పెట్టిన
ఘటన
చోటుచేసుకుంది.
మరోసారి
ప్రసాదాల
నిల్వ
గదిలో
పాము
బయటపడడంతో
సిబ్బంది
గంటల
పాటు
పనులు
నిలిపివేశారు.
ఆ
సమయంలోనూ
స్నేక్
స్నాచర్‌ను
పిలిపించి
పామును
పట్టుకున్నారు.
పునరావృతమవుతున్న
ఈ
ఘటనలపై
ఆలయ
అధికారులు
తక్షణమే
శాశ్వత
పరిష్కారం
చూపాలని
భక్తులు
డిమాండ్
చేస్తున్నారు.
ఆలయ
పరిసరాల్లో
సమగ్ర
శానిటేషన్,
పాత
నిర్మాణాల
మరమ్మతులు,
పాములు
చేరకుండా
ప్రత్యేక
భద్రతా
చర్యలు
తీసుకోవాలని
కోరుతున్నారు.
లేదంటే
ఎలాంటి
అపశృతి
జరుగుతుందోనన్న
భయం
భక్తులను
వెంటాడుతోంది.
ఇకపై
ఇలాంటి
ఘటనలు
జరగకుండా
ముందస్తు
చర్యలు
తీసుకుంటారా?
లేక
రాజన్న
ఆలయంలో
నాగుపాముల
కలకలం
కొనసాగుతుందా?
అన్న
ప్రశ్నలకు
ఆలయ
యాజమాన్యం
ఇచ్చే
సమాధానమే
ఇప్పుడు
కీలకంగా
మారింది.


