Telangana
oi-Sai Chaitanya
నాడు వైఎస్..నేడు రేవంత్. నాడు కేవీపీ.. నేడు వేం నరేందర్ రెడ్డి. అదే ఫార్ములా.. అదే టార్గెట్. రేవంత్ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా నిలిచారు. బై పోల్స్.. మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో హైకమాండ్ వద్ద పట్టు పెంచుకున్నారు. సీఎం అయిన నాటి నుంచి పార్టీ హైకమాండ్ ను మెప్పించేందుకు తొలి నుంచి ప్రయత్నించారు. ఇందుకు పూర్తిగా వైఎస్సార్ అమలు చేసిన ఫార్ములానే రేవంత్ కొనసాగించారు. “అన్నింటా” హైకమాండ్ కు అభయం ఇచ్చారు. అదే సక్సెస్ మంత్రగా మార్చుకున్నారు.
వైఎస్సార్ తరువాత ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ కు ఆదరణ ఉన్న నేతగా రేవంత్ కనిపిస్తు న్నారు. తెలంగాణ ఇచ్చినా రెండు రాష్ట్రాల్లోనూ నష్టపోయిన కాంగ్రెస్ పదేళ్ల తరువాత అధికారం దక్కించుకుంది. కాంగ్రెస్ లో చేరిన సమయం నుంచే ఢిల్లీ కేంద్రంగా సైలెంట్ ఆపరేషన్ అమలు చేసారు. అదే సీనియర్లు పోటీ పడ్డా..ఎందరు అడ్డు చెప్పినా టీపీసీసీ పదవి దక్కటానికి కారణం అయింది. ఆ పదవి ఇస్తే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత తనదేనని రేవంత్ స్పష్టం చేసారు. కాంగ్రెస్ కు మింగుడపడని కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ..హైకమాండ్ ను ఆకట్టుకున్నారు. హైకమాండ్ ను ఎలా మేనేజ్ చేయాలో నాడు వైఎస్సార్ అమలు చేసిన ఫార్ములానే కొనసాగిస్తూ.. హైకమాండ్ తన మాట విశ్వసించేలా చేయటంలో సక్సెస్ అయ్యారు. నాడు వైఎస్ ప్రత్యర్థుల విషయంలో తన సక్సెస్ తో హైకమాండ్ తన మాట కాదనలేని పరిస్థితి తో ముందుకు సాగారు.
నాడు కేవీపీ.. నేడు వేం ఒకే తరహాలో ఎంపిక
నాడు వైఎస్సార్ తన ఆత్మీయుడు కేవీపీ రామచంద్ర రావుకు రాజ్యసభ ఇప్పించుకున్నారు. ఢిల్లీ లో తన మనిషిగా కేవీపీకి అవకాశం కల్పించారు. ఆ తరువాత ఢిల్లీ హైకమాండ్ నేతలతో మరింత గా సంబంధాలు బల పడ్డాయి. ఇప్పుడు రేవంత్ సైతం తన స్నేహితుడు వేం నరేందర్ రెడ్డి కి రాజ్యసభ సీటు ఖరారు చేయించటంలోనూ ఇదే ఫార్ములా అనుసరించారు. అనేక మంది పేర్లు చివరి వరకు రేసులో ఉన్నా… సామాజిక లెక్కలు తెర మీదకు వచ్చినా.. తన పంతం హైకమాండ్ వద్ద నెగ్గించుకున్నారు. సొంత పార్టీలో తనకు వ్యతిరేకంగా ఉన్న వారికి ఈ నిర్ణయం ద్వారా క్లియర్ సంకేతాలు ఇచ్చారు. టీడీపీలో ఉన్న సమయం నుంచి వేం నరేందర్ రెడ్డి. రేవంత్ మధ్య స్నేహం కొనసాగుతోంది. తాను సీఎం అయిన తరువాత వేం కు సలహాదారు పదవి ఇచ్చారు. రెండేళ్ల తరువాత ఇప్పుడు రాజ్యసభకు పంపుతున్నారు. సలహదారు పదవిలోనూ కొనసాగనున్నారు. దీని ద్వారా రేవంత్ 2028 మిషన్ ఏంటనేది స్పష్టం అవుతోంది.


