Andhra Pradesh
oi-Korivi Jayakumar
తిరుమల
శ్రీవారి
ఆలయంలో
వైకుంఠ
ఏకాదశి
సందర్భంగా
జరిగే
మహా
పర్వదిన
వేడుకలకు
టీటీడీ
సర్వం
సిద్ధం
చేసింది.
కాగా
వైకుంఠ
ఏకాదశి
రోజున
శ్రీవారి
వైకుంఠ
ద్వారం
దర్శనం
చేసుకుంటే
మోక్షప్రాప్తి
కలుగుతుందనే
నమ్మకంతో
లక్షలాది
మంది
భక్తులు
తిరుమలకు
తరలివస్తున్నారు.
ఈ
క్రమంలోనే
భక్తుల
సౌకర్యం,
భద్రత,
ఆరోగ్య
పరిరక్షణకు
ప్రాధాన్యత
ఇస్తూ
విస్తృత
స్థాయిలో
ఏర్పాట్లు
చేపట్టింది.
అయితే
సోమవారం
అర్ధరాత్రి
12.05
గంటలకు
ఆలయంలోని
బంగారు
వాకిలి
(వైకుంఠ
ద్వారం)ను
తిరుప్పావై
పాశురాల
గానంతో
తెరుస్తారు.
వైకుంఠ
ద్వారం
వద్ద
అర్చకులు
ప్రత్యేక
పూజలు,
హారతి
సమర్పణ
చేస్తారు.
అనంతరం
తోమాలపటంతో
ప్రదక్షిణ,
గర్భాలయంలో
మూలవిరాట్టుకు
పుష్ప
సమర్పణ..
నిత్య
పూజా
కైంకర్యాలు,
ఏకాంత
సేవలు
నిర్వహిస్తారు.
ఈ
ఆచారాల
అనంతరం
రాత్రి
1.30
గంటల
నుంచి
భక్తులను
దర్శనానికి
అనుమతిస్తారు.
జనవరి
8
వరకు
వైకుంఠ
ద్వార
దర్శనాలు
కొనసాగనున్నాయి.
అంతే
కాకుండా
వైకుంఠ
ఏకాదశి
సందర్భంగా
రద్దీని
నియంత్రించేందుకు
టీటీడీ
కింది
చర్యలు
తీసుకుంది.
అందులో
భాగంగానే
ప్రత్యేక
క్యూలైన్లు,
చలువ
పందిళ్లు
(షెడ్లు),
తాగునీరు,
బట్టర్
మిల్క్
పంపిణీ..
వృద్ధులు,
దివ్యాంగులకు
ప్రత్యేక
సహాయం,
మహిళలు,
చిన్న
పిల్లల
కోసం
ప్రత్యేక
మార్గాలు
ఏర్పాటు
చేసింది.
భక్తులకు
ఎలాంటి
అసౌకర్యం
కలగకుండా
సిబ్బందిని
అధిక
సంఖ్యలో
నియమించారు.
మరీ
ముఖ్యంగా
అత్యవసర
సహాయానికి
ముఖ్యమైన
ఫోన్
నంబర్లు
ప్రకటించారు.
భక్తులకు
ఎలాంటి
ఇబ్బందులు
ఎదురైనా
వెంటనే
సంప్రదించేందుకు
టీటీడీ
24/7
సేవలు
అందిస్తోంది.
ఈ
నంబర్లను
ఫోన్‌లో
సేవ్
చేసుకోవాలని
సూచించింది.
ప్రధాన
సహాయ
కేంద్రాలు
(24/7)..
TTD
టోల్
ఫ్రీ
హెల్ప్
లైన్:
155257
విచారణ
కార్యాలయం
(Enquiry):
0877-2277777
వైద్య
సహాయం..
అశ్విని
ఆసుపత్రి
(తిరుమల):
0877-2263457
/
2263458
అంబులెన్స్
సేవలు:
0877-2263666
లేదా
నేరుగా
108
మెయిన్
హాస్పిటల్
(తిరుపతి):
0877-2287777
భద్రత
&
పోలీస్
సహాయం..
దొంగతనాలు,
తప్పిపోయిన
వారు
లేదా
ఇతర
భద్రతా
సమస్యల
కోసం:
విజిలెన్స్
ఆఫీస్
(TTD
Security):
0877-2263333
తిరుమల
క్రైమ్
పార్టీ:
0877-2263939
తిరుమల
వన్
టౌన్
పోలీస్
స్టేషన్:
0877-2263833
ట్రాఫిక్
పోలీస్
స్టేషన్:
0877-2263733
ఇతర
ముఖ్య
సేవల
నంబర్లు..
కళ్యాణకట్ట
(తలనీలాలు):
0877-2263222
అన్నప్రసాదం
సెంటర్:
0877-2263555
భక్తులకు
ముఖ్య
సూచనలు..
తప్పిపోయిన
వారు:
కుటుంబ
సభ్యులు
ఎవరైనా
తప్పిపోతే
వెంటనే
దగ్గరలోని
విజిలెన్స్
ఆఫీసులో
సమాచారం
ఇచ్చి
అనౌన్స్‌మెంట్
చేయించాలి.
డిజిటల్
&
నగదు
చెల్లింపులు:
తిరుమలలో
చాలా
చోట్ల
ఆన్‌లైన్
పేమెంట్స్
అందుబాటులో
ఉన్నప్పటికీ,
నెట్‌వర్క్
లేదా
సర్వర్
సమస్యలు
ఎదురయ్యే
అవకాశం
ఉన్నందున
కొంత
నగదు
చేతిలో
ఉంచుకోవడం
మంచిది.
సమయపాలన:
క్యూలైన్లలో
ఎక్కువ
సమయం
వేచిచూడాల్సి
ఉండవచ్చు.
కావున
తగిన
ఆహారం,
నీరు
వెంట
తీసుకురావాలి.
నిషేధిత
వస్తువులు:
ప్లాస్టిక్
వస్తువులు,
ఎలక్ట్రానిక్
గాడ్జెట్లు
ఆలయంలోకి
అనుమతి
లేదు.


