వైజాగ్ సమ్మిట్ సగం ఫలితం రాబట్టేసిన చంద్రబాబు..! 7.69 కోట్ల రాకకు రెడీ..! | AP Delivers on Vizag CII Summit Promise: Over 50% of MoUs Now Ready for Foundation Stones

Date:


Andhra Pradesh

oi-Syed Ahmed

ఏపీలో
గత
నెలలో
కూటమి
సర్కార్
విశాఖ
వేదికగా
సీఐఐ
భాగస్వామ్య
సదస్సు
నిర్వహించింది.
రాష్ట్రానికి
భారీ
ఎత్తున
పెట్టుబడుల
ఆకర్షణే
లక్ష్యంగా

సద్సస్సు
నిర్వహించింది.
ఇందులో
దాదాపు
14
లక్షల
కోట్ల
మేర
ఎంవోయూలు
కూడా
కుదుర్చుకుంది.
అయితే

ఎంవోయూల్ని
కార్యరూపంలోకి
తెచ్చేందుకు
అంతే
స్ధాయిలో
శ్రమిస్తోంది.
దీని
ఫలితాలు
ఇప్పుడిప్పుడే
కనిపిస్తున్నాయి.
ఇందులో
సగానికి
పైగా
ఎంవోయూలు
శంకుస్థాపన
బాటలో
ఉన్నట్లు
సీఎం
చంద్రబాబు
ఇవాళ
ప్రకటించారు.

రాష్ట్ర
ప్రభుత్వం
ఇటీవల
సీఐఐ
భాగస్వామ్య
సదస్సులో
కుదుర్చుకున్న
ఒప్పందాల్లో
50
శాతానికి
పైగా
ఆమోద
ప్రక్రియలోకి
వచ్చాయని,
45
రోజుల్లోగా
వీటికి
శంకుస్థాపన
జరిగేలా
చూడాలని
సీఎం
చంద్రబాబు
ఇవాళ
అధికారులను
ఆదేశించారు.
ఇవాళ
సచివాలయంలో
జరిగిన
13వ
రాష్ట్రస్థాయి
పెట్టుబడుల
బోర్డు
సమావేశంలో
రూ.20,444
కోట్ల
విలువైన
పెట్టుబడులకు
బోర్డు
ఆమోదం
తెలిపింది.
దీంతో
56,278
మందికి
ఉద్యోగావకాశాలు
లభించనున్నాయి.
ఇందులోనే
ఇటీవల
విశాఖలో
జరిగిన
పెట్టుబడుల
సదస్సులో
ఒప్పందాలు
కుదుర్చుకున్న
6
కంపెనీలకు
కూడా
ఎస్ఐపీబీ
ఆమోదం
తెలిపింది.

AP Delivers on Vizag CII Summit Promise Over 50 of MoUs Now Ready for Foundation Stones

దీంతో
విశాఖ
భాగస్వామ్య
సదస్సులో
కుదుర్చుకున్న
ఒప్పందాలపై
సీఎం
చంద్రబాబు
సమీక్షించారు.
ఏపీ
ప్రభుత్వం
అమలు
చేస్తున్న
స్పీడ్
ఆఫ్
డూయింగ్
బిజినెస్
విధానాన్ని
చూసే
ప్రముఖ
సంస్థలు
పెద్దఎత్తున
ఏపీకి
వస్తున్నాయని
ఆయన
తెలిపారు.
కంపెనీలు
స్థాపించడానికి
ఎలాంటి
ఇబ్బంది
లేకుండా
చూస్తున్నామన్నారు.
ఆయా
కంపెనీలకు
అవసరమైన
నీరు,
విద్యుత్,
భూమి
వంటి
సౌకర్యాలను
కల్పిస్తున్నాం,
వాటి
విషయంలో
పారదర్శకత
పాటిస్తుండడం
వల్లనే
ప్రాజెక్టులు
ఏపీకి
వస్తున్నాయన్నారు.

AP Delivers on Vizag CII Summit Promise Over 50 of MoUs Now Ready for Foundation Stones

20
రోజుల
క్రితం
విశాఖ
భాగస్వామ్య
సదస్సు
నిర్వహిస్తే
ఇప్పటికే
రూ.7.69
కోట్ల
విలువైన
ఒప్పందాలు
ఆచరణ
దిశగా
అడుగులు
వేస్తున్నాయని
సీఎం
తెలిపారు.

ఎంఓయూలు
అన్నింటికీ
ఏయే
జిల్లాల్లో
ఏర్పాటు
చేయాలి,
ఎక్కడెక్కడ
భూములివ్వాలనే
అంశంపైనా
నిర్ణయాలు
జరిగాయన్నారు.
ఇక
మిగిలిన
ఎంఓయూలను
వీలైనంత
త్వరగా
పట్టాలెక్కించాలని
అధికారులకు
సూచించారు.
45
రోజుల్లోగా
ఎంఓయూలు
అన్నింటినీ
గ్రౌండింగ్
అయ్యేలా
చూడాలన్నారు.
వీలైనన్ని
ఎంఓయూలను
గ్రౌండింగ్
చేసి
దావోస్
సదస్సుకు
వెళ్తే
మరిన్ని
పెట్టుబడులను
వస్తాయన్నారు.
దావోస్
పర్యటనకు
ముందే
75
ఎంఎస్ఎంఈ
పార్కులకు
శంకుస్థాపన
జరిగేలా
చూడాలన్నారు.
ఎంఓయూల
గ్రౌండింగ్‌పై
ప్రతీ
వారం
సీఎస్
సమీక్షించాలని
ఆదేశించారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related