International
oi-Bomma Shivakumar
భారత్ కు పాకిస్థాన్ చిరకాల ప్రత్యర్థిగా చెబుతుంటారు. భారత్ కు ఉన్న శత్రు దేశాల్లో పాకిస్థాన్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. క్రికెట్ అయినా.. యుద్ధం అయినా.. భారత్- పాకిస్థాన్ మధ్యే అన్నట్లుగా ఇటీవలి కాలంలో ఇరు దేశాల మధ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయక టూరిస్టులను టెర్రరిస్టులు కాల్చివేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(POK) లోని 9 కీలక ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది.
ఈ ఘటనల తర్వాత పాకిస్థాన్- భారత్ మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇరు దేశాల మధ్య ప్రయాణం, వాణిజ్యం నిలిచిపోయాయి. అయితే ఇటీవల ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా భారత్- పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. శ్రీలంకలోని కొలంబో వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం సాధించింది. పాక్‌ను 61 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది టీమిండియా జట్టు. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన టీమ్ఇండియా, దాయాది జట్టుపై తమ ట్రాక్ రికార్డ్ ను మెరుగుపర్చుకుంది. ఈ విజయంతో ఈ వరల్డ్ కప్ లో భారత్ సూపర్ 8 దశకు దూసుకుపోయింది.
అయితే భారత్- పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా బ్రిటన్‌లో ఒకే అద్దె ఇంట్లో ఉంటున్న భారత్, పాకిస్థానీ యువకులు ఒకర్నొకరు ఆట పట్టించుకున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. భారత్ చేతిలో పాకిస్థాన్ ఓటమి నేపథ్యంలో చేసిన ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
విషయం ఏంటంటే..? పాకిస్థాన్ కు చెందిన అలీ రజా అనే యువకుడు బ్రిటన్ లో ట్రెయినీ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. అతడు.. యూసుఫ్ సులేమాన్ అనే భారత్ కు చెందిన సింగర్ తో కలిసి ఒకే అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అయితే ఇటీవల జరిగిన టీ20 మ్యాచ్ లో పాకిస్థాన్.. భారత్ చేతిలో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో పాకిస్థానీ క్రికెటర్ ఫర్హాన్ డక్ ఔట్ గా వెనుదిరిగాడు.
ఈ క్రమంలో భారత్ కు చెందిన యూసుఫ్ సులేమానీ.. పాకిస్థాన్ కు చెందిన రజాను సరదాగా ఆటపట్టించాడు. అలీ రజా కిచెన్ లో రొట్టెలు కాల్చుతుండగా యూసుఫ్ వచ్చి ఫర్హాన్ డకౌట్ అని చెప్తాడు. ‘యువరాజు ఫర్హాన్’ అంటూ అలీ రజాను ఆటపట్టించాడు. దీంతో.. అలీ రజా .. ‘వెళ్లి నీ పని చేసుకోవయ్యా..’ అన్నాడు.. వాళ్లు సరదాగా ఈ వీడియోను షేర్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అవుతోంది.


