Andhra Pradesh
oi-Syed Ahmed
ఏపీలో
గత
ఎన్నికల
తర్వాత
కూటమి
ప్రభుత్వం
ఏర్పడి
ఏడాదిన్నర
దాటిపోయింది.
ప్రభుత్వం
పూర్తిగా
కుదురుకుంది.
అయితే
కూటమి
పార్టీల్లో
కీలకమైన
టీడీపీలో
(tdp)
కింది
స్ధాయిలో
క్యాడర్
మాత్రం
ఇంకా
గందరగోళంలోనే
ఉన్నట్లు
కనిపిస్తున్నారు.
స్థానికంగా
బలంగా
ఉన్న
వైసీపీ
నేతలతో
టీడీపీ
క్యాడర్
సంబంధాలు
కొనసాగిస్తోంది.
ఇదే
అంశం
టీడీపీ
ముఖ్యనేతల్ని
కలవరపెడుతోంది.
ఈ
నేపథ్యంలో
ఆ
పార్టీకి
చెందిన
సీనియర్
నేత,
అసెంబ్లీ
స్పీకర్
చింతకాయల
అయ్యన్నపాత్రుడు
కుమారుడు
విజయ్
కీలక
వ్యాఖ్యలు
చేశారు.
టీడీపీలో
ఉంటూ
వైసీపీ
నాయకులతో
సంబంధాలు
కొనసాగిస్తున్న
నర్సీపట్నం
క్యాడర్
పై
చింతకాయల్
విజయ్
తీవ్ర
ఆగ్రహం
వ్యక్తం
చేశారు.
స్ధానికంగా
జరిగిన
కార్యకర్తల
భేటీలో
మాట్లాడుతూ
సొంత
క్యాడర్
తీరుపై
ఆయన
అసంతృప్తి
వెళ్ళగక్కారు.వైసీపీ
నాయకులతో
సంబంధాలు
కొనసాగిస్తే
పేగులు
తీసి
రోడ్డు
మీద
పడేస్తానంటూ
వారిని
హెచ్చరించారు.
వైసీపీ
నాయకులతో
మాట్లాడినా,శుభ
కార్యాలకు
వెళ్లినా
ఊరుకునేది
లేదని
స్ట్రాంగ్
వార్నింగ్
ఇచ్చేశారు.
పేగులు
తీసి
రోడ్డు
మీద
పడేస్తాను..సొంత
పార్టీ
కార్యకర్తలపై
నోరు
పారేసుకున్న
చింతకాయల
విజయ్వైసీపీ
నాయకులతో
మాట్లాడినా,
శుభ
కార్యాలకు
వెళ్లినా
ఊరుకునేది
లేదని
బెదిరింపులుసిగ్గులేకుండా
కొంతమంది
టీడీపీ
కార్యకర్తలు
వైసీపీ
వాళ్లతో
మాట్లాడుతున్నారని
వ్యాఖ్యసిగ్గు,
లజ్జ,…
pic.twitter.com/xi9gWcuGAk—
Telugu
Feed
(@Telugufeedsite)
January
25,
2026
సిగ్గులేకుండా
కొంతమంది
టీడీపీ
కార్యకర్తలు
వైసీపీ
వాళ్లతో
మాట్లాడుతున్నారని
చింతకాయల
విజయ్
వ్యాఖ్యానించారు.
అలాంటి
వారి
వివరాలు
సేకరిస్తున్నట్లు
తెలిపారు.
వారిపై
సరైన
సమయంలో
చర్యలు
ఉంటాయన్నారు.
సిగ్గు,
లజ్జ,
మానవత్వం
ఉంటే
వైసీపీ
వాళ్లతో
మాట్లాడకూడదంటూ
టీడీపీ
క్యాడర్
ను
విజయ్
హెచ్చరించారు.
అటువంటి
వాళ్ళని
ఒంగోపెట్టి
తన్నేస్తానంటూ
వ్యాఖ్యానించారు.
దీంతో
చింతకాయల
విజయ్
వ్యాఖ్యలు
రాష్ట్రవ్యాప్తంగా
చర్చనీయాంశమవుతున్నాయి.


