Andhra Pradesh
oi-Sai Chaitanya
ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్దికంగా తోడ్పాటు అందిస్తామని ప్రకటించింది. ప్రతీ రైతుకు మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వ్యవసాయం లాభసాటిగా మారితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని, దాని ద్వారానే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని వివరించారు. ఏపీ వ్యవసాయ బడ్జెట్ రూ.53,752 కోట్లు గా మంత్రి ప్రతిపాదించారు. రైతు సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో 2026-27 ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్ సాధారణ బడ్జెట్ ను ప్రతిపాదించిన తరువాత అచ్చెన్నాయుడు వ్యవసాయ – అనుంబంధ రంగాల కేటాయింపులను వివరించారు. అందులో భాగంగా ధాన్యం సేకరణకు సంబంధించి రూ.1,674 కోట్ల బకాయిలు చెల్లింపు చేసినట్లు వెల్లడించారు. పెట్టుబడి రాయితీ కింద రూ.310 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణలో 50 శాతం రాయితీతో రూ.136 కోట్లు, భూసారాన్ని అంచనా వేయడానికి 6 లక్షల భూసార పరీక్ష పత్రాల అందజేస్తున్నామని వివరించారు. ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంతో 18 లక్షల మంది రైతులకు విస్తరణ సేవలు అందిస్తున్నారు. 80 శాతం రాయితీ కింద రూ.90.4 కోట్లతో 1,130 డ్రోన్ కేంద్రాలు, గతేడాది రూ.182 కోట్ల రాయితీతో విత్తనాల సరఫరా, పంటలను కాపాడేందుకు రైతులకు అన్నివిధాలుగా సాయం చేస్తామని ప్రకటించారు. సాగునీటి సౌకర్యాల కల్పనకు బిందు సేద్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు.
రైతుల కోసం కొత్త నిర్ణయాలు అమలు
వ్యవసాయ రంగం వృద్ధి రేటు 7.83 శాతం గా మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. PM కిసాన్ పథకం కింద రూ.6,309 కోట్లు చెల్లింపులు చేసినట్లు వెల్లడించారు. 2026-27లో రూ.6,600 కోట్లు PM కిసాన్ కోసం కేటాయించగా.. ఇప్పుడు కొంత మేర పెంచారు. రాష్ట్ర ఆర్థిక రంగానికి మూల స్తంభంగా వ్యవసాయం నిలిచిందన్నారు. దేశ వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ వాటా 10 శాతం గా చెప్పారు. 11 వ్యవసాయ పంటలను గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించామని.. 24 గంటల్లో 9వేల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేసామని వివరించారు. వ్యవసాయం లాభసాటిగా మారితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటేనే రాష్ట్రం ఆర్థికంగా సుభిక్షం సాధ్యం అవుతుందని చెప్పారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, అగ్రి టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా వ్యవసాయ రంగాన్ని గుర్తించామన్నారు. వ్యవసాయ రంగం వృద్ధి రేటు 7.83 శాతం సాధించిందని తెలిపారు. పంటలను కాపాడేందుకు రైతులకు అన్ని విధాలుగా సాయం అందిస్తామని తెలిపారు. 80 శాతం రాయితీతో రూ.90.4 కోట్లతో.. 1,130 డ్రోన్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. గతేడాది రూ.182 కోట్ల రాయితీతో విత్తనాల సరఫరా చేశామని మంత్రి పేర్కొన్నారు.
-
ఆ మూడు ప్రధాన హామీల అమలు ఊసే లేని బడ్జెట్..!!
-
ఉచిత బస్సు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పై బడ్జెట్ లో కీలక ప్రకటన..!!
-
బడ్జెట్ లో మహిళలకు నెలకు రూ 1500 పథకం, ఉద్యోగులకు పీఆర్సీ ..!?
-
AP Budget 2026: సంపద సృష్టికి కీలక ప్రకటన-చంద్రబాబు కలల ప్రాజెక్ట్..!
-
ఏపీ బడ్జెట్, మరో కీలక హామీ అమలు – రూ 3.50 లక్షల కోట్ల అంచనా..!!
-
AP Budget 2026-27 : రూ.3,32,205 కోట్లతో ఏపీ బడ్జెట్
-
ఏపీ బడ్జెట్ 2026-27 లో ఉద్యోగులకు దక్కిందేంటి..!!
-
AP Budget 2026: బడ్డెట్ స్పీచ్ లో పయ్యావుల అనూహ్యం-ఇదే తొలిసారి..!
-
బడ్జెట్ లో పవన్, లోకేష్ శాఖలకు కేటాయింపులు ఎంతంటే..!!
-
రూ 3.32 లక్షల కోట్ల బడ్జెట్, కొత్త వరాలు – కేటాయింపులు..!!
-
ఆ భూములు..ఇళ్లు మీవే, ప్రభుత్వం బంపరాఫర్ – ఇలా చేయండి..!!
-
స్త్రీ శక్తి పథం వేళ APSRTC పై చంద్రబాబు మార్క్ నిర్ణయం..!!
-
PM Kisan:పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ నిధుల జమ ముహూర్తం..!!
-
ఆ ఎమ్మెల్యేలకు తేల్చి చెప్పిన చంద్రబాబు, నియోజకవర్గాల్లో ఇక..!!
-
మున్సిపల్ పోరులో ‘హస్తం’ హవా.. బేజారైన విపక్షాలు!


