Telangana
oi-Bomma Shivakumar
తెలంగాణలో
వీధి
కుక్కలపై
దాష్టీకం
కొనసాగుతూనే
ఉంది.
ఇటీవల
కామారెడ్డి,
హనుమకొండ
జిల్లాల్లో
దాదాపు
600లకు
పైగా
వీధి
కుక్కలకు
విషం
పెట్టి
చంపేసినట్లు
వార్తలు
వచ్చిన
విషయం
తెలిసిందే.
అయితే
తాజాగా
హైదరాబాద్
సమీపంలో
మరో
షాకింగ్
ఘటన
జరిగింది.
యాచారం
గ్రామంలో
దాదాపు
100
కుక్కలకు
విషం
ఇచ్చి
చంపినట్లు
సమాచారం.
ఈ
ఘటనకు
సంబంధించి
సర్పంచ్,
మరో
ఇద్దరిపై
కేసు
నమోదు
చేశారు
పోలీసులు.
తెలంగాణలో
వీధి
కుక్కలను
చంపుతున్న
ఘటనలు
వరుసగా
నమోదవుతున్నాయి.
ఇప్పటికే
ఈ
విషయంపై
పెద్ద
ఎత్తున
చర్చ
నడుస్తున్న
విషయం
తెలిసిందే.
అయితే
తాజాగా
మరో
విషయం
వెలుగులోకి
వచ్చింది.
స్ట్రే
యానిమల్
ఫౌండేషన్
ఆఫ్
ఇండియాకు
చెందిన
ఓ
జంతు
సంక్షేమ
కార్యకర్త
యాచారం
పోలీస్
స్టేషన్
లో
దాఖలు
చేసిన
ఫిర్యాదులో..
జనవరి
19
న
కుక్కలకు
కొన్ని
విషపూరిత
పదార్థాలను
ఇంజెక్ట్
చేశారని
ఫిర్యాదులో
పేర్కొన్నారు.
దాదాపు
100
కుక్కలను
హత్య
చేశారని
వివరించారు.
ఈ
మేరకు
ఇదే
ఘటనపై
యాచారం
గ్రామ
సర్పంచ్,
కార్యదర్శి,
ఓ
వార్డు
మెంబర్
పై
జంతువులపై
క్రూరత్వ
నివారణ
చట్టంలోని
సంబంధిత
సెక్షన్ల
కింద
కేసు
నమోదు
చేసినట్లు
పోలీసులు
తెలిపారు.
ఇదే
విషయంపై
తదుపరి
విచారణ
కొనసాగుతోందని
స్పష్టం
చేశారు.
అలాగే
వీధి
శునకాల
కళేబరాలను
కనుక్కోవడానికి
దర్యాప్తు
జరుగుతుందని
అన్నారు.
మరోవైపు
ఇటీవల
కామారెడ్డి
జిల్లా
మాచారెడ్డి
పోలీస్
స్టేషన్
పరిధిలోని
పలు
గ్రామాల్లో
వీధి
కుక్కలను
చంపిన
ఘటన
తీవ్ర
కలకలం
రేపిన
విషయం
తెలిసిందే.
పాల్వంచ
మండల
కేంద్రంతో
పాటు
ఫరీద్
పేట్,
బండరామేశ్వర్
పల్లి,
భవానీపేట,
వాడి
తదితర
గ్రామాల్లో
600
లకు
పైగా
వీధి
కుక్కలను
చంపేశారు.
ఇక
ఇంజెక్షన్లు,
గుళికలు
ఇవ్వడంతోనే
కుక్కలు
మృతి
చెందినట్లు
తెలుస్తోంది.
జంతు
హక్కుల
కార్యకర్తలు
ఇచ్చిన
ఫిర్యాదుతో
ఈ
మేరకు
ఐదుగురు
సర్పంచులపై
కేసు
నమోదు
చేసినట్లు
పోలీసులు
తెలిపారు.


