International
oi-Jakki Mahesh
ప్రపంచంలో
రోజురోజుకు
పెరుగుతున్న
ఆర్థిక
అసమానతలను
‘వరల్డ్
ఇన్ఈక్వాలిటీ
రిపోర్ట్
2026′(World
Inequality
Report
2026)
ఆందోళనకరంగా
వెల్లడించింది.
ప్రపంచంలోని
అత్యధిక
సంపద
కేవలం
కొద్దిమంది
ధనవంతుల
చేతుల్లోనే
కేంద్రీకృతమై
ఉందని
ఈ
నివేదిక
స్పష్టం
చేసింది.
నివేదిక
ప్రకారం..
ప్రపంచ
జనాభాలో
కేవలం
0.001
శాతం
మందిగా
ఉన్న
సూపర్
రిచ్
వ్యక్తుల
వద్ద
ఉన్న
సంపద,
ప్రపంచంలోని
400
కోట్ల
మంది
వద్ద
ఉన్న
సంపద
కంటే
మూడు
రెట్లు
అధికంగా
ఉంది.
ప్రపంచ
జనాభాలో
0.001
శాతం
అంటే
దాదాపు
56,000
మంది
వ్యక్తులు.
అంటే
56
వేల
మంది
వద్దే
ప్రపంచ
సంపద
ఉన్నట్లు
తెలుస్తోంది.
ఈ
56
వేల
మంది
వద్ద
ఉన్న
సంపద
ప్రపంచంలోని
400
కోట్ల
(4
బిలియన్)
మంది
పేద
ప్రజల
వద్ద
ఉన్న
సంపద
కంటే
మూడు
రెట్లు
ఎక్కువ.
ఈ
గణాంకాలు
ధన,
ఆదాయ
అసమానతలు
పెరగడం
మాత్రమే
కాకుండా..
ఇది
ప్రపంచ
ఆర్థిక
వ్యవస్థకు,
ప్రజాస్వామ్యానికి
కూడా
పెను
ముప్పుగా
మారుతోందని
నివేదిక
హెచ్చరించింది.
ప్రపంచంలోని
ప్రతి
ప్రాంతంలో
అగ్రస్థానంలో
ఉన్న
1
శాతం
మంది
వద్ద,
దిగువన
ఉన్న
90
శాతం
మంది
వద్ద
ఉన్న
మొత్తం
సంపద
కంటే
ఎక్కువ
ఆస్తి
ఉంది.
అతి
వేగంగా
పెరుగుతున్న
సంపద
1990
నుంచి
బిలియనీర్లు,
మిలియనీర్ల
సంపద
ప్రతి
సంవత్సరం
దాదాపు
8
శాతం
చొప్పున
పెరిగింది.
ఇదే
సమయంలో
జనాభాలో
దిగువ
సగం
మంది
సంపద
వృద్ధి
రేటు
దీనిలో
సగం
కంటే
తక్కువగా
ఉంది
(సుమారు
4శాతం).
వాతావరణ
మార్పులకు
కారణం
కూడా
వారే!
ఈ
అసమానత
వాతావరణ
మార్పులపై
కూడా
ప్రభావం
చూపుతోందని
నివేదిక
పేర్కొంది.
ప్రపంచంలోని
అత్యంత
ధనవంతులైన
10
శాతం
మంది
ప్రపంచంలోని
77
శాతం
కార్బన్
ఉద్గారాలకు
బాధ్యత
వహిస్తున్నారు.
అత్యంత
పేదవారిలో
50
శాతం
మంది
కేవలం
3
శాతం
ఉద్గారాలకు
మాత్రమే
బాధ్యత
వహిస్తున్నారు.
నివేదిక
సిఫార్సులు
అసమానతలను
తగ్గించడానికి
నివేదిక
ఈ
క్రింది
సంస్కరణలను
సిఫార్సు
చేసింది.
ప్రగతిశీల
పన్ను
విధానం:
ప్రగతిశీల
పన్ను
విధానం,
పన్ను
న్యాయాన్ని
అమలు
చేయడం.
గ్లోబల్
మినిమం
టాక్స్:
బిలియనీర్లపై
ప్రపంచ
కనిష్ట
పన్ను
విధించడం,
పన్ను
ఎగవేతను
నిరోధించడానికి
అంతర్జాతీయ
సహకారాన్ని
పెంచడం.
ప్రజా
సేవల్లో
పెట్టుబడి:
అధిక-నాణ్యత
గల
ఉచిత
విద్య,
ఆరోగ్యం,
పోషకాహారం,
శిశు
సంరక్షణ
సేవల్లో
పెట్టుబడి
పెట్టడం.
నగదు
బదిలీ:
పింఛన్లు,
నిరుద్యోగ
భత్యాలు,
నగదు
బదిలీ
కార్యక్రమాల
ద్వారా
పేదలకు
వనరులను
తిరిగి
పంపిణీ
చేయడం.
ఈ
నివేదిక
నవంబర్‌లో
G20
దక్షిణాఫ్రికా
ప్రెసిడెన్సీ
సందర్భంగా
విడుదల
చేయబడింది.
ప్రపంచ
అసమానతల
పెరుగుదల,
బహుపాక్షికత
)
బలహీనపడటం
అనే
రెండు
ప్రధాన
సంక్షోభాలపై
ఇది
దృష్టి
సారించింది.


