Andhra Pradesh
oi-Sai Chaitanya
సంక్రాంతి
సంబరాలకు
గోదావరి
ది
ప్రత్యేక
స్థానం.
ఉభయ
గోదావరి
జిల్లాల్లో
పండుగ
కోసం
అనేక
ప్రాంతాల
నుంచి
పలువురు
ప్రముఖులు
తరలి
వస్తారు.
ఆంధ్ర
కేరళగా
ప్రసిద్ధి
చెందిన
కోనసీమ
లో
ఈ
సారి
సంక్రాంతికి
ప్రత్యేక
ఈవెంట్లు
సిద్దం
అవుతున్నాయి.
ఇప్పటికే
పెద్ద
సంఖ్యలో
ఇతర
ప్రాంతాల
నుంచి
సంక్రాంతికి
గోదావరి
జిల్లాలకు
చేరుకంటున్నారు.
కోడి
పందేల
కోసం
బరులు
సిద్ధమయ్యాయి.
ఇదే
సమయంలో
కేరళ
తరహాలో
ఈ
సారి
పడవ
పోటీలు
ప్రత్యేక
ఆకర్షణగా
నిలవబోతున్నాయి.
ఏపీ
ప్రభుత్వం
ఆధ్వర్యంలో
ఈ
సారి
స్పెషల్
ఈవెంట్స్
నిర్వహిస్తున్నారు.
సంక్రాంతి
అనగానే
రంగవల్లులు,
గొబ్బెమ్మలు,
హరిదాసులు,
గంగిరెద్దులు,
కోడిపందేలు
గుర్తొస్తాయి.
సంక్రాంతి
పండగ
వస్తోందంటే
గోదావరి
జిల్లాల్లో
మరీ
ముఖ్యంగా
కోనసీమలోని
పచ్చని
పల్లెలన్నీ
కొత్తశోభను
సంతరించుకుంటాయి.
కోడిపందేలు,
ప్రభలతీర్థాలు,
పిండివంటలు
ఎక్కడో
ఉన్నవారిని
సైతం
పండుగకు
ఆహ్వానిస్తాయి.
ఆత్రేయపురం,
ఎస్.యానాం,
పిఠాపురాల్లో
సంక్రాంతి
సంబరాల్ని
ఏపీ
ప్రభుత్వం
అట్టహాసంగా
నిర్వహిస్తోంది.
డ్రాగన్
పడవ
పోటీలు,
ఈత,
గాలిపటాల
పోటీలు,
మహిళలకు
రంగవల్లుల
పోటీలు,
కోనసీమ
సంప్రదాయ
పిండివంటలతో
ప్రత్యేక
ఫుడ్‌ఫెస్టివల్
నిర్వహిస్తోంది.
సంక్రాంతి
సంబరాలకు
ప్రభుత్వం
రూ.
కోటి
కేటాయించింది.
ఉత్సవాల్ని
తిలకించేందుకు
రోజూ
10
వేలకుపైగా
హాజరవుతారని
అంచనా.
ఈ
నెల
11న
ఆత్రేయపురం
రేవులోని
బొబ్బర్లంక
ప్రధాన
కాలువలో
ఈత
పోటీలు
నిర్వహిస్తున్నారు.
14
ఏళ్ల
వయసు
దాటినవారు
పోటీల్లో
పాల్గొనవచ్చు.
కాగా,
12,
13
తేదీల్లో
డ్రాగన్
పడవపోటీలు
జరుగుతాయి.
ఆత్రేయపురం
మెయిన్‌రోడ్డులో
ఈ
నెల
11న
మహిళలకు
రంగవల్లుల
పోటీలు
నిర్వహిస్తున్నారు.
13న
లంక
ప్రాంతాల్లో
గాలిపటాల
పోటీలు
జరుగుతాయి.
లొల్ల
లాకుల
వద్ద
బోటింగ్,
పిల్లల
కోసం
ప్రత్యేక
ప్లే
ఏరియా
ఏర్పాటు
చేస్తున్నారు.
కాలువల్లో
విహరించేందుకు
రెండు
స్పీడ్
బోట్‌లు,
ఒక
జెట్‌స్కీ
అందుబాటులో
ఉంటాయి.
ఆత్రేయపురం
పూతరేకులు,
కండ్రిగ
పాలకోవా,
నగరం
గరాజీలు,
నార్కెడుమిల్లి
పచ్చళ్లు
ఇలా
వాటన్నిటినీ
ఒకేచోట
అందుబాటులో
ఉంచుతూ
లొల్ల
లాకుల
వద్ద
ఫుడ్
ఫెస్టివల్
నిర్వహిస్తున్నారు.
సాయంత్రాలు
ప్రముఖ
గాయకుల
సినీ
సంగీత
విభావరి
ఏర్పాటు
చేసారు.
కోనసీమ
జిల్లా
ఉప్పల
గుప్తం
మండలం
ఎస్.యానాంలోనూ
రాష్ట్ర
ప్రభుత్వం
ఈ
నెల
14,
15,
16
తేదీల్లో
సంక్రాంతి
సంబరాలు
నిర్వహిస్తోంది.
బీచ్
ఫెస్టివల్
నిర్వహిస్తారు.
రోజూ
సినీ
గాయకుల
సంగీత
విభావరి,
సాంస్కృతిక
కార్యక్రమాలు
ఉంటాయి.


