Telangana
oi-Dr Veena Srinivas
సంక్రాంతి
పండుగ
తెలుగు
వారందరూ
అత్యంత
ఇష్టంగా
జరుపుకునే
పెద్ద
పండుగ.
అటువంటి
సంక్రాంతి
పండుగ
సమీపిస్తుండగా,
తెలుగు
రాష్ట్రాల్లో
మాంసం
ధరలు
ఒక్కసారిగా
కొండెక్కి
కూర్చున్నాయి.
సంక్రాంతి
పండుగకు
దూరప్రాంతాలలో
ఉపాధి
కోసం,
ఉద్యోగాల
కోసం
వెళ్లిన
వాళ్లంతా
సొంత
ఊర్లకు
చేరుకోవడంతో
చిన్న
పిల్లలకు
రకరకాల
పిండివంటలతో
పాటు
నాన్వెజ్
వంటకాలను
రుచి
చూపిస్తుంటారు
పెద్దలు.
ఆకాశాన్నంటిన
నాటుకోడి
ధరలు
ఈ
క్రమంలోనే
సంక్రాంతికి
మాంసం
వినియోగం
ఎక్కువగా
ఉంటుందని,
డిమాండ్
ఎక్కువగా
ఉంటున్న
నేపథ్యంలో
మాంసం
ధరలు
కొండెక్కి
కూర్చున్నాయి.
ముఖ్యంగా
సంక్రాంతి
పండుగకు
నాటుకోడి
మాంసానికి
భారీ
డిమాండ్
ఏర్పడింది.
పండుగ
సంప్రదాయంగా
నాటుకోడి
వండుకోవడం
చాలా
కాలంగా
వస్తున్న
కారణంగా,
దీని
ధరలు
ఆకాశాన్నంటాయి.
సామాన్యులకు
భారంగా
నాటు
కోళ్ళ
ధరలు
ఈ
ఏడాది
ముఖ్యంగా
నాటుకోడి
ఉత్పత్తి
తక్కువ
కావడం,
పెంపకం
దారులు
కూడా
నాటు
కోళ్లను
తక్కువగా
పెంచడంతో
నాటు
కోళ్ల
ధరలు
సామాన్యులకు
భారంగా
మారాయి.
ముఖ్యంగా
భద్రాద్రి
కొత్తగూడెం,
ఖమ్మం,
వరంగల్,
ఉమ్మడి
గోదావరి
జిల్లాలలో
నాటు
కోళ్లు
రికార్డు
ధరలు
నమోదయ్యాయి.
త్వరలో
తెలంగాణలో
మేడారం
సమ్మక్క
సారలమ్మ
జాతర
జరగనున్న
నేపథ్యంలో
కూడా
నాటు
కోళ్ల
ధరలు
కొండెక్కి
కూర్చున్నాయి.
2000
రూపాయల
నుండి
2500
రూపాయల
వరకు
ధర
ప్రస్తుతం
పందెం
పుంజులు,
మేలు
రకం
నాటు
కోళ్ల
ధర
2000
రూపాయల
నుండి
2500
రూపాయల
వరకు
ధర
పలుకుతోంది.
ఒకపక్క
పందెం
కోళ్ళు
లక్షల
రూపాయల
ధరలతో
కొనుగోలు
చేసి
పందానికి
దించుతున్నారు.
మరోవైపు
నాటు
కోళ్ల
గిరాకీ
ఎక్కువగా
ఉండటంతో
ధరను
అమాంతం
పెంచేశారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో
ఈ
పండుగకు
నాటు
కోళ్ల
ధరలు
ఆకాశాన్ని
తాకుతున్నాయి
అని
చెప్పొచ్చు.
పెరిగిన
బాయిలర్
కోడి,
మటన్
ధరలు
హైదరాబాద్
వంటి
నగరాలలో
ప్రస్తుతం
వెయ్యి
రూపాయల
వరకు
నాటుకోడి
కిలో
ధర
ఉంది.
ఇక
మరోవైపు
బ్రాయిలర్
కోళ్ల
ధరలు
కూడా
కొద్దిగా
పెరుగుతున్నట్టు
తెలుస్తోంది.
ఇదే
సమయంలో
మటన్
ధర
కూడా
900
రూపాయల
వరకు
పలుకుతోంది.ఏది
ఏమైనా
సంక్రాంతి
పండుగ
పేద,
మధ్యతరగతి
ప్రజలకు
షాక్
ఇస్తుంది.


