Andhra Pradesh
oi-Lingareddy Gajjala
సంక్రాంతి
పండుగ
వేళ
కాకినాడ
జిల్లాలో
తీవ్ర
విషాదం
చోటుచేసుకుంది.
జిల్లా
పరిధిలోని
మన్యం
గ్రామ
పంచాయతీకి
చెందిన
సార్లంకపల్లె
గ్రామంలో
ఘోర
అగ్నిప్రమాదం
సంభవించి
38
ఇళ్లు
పూర్తిగా
కాలి
బూడిదయ్యాయి.
ఈ
ఘటనతో
గ్రామమంతా
విషాదఛాయలు
అలుముకున్నాయి.
పండుగ
ఏర్పాట్ల
కోసం
గ్రామస్థులు
సమీపంలోని
తుని
పట్టణానికి
సరుకులు
కొనుగోలు
చేయడానికి
వెళ్లిన
సమయంలో
ఈ
ప్రమాదం
జరిగింది.
తిరిగి
గ్రామానికి
వచ్చేసరికి
తమ
ఇళ్లు
పూర్తిగా
అగ్నికి
ఆహుతైన
దృశ్యం
చూసి
గ్రామస్థులు
కన్నీటి
పర్యంతమయ్యారు.
38
పూరిళ్లు
అగ్నికి
ఆహుతయ్యాయి.
3
పక్కా
ఇళ్లు
మినహా
గ్రామంలోని
అన్ని
పూరి
గుడిసెలన్ని
బుగ్గి
కావడంతో
120
మందికి
పైగా
నిరాశ్రయులు
అయ్యారు.
గ్యాస్
లీక్..
ప్రాథమిక
సమాచారం
ప్రకారం,
ఇళ్లలోని
గ్యాస్
లీక్
కారణంగా
మంటలు
చెలరేగినట్లు
పోలీసులు
అనుమానిస్తున్నారు.
గాలి
వేగంగా
వీస్తుండటంతో
మంటలు
క్షణాల్లోనే
గ్రామమంతా
వ్యాపించి
ఇళ్లను
దహనం
చేసినట్లు
అధికారులు
తెలిపారు.
అగ్నిప్రమాదం
సమాచారం
అందుకున్న
వెంటనే
ఫైర్
సిబ్బంది
తుని
నుంచి
బయలుదేరినా,
అక్కడి
నుంచి
గ్రామానికి
సుమారు
50
కిలోమీటర్ల
దూరం
ఉండటంతో
ఫైర్
ఇంజిన్
చేరేసరికి
అప్పటికే
భారీ
నష్టం
జరిగిపోయింది.
మంటలను
అదుపులోకి
తీసుకురావడానికి
గ్రామస్థులు,
స్థానికులు
తీవ్రంగా
శ్రమించాల్సి
వచ్చింది.
ఈ
ఘటనలో
ఎలాంటి
ప్రాణనష్టం
జరగకపోవడం
కొంత
ఊరటనిచ్చినా,
పండుగకు
సిద్ధంగా
ఉన్న
ఇళ్లన్నీ
కాలిపోవడంతో
బాధిత
కుటుంబాలు
తీవ్ర
ఆవేదన
వ్యక్తం
చేస్తున్నాయి.
ఇంట్లో
ఉన్న
వస్తువులు,
బట్టలు,
పండుగ
సరుకులు
పూర్తిగా
నష్టపోయాయని
గ్రామస్థులు
వాపోతున్నారు.
సమాచారం
అందుకున్న
రెవెన్యూ,
పోలీస్
అధికారులు
ఘటనాస్థలాన్ని
పరిశీలించారు.
బాధిత
కుటుంబాలకు
తక్షణ
సహాయం
అందించే
చర్యలు
తీసుకుంటామని
అధికారులు
హామీ
ఇచ్చారు.
అగ్నిప్రమాదానికి
గల
ఖచ్చితమైన
కారణాలపై
విచారణ
కొనసాగుతోందని
పోలీసులు
తెలిపారు.
కుటుంబానికి
రూ.25
వేలు..
కొత్త
ఇల్లు
మంజూరు
కాకినాడ
జిల్లా
సార్లంకపల్లెలో
అగ్నిప్రమాదంపై
మంత్రులు,
అధికారులతో
ముఖ్యమంత్రి
చంద్రబాబు
సమీక్ష
నిర్వహించారు.
సంక్రాంతి
పండుగ
సమయంలో
సార్లంకపల్లెలో
అగ్ని
ప్రమాదం
పెను
విషాదం
తెచ్చిందన్న
సిఎం..
ఊరిలో
ఉన్న
మొత్తం
38
తాటాకు
ఇళ్లు
కాలిపోయిన
ఘటనలో
బాధితులకు
అన్ని
విధాలుగా
సహాయం
చేయాలని
ఆదేశించారు.
ప్రస్తుతం
బాధిత
కుటుంబాలకు
అందిస్తున్న
సాయాన్ని
హోం
మంత్రి
అనిత,
ఇతర
అధికారులు
సీఎంకు
వివరించారు.
బాధితులు
ఇబ్బంది
పడకుండా
వసతి,
ఆహారం
అందించి
వారికి
అండగా
నిలవాలి
సూచించారు..
తక్షణ
సాయంగా
ఒక్కో
బాధిత
కుటుంబానికి
రూ.25
వేలు
నేడు
అందిస్తామని
అధికారులు
భోరోసా
ఇచ్చారు.
ఇల్లు
కోల్పోయిన
ప్రతి
బాధిత
కుటుంబానికి
కొత్త
ఇల్లు
మంజూరు
చేయాలని
సీఎం
ఆదేశించారు.
కొత్త
ఇల్లు
నిర్మించి
ఇచ్చే
వరకు
వారికి
అవసరమైన
వసతి,
ఇతర
సహాయం
అందించాలన్నారు.
ప్రమాదంలో
కాలిపోయిన
డాక్యుమెంట్లు,
ఆధార్
కార్డులు
ఇచ్చేందుకు
ప్రత్యేక
క్యాంపులు
నిర్వహించాలన్నారు.
బాధితులకు
అందే
సహాయాన్ని
జిల్లా
ఉన్నతాధికారులు,
మంత్రులు
పర్యవేక్షించాలని
సీఎం
ఆర్డర్
వేశారు.
బాధిత
కుటుంబానికి
రూ.
1
లక్ష
అగ్ని
ప్రమాదంపై
మాజీ
ముఖ్యమంత్రి
వైయస్
జగన్
దిగ్భ్రాంతి
వ్యక్తం
చేశారు.
“మన్యంలో
మారుమూలన
ఉండే
ఈ
తండాలోని
38
పూరిళ్ళు
పూర్తిగా
కాలిపోయాయి.
120
మంది
గ్రామస్ధులు
కట్టుబట్టలతో
మిగిలారు.
మంటలు
దావానలంలా
వ్యాపించి
క్షణాల్లో
ఊరంతా
భస్మీపటలం
అవడం
తీవ్ర
విచారకరం.
బాధితులు
ఇబ్బంది
పడకుండా
వసతి,
ఆహారం
అందించి
వారికి
ప్రభుత్వం
అండగా
నిలవాలి,
తక్షణ
సాయంగా
ఒక్కో
బాధిత
కుటుంబానికి
రూ
1
లక్ష
అందజేయాలి.
ఇల్లు
కోల్పోయిన
ప్రతి
బాధిత
కుటుంబానికి
కొత్త
ఇల్లు
మంజూరు
చేయాలి,
కొత్త
ఇల్లు
నిర్మించి
ఇచ్చే
వరకు
వారికి
అవసరమైన
వసతి,
ఇతర
సహాయం
అందించాలి”
ప్రభుత్వాన్ని
డిమాండ్
చేశారు.
బిగ్
బ్రేకింగ్కాకినాడ
జిల్లాలో
దారుణ
ఘటనరౌతులపూడి
మండలం
సార్లంకలో
భారీ
అగ్నిప్రమాదంషాట్
సర్క్యూట్
కారణంగా
40
పూరిళ్లు
దగ్ధంనిరాశ్రయులైన
50
కుటుంబాలుమంటల్ని
అదుపు
చేసిన
అగ్నిమాపక
సిబ్బంది
pic.twitter.com/vqrzKIsK7N—
Telugu
Feed
(@Telugufeedsite)
January
13,
2026


