Telangana
oi-Dr Veena Srinivas
సంక్రాంతి
పండుగను
ప్రపంచ
స్థాయిలో
ఘనంగా
జరుపుకునేందుకు
తెలంగాణ
ప్రభుత్వం
సిద్ధమైంది.
తెలంగాణ
టూరిజం
ఆధ్వర్యంలో
జనవరి
2026లో
మూడు
అంతర్జాతీయ
స్థాయి
మహోత్సవాలు
నిర్వహించనుంది.
రంగులు,
రుచులు,
సంప్రదాయాలు,
ఆధునిక
సాంకేతికతతో
ఈ
వేడుకలు
తెలంగాణకు
ప్రపంచవ్యాప్తంగా
గుర్తింపు
తెచ్చేలా
భారీగా
ప్లాన్
చేసింది.
అంతర్జాతీయ
కైట్స్
మరియు
స్వీట్స్
ఫెస్టివల్
2026
సంక్రాంతి
పండుగకు
అంతర్జాతీయ
కైట్స్
మరియు
స్వీట్స్
ఫెస్టివల్
2026ను
నిర్వహిస్తోంది.
మకరసంక్రాంతి
సందర్భంగా
జనవరి
13వతేదీ
నుంచి
15వతేదీ
వరకు
సికింద్రాబాద్
పెరేడ్
గ్రౌండ్స్
లో
ఈ
ఫెస్టివల్
జరగనుంది.
ఈ
వేడుకలో
19దేశాల
నుంచి
కైట్స్
కళాకారులు
పాల్గొననున్నారు.
ఇండోనేషియా,
ఆస్ట్రేలియా,
కెనడా,
శ్రీలంక,
జపాన్,
ఫ్రాన్స్,
ఇటలీ,
స్విట్జర్లాండ్,
రష్యా,
ఉక్రెయిన్
వంటి
దేశాల
ప్రతినిధులు
ఈ
కైట్స్
ఫెస్టివల్లో
ప్రత్యేక
ఆకర్షణగా
నిలువనున్నారు.
కైట్స్
ఫెస్టివల్
ప్రత్యేకతలు
ఇవే
40
మంది
అంతర్జాతీయ,
55
మంది
జాతీయ
కైట్స్
కళాకారులు
పాల్గొనడం,
భారతదేశంలోని
15
రాష్ట్రాల
నుంచి
కైట్స్
బృందాలు
పాల్గొనడం,
మూడు
రోజులపాటు
ప్రత్యేక
నైట్
కైట్
ఫ్లయింగ్
నిర్వహించడం,
తెలంగాణ
సంస్కృతిని
ప్రతిబింబించేలా
సాంస్కృతిక
కార్యక్రమాలను
నిర్వహించడం
ఈ
ఫెస్టివల్
ప్రత్యేకత.
ఈ
ఫెస్టివల్
లో
వందకు
పైగా
హ్యాండ్లూమ్,
మరియు
హస్తకళల
స్టాల్స్
ఏర్పాటు
చేస్తున్నారు.
అంతర్జాతీయ
స్వీట్స్
ఫెస్టివల్
ఈ
స్వీట్స్
ఫెస్టివల్లో
1200
కు
పైగా
రకాల
స్వీట్లు
సందర్శకులను
ఆకట్టుకోనున్నాయి.
భారతదేశ
నలుమూలల
నుంచి
విదేశాలలో
నివసిస్తున్న
హైదరాబాదీ
కుటుంబాలు
తయారుచేసిన
ఈ
స్వీట్లు
ఈ
వేడుకలో
ప్రత్యేక
ఆకర్షణగా
నిలవనున్నాయి.60
ఫుడ్
కోర్టులు
తెలంగాణ
వంటకాలు
నుంచి
అంతర్జాతీయ
రుచుల
వరకు
అందరికీ
ఇష్టమైన
ఫుడ్స్
ను
రుచి
చూపించనున్నాయి.
హాట్
ఎయిర్
బెలూన్
ఫెస్టివల్
2026
16వ
తేదీ
నుంచి
జనవరి
18వ
తేదీ
వరకు
ఈ
ఫెస్టివల్
ను
నిర్వహించనున్నారు.
యూరప్
నుండి
వచ్చిన
15
అంతర్జాతీయ
ప్రమాణాల
హాట్
ఎయిర్
బెలూన్
లు
ఆకాశంలో
విహరించ
నున్నాయి.
ఉదయం
వేళ
హైదరాబాద్
పరిసర
ప్రాంతాలలో
బెలూన్
రైడ్స్,
సాయంత్రం
పెరేడ్
గ్రౌండ్స్
లో
అద్భుతమైన
నైట్
గ్లో
బెలూన్
షో
వీటిని
చూడడానికి
వచ్చిన
కుటుంబాలకు
పర్యాటకులకు
మరిచిపోలేని
తీపి
అనుభూతిని
మిగల్చనున్నాయి.
డ్రోన్
షో
2026
జనవరి
16,
17
తేదీలలో
గచ్చిబౌలి
స్టేడియంలో
భారతదేశ
వారసత్వం
నుంచి
అధునాతన
సాంకేతికత
వరకు
చేసిన
ప్రయాణాన్ని
చూపించేలా
ఈ
డ్రోన్
షో
రూపొందించబడింది.
మల్టీకలర్
ఎల్ఈడి
లైట్లతో
హైటెక్
డ్రోన్లు,
భారీ
స్క్రీన్
లపై
ఎఫ్
పీవీ
డ్రోన్
రేసింగ్,
డ్రోన్
సాకర్
మరియు
అద్భుతమైన
గగన
విన్యాసాలు,
డ్రోన్ల
ద్వారా
ప్రదర్శించబడే
తెలంగాణ
పర్యాటక
ప్రాంతాలు
ఈ
డ్రోన్
షో
ప్రత్యేకతలు.
ఇది
కేవలం
పండుగ
కాదు,
ఇది
అద్భుతమైన
అనుభవం
సంక్రాంతిని
సాంప్రదాయాల
సాంకేతిక
మేళవింపుగా
అత్యద్భుతంగా
జరుపుకునేందుకు
తెలంగాణ
ప్రపంచాన్ని
ఆహ్వానిస్తోంది.
TELANGANA
FESTIVE
EXTRAVAGANZA
2026
–
ఇది
కేవలం
పండుగ
కాదు,
ఇది
ఒక
అద్భుతమైన
అనుభవం
అని
చెబుతోంది.


