Andhra Pradesh
oi-Sai Chaitanya
స్పీకర్
అయ్యన్న
పాత్రుడు
సంచలన
వ్యాఖ్యలు
చేసారు.
ఏపీ
అసెంబ్లీకి
వైసీపీ
ఎమ్మెల్యేలు
వరుస
గా
గైర్హాజరవుతున్నారు.
కొంత
మంది
ఎమ్మెల్యేలు
సభకు
రాకుండానే
సంతకం
చేసి
జీతం
తీసుకుంటున్నట్లు
గుర్తించారు.
తాజాగా
అసెంబ్లీ
ఎథిక్స్
కమిటీ
వీరి
విషయంలో
పూర్తి
వివరాలు
ఇవ్వాలని
ఆదేశించింది.
అదే
విధంగా
ఎమ్మెల్యేలు
జీతాలు
తీసుకుంటూ
అసెంబ్లీకి
రాకపోవటం
పైన
గతంలోనూ
స్పీకర్
ఆసక్తి
కర
వ్యాఖ్యలు
చేసారు.
ఇప్పుడు
స్పీకర్
ఇదే
అంశం
పైన
స్పందిస్తూ
సంచలన
ప్రతిపాదన
చేసారు.
ఏపీ
అసెంబ్లీ
బడ్జెట్
సమావేశాలకు
సమాయత్తం
అవుతున్న
వేళ
స్పీకర్
అయ్యన్న
పాత్రుడు
కీలక
వ్యాఖ్యలు
చేసారు.
లక్నోలో
జరుగుతున్న
అఖిల
భారత
సభాపతుల
సమావేశంలో
పాల్గొన్న
స్పీకర్
అయ్యన్న
పాత్రుడు’నో
వర్క్..
నో
పే’
అనే
విధానం
చట్టసభల్లోనూ
రావాలని
సూచించారు.
దానికి
అనుగుణంగా
చట్టం
చేయాలని..
దానికి
సభాపతుల
సదస్సులో
తీర్మానం
చేయాలనీ
ఆయన
ప్రతిపాదించారు.
ప్రభుత్వ
విభాగాల్లో
ఉద్యోగులు
విధులకు
హాజరు
కాకపోతే..
సంబంధిత
అధికారులు
క్రమశిక్షణా
చర్యలు
తీసుకోవడం
సహా
వారి
వేతనాలు
నిలిపి
వేస్తున్నారని
స్పీకర్
గుర్తు
చేసారు.
అయితే,
తాము
ఎన్నుకున్న
ఎమ్మెల్యేలు
సభకు
రానప్పుడు
ఎందుకు
చర్యలు
తీసుకోరని
ప్రజలు
ప్రశ్నిస్తున్నారని
అయ్యన్న
చెప్పుకొచ్చారు.
2024
ఎన్నికల
తర్వాత
అసెంబ్లీకి
ఒక్కరోజు
కూడా
రానివారు
ఉన్నారని..
కనీసం
సభలో
జరిగే
ప్రశ్నోత్తరాలు,
చర్చల్లోనూ
పాల్గొనడం
లేదని
ఏపీ
స్పీకర్
పేర్కొన్నారు.
ఈ
తరహా
వైఖరి
కారణంగా
తమను
ఎన్నుకున్న
ప్రజలకు
అన్యాయం
చేస్తున్నారని
స్పీకర్
పేర్కొన్నారు.
సభకు
హాజరు
కాకపోవడం
వలన
ప్రజల
దృష్టిలో
సభ్యులు
చులకనవుతున్నారని
చెప్పుకొచ్చారు.
సభకు
హాజరు
కాకుండానే
వారు
వేతనాలు
తీసుకుంటున్నారని
తెలిపారు.
ఈ
సమస్య
పరిష్కారంగా
నో
వర్క్..
నోపే
విధానం
పై
చట్టం
చేయాలని
కోరారు.
సభకు
రానివారిని
రీకాల్
చేసే
హక్కు
ప్రజలకు
కల్పించేలా
చట్టం
చేయాలని
ఏపీ
స్పీకర్
ప్రతిపాదించారు.
ఇటు
వైసీపీ
ఎమ్మెల్యేల్లో
జగన్
మాత్రమే
జీతం
తీసుకోవటం
లేదని..
కొందరు
ఎమ్మెల్యేలు
సభకు
హాజరవుతున్నట్లు
సంతకాలు
చేసి..
సమావేశాలకు
దూరంగా
ఉంటున్నారని
తాజాగా
ఎథిక్స్
కమిటీలో
చర్చ
జరిగింది.
ఆరుగురు
ఎమ్మెల్యేలు
ఇలా
తీసుకున్నట్లు
ప్రాధమికంగా
గుర్తించారు.
వీరి
వివరాలు
పూర్తి
స్థాయిలో
సేకరించిన
తరువాత
సభలో
చర్చించి..
ఎలాంటి
నిర్ణయంతో
ముందుకు
వెళ్లాలో
డిసైడ్
చేయాలని
నిర్ణయించారు.
కాగా,
ఇప్పుడు
అయ్యన్న
చేసిన
వ్యాఖ్యలు
ఆసక్తి
కరంగా
మారాయి.


