Entertainment
oi-Kannaiah
బుల్లితెరపై
భావోద్వేగ
పాత్రలకు
జీవం
పోసి
కుటుంబ
ప్రేక్షకులను
ఆకట్టుకున్న
ప్రముఖ
నటి
శ్రీవాణి,
తాజాగా
‘పెళ్లి’
మరియు
‘సహజీవనం’
వంటి
సున్నితమైన
అంశాలపై
తన
ఘాటైన
అభిప్రాయాలను
కుండబద్దలు
కొట్టారు.
జబర్దస్త్
వర్ష
హోస్ట్
చేస్తున్న
ఓ
టాక్
షోలో
ఆమె
చేసిన
వ్యాఖ్యలు
ప్రస్తుతం
సోషల్
మీడియాలో
హాట్
టాపిక్‌గా
మారాయి.
లివింగ్
రిలేషన్‌షిప్‌పై
నటి
‘సర్జికల్
అటాక్’
నేటి
యువతరం
అలవాటు
పడుతున్న
లివింగ్
రిలేషన్‌షిప్
విధానంపై
శ్రీవాణి
తీవ్రస్థాయిలో
మండిపడ్డారు.
సహజీవనం
అనేది
కేవలం
‘ఫిజికల్
అవసరాల’
కోసమే
కొనసాగుతుందని
..ఆ
బంధంలో
బాధ్యత
అనేది
శూన్యం
అని
ఆమె
విమర్శించారు.
“లివింగ్
రిలేషన్‌షిప్‌ను
సపోర్ట్
చేసే
వాళ్లకి
బుద్ధి
లేదు
అంటాను.
ఇద్దరూ
ఒకే
ఇంట్లో
ఉండి
కోరికలు
తీర్చుకుంటారు.
తర్వాత
బోర్
కొడితే
విడిపోతారు.
అప్పుడు
బాధ్యత
ఎవరిదీ?
ఒకసారి
అలవాటు
అయితే
పెళ్లి
చేసుకోవాల్సిన
అవసరమే
ఉండదు
కదా?”
అని
శ్రీవాణి
నేరుగా
ప్రశ్నించారు.భవిష్యత్తులో
పెళ్లి
చేసుకోవాలని
అనుకునేవారు,
అనవసరంగా
ఆలస్యం
చేయకుండా,
ఇప్పుడే
వివాహం
చేసుకుని
జీవిత
బాధ్యతలను
పంచుకోవాలని
ఆమె
స్పష్టం
చేశారు.
వివాహం
ఆలస్యంపై
హెచ్చరిక
నేటి
జనరేషన్‌లో
‘లైఫ్‌లో
సెట్
అయిన
తర్వాతే
పెళ్లి’
అనే
కొత్త
ఆలోచన
వచ్చిందని,
ఇది
ఎప్పుడూ
సరైన
ఫలితాన్ని
ఇవ్వదని
శ్రీవాణి
తేల్చి
చెప్పారు.జీవితంలో
ఏది
ఎప్పుడు
ఎలా
జరగాలో
అలానే
జరిగిపోవాలని
శ్రీవాణి
పేర్కొన్నారు.
తాను
లైఫ్‌లో
సెటిల్
కాకపోయినా..
పెళ్లి
చేసుకున్న
తర్వాత
జీవితాన్ని
హాయిగా
గడుపుతున్నట్లు
వెల్లడించారు.జీవితంలో
సెటిల్
అయిన
తర్వాత
పెళ్లి
చేసుకుంటే
అంతా
సక్రమంగా
లేదా
సాఫీగా
సాగుతుందనే
గ్యారెంటీ
కూడా
ఏం
లేదని
అన్నారు.
పెళ్లిని
ఆలస్యం
చేయడం
లేదా
సీరియస్‌గా
తీసుకోకవడం
అనేది
తర్వాతి
కాలంలో,
ముఖ్యంగా
పిల్లలు
పుట్టిన
తర్వాత,
కష్టాలను
తెచ్చి
పెడుతుందని
శ్రీవాణి
హెచ్చరించారు.
పిల్లల
భవిష్యత్తుపై
తల్లిదండ్రుల
మధ్య
ఉండే
గొడవలు
ప్రభావం
చూపకుండా
ఉండాలంటే,
పెళ్లి
చేసుకున్న
తర్వాత
కూడా
కనీసం
రెండేళ్లు
సమయం
తీసుకుని
పిల్లలను
ప్లాన్
చేసుకోవాలని
ఆమె
తన
అనుభవంతో
కూడిన
సలహా
ఇచ్చారు.బుల్లితెర
ప్రేక్షకుల్లో
బలమైన
స్థానం
ఉన్న
శ్రీవాణి
చేసిన
ఈ
వ్యాఖ్యలు,
సోషల్
మీడియాలో
‘ఆధునికత’
పేరుతో
వస్తున్న
మార్పులపై
పెద్ద
చర్చకు
తెరలేపాయి.కొంతమంది
నెటిజెన్లు
శ్రీవాణి
మాటల్లో
వందశాతం
నిజం
ఉందని
ఆమెకు
సపోర్ట్‌గా
నిలుస్తుండగా
మరికొందరు
ఆమె
వ్యాఖ్యలతో
విబేధిస్తున్నారు.
ఇదిలా
ఉంటే
శ్రీవాణికి
బుల్లితెరపై
మంచి
ఫ్యాన్
ఫాలోయింగ్
ఉంది.
ఇక
ఆమె
భర్త
విక్రమ్
కూడా
సీరియల్స్‌లో
నటిస్తుంటారు.
తాజాగా
శ్రీవాణి
కూతురు
రాజనందిని
ఓ
డాన్స్
రియాల్టీ
షోలో
పాల్గొని
మంచి
పేరు
తెచ్చుకుంది.
ఇలా
కుటుంబంలో
అంతా
బుల్లితెరకు
అంకితమై
ఫ్యామిలీ
ఆడియెన్స్
మనసుల్లో
నిలిచిపోయారు.


