International
oi-Jakki Mahesh
సాధారణంగా
గ్రామ
అభివృద్ధి
కోసం
కమిటీలు
కొన్ని
నిబంధనలు
పెడుతుంటాయి.
చైనాలోని
యునాన్
ప్రావిన్స్‌కు
చెందిన
ఓ
చిన్న
గ్రామం
వింతైన,
కఠినమైన
రూల్స్
పెట్టుకుని
వార్తల్లో
నిలిచింది.
చైనాలోని
లింకాంగ్
అనే
గ్రామంలో
ఏకంగా
ప్రజల
వ్యక్తిగత
జీవితాలపై
ఆంక్షలు
విధిస్తూ
నోటీసు
జారీ
చేసింది.
“గ్రామ
నియమాలు:
అందరూ
సమానమే”
పేరుతో
వెలువడిన
ఈ
నిబంధనల
జాబితా
నెటిజన్లను
విస్మయానికి
గురిచేస్తోంది.
జరిమానాల
చిట్టా
ఇదే..
సౌత్
చైనా
మార్నింగ్
పోస్ట్
నివేదిక
ప్రకారం,
ఈ
గ్రామంలో
ఎవరైనా
నిబంధనలు
అతిక్రమిస్తే
కింది
విధంగా
జరిమానాలు
చెల్లించాల్సి
ఉంటుంది.
*సహజీవనం:
పెళ్లి
చేసుకోకుండా
కలిసి
నివసించే
జంటలకు
ఏడాదికి
500
యువాన్లు
(సుమారు
రూ.
5,800)
జరిమానా.
*ముందస్తు
గర్భం:
వివాహానికి
ముందే
గర్భిణీ
అయితే
3,000
యువాన్లు
(సుమారు
రూ.
35,000)
చెల్లించాలి.
*తొందరగా
బిడ్డ
పుడితే:
పెళ్లయిన
10
నెలల
లోపే
బిడ్డ
పుడితే,
ఆ
తల్లిదండ్రులు
3,000
యువాన్ల
జరిమానా
కట్టాలి.
*ఇతర
రాష్ట్రం
వాళ్లను
పెళ్లి
చేసుకుంటే:
యునాన్
ప్రావిన్స్
కాకుండా
ఇతర
ప్రావిన్ల్
వాళ్లను
పెళ్లి
చేసుకుంటే
1,500
యువాన్ల
జరిమానా
కట్టాల్సి
ఉంటుంది.
*భార్యాభర్తలు
గొడవలు
పడితే:
భార్యాభర్తలు
గొడవపడి,
ఆ
సమస్య
పరిష్కారానికి
గ్రామ
అధికారులను
పిలిస్తే,
ఒక్కొక్కరు
500
యువాన్లు
చెల్లించాలి.
*వదంతులు
వ్యాపింపజేస్తే:
గ్రామంలో
పుకార్లు
పుట్టించినా
లేదా
తప్పుడు
ఆరోపణలు
చేసినా
500
నుండి
1,000
యువాన్ల
వరకు
జరిమానా
విధిస్తారు.
ప్రభుత్వం
స్పందన
ఈ
వింత
నిబంధనల
ఫోటోలు
సోషల్
మీడియాలో
వైరల్
కావడంతో
చైనా
ప్రభుత్వంపై
విమర్శలు
వెల్లువెత్తాయి.
దీనిపై
స్పందించిన
మెంగ్‌డింగ్
టౌన్
ప్రభుత్వం,
ఈ
నిబంధనలు
“చాలా
అసాధారణంగా”
ఉన్నాయని
అంగీకరించింది.
గ్రామ
కమిటీ
స్వయంగా
ఎవరి
అనుమతి
లేకుండా
ఈ
నోటీసును
అతికించిందని,
ప్రస్తుతం
దానిని
తొలగించామని
అధికారులు
వెల్లడించారు.


