Andhra Pradesh
oi-Sai Chaitanya
మాజీ
ఎంపీ
సాయి
రెడ్డి
పొలిటికల్
రీ
ఎంట్రీ
ఖాయం
అయింది.
తిరిగి
రాజకీయంగా
యాక్టివ్
కానున్నట్లు
తేల్చి
చెప్పారు.
కూటమి
కొనసాగితే
జగన్
కు
అధికారం
సాధ్యం
కాదన్నారు.
అదే
విధంగా
కోటరీని
నమ్ముకున్నంత
కాలం
జగన్
కు
అధికారం
దక్కదని
చెప్పారు.
అదే
సమయం
లో
చంద్రబాబు
ప్రభుత్వం
ను
టార్గెట్
చేసారు.
తాను
ఏ
రాజకీయ
పార్టీలో
చేరటం
లేదంటూనే…
ఒక
కీలక
సంకేతం
ఇచ్చారు.
దీంతో..
సాయిరెడ్డి
భవిష్యత్
ప్రణాళికల
పైన
క్లారిటీ
వస్తోంది.
మాజీ
ఎంపీ
విజయ
సాయిరెడ్డి
తన
కొత్త
రాజకీయ
ప్రస్థానం
పైన
కీలక
వ్యాఖ్యలు
చేసారు.
తాను
రాజకీయాలకు
స్వస్తి
చెప్పలేదని
స్పష్టం
చేసారు.
తిరిగి
యాక్టివ్
పాలిటిక్స్
లోకి
వస్తానని
తేల్చి
చెప్పారు.
అయితే,
ఏ
పార్టీలో
చేరనని
ట్విస్ట్
ఇచ్చారు.
అదే
సమయంలో
జగన్
తిరిగి
అధికారంలో
కి
రావాలంటే
కూటమి
కొనసాగితే
కష్టమని..
కూటమిని
దెబ్బ
తీసే
విధంగా
వ్యూహాలు…రాజకీయ
ఆలోచనలు
ఇచ్చే
ఆలోచనలు
జగన్
కోటరీకి
లేవని
వ్యాఖ్యానించారు.
కూటమి..
కోటరీ
కారణంగా
జగన్
కు
అధికారం
దక్కదంటూ
ఆసక్తి
కర
విశ్లేషణ
చేసారు.
దురదృష్టం
కొద్ది
జగన్
కూడా
కోటరీ
మాటలు
నమ్మారని
2020
నుంచి
తనని
సైడ్‌లైన్
చేశారని
విజయసాయిరెడ్డి
చప్పారు.
మద్యం
స్కామ్
అనేదాన్ని
తాను
నమ్మడం
లేదని
చెప్పుకొచ్చారు.
విశాఖలో
ఒక్క
అపార్ట్‌మెంట్
తప్ప
నాకేమీ
లేదని
అలానే
తనపై
దుష్ప్రచారం
చేసిన
వారికి
సరైన
బుద్ధి
చెబుతానన్నారు.
తాను
జగన్
కోసం
పాలేరులా
పని
చేసానని
సాయిరెడ్డి
చెప్పుకొచ్చారు.
అదే
సమయంలో
తన
కొత్త
రాజకీయ
ప్రస్థానం
పైన
కొత్త
సంకేతాలు
ఇచ్చారు.
తాను
జగన్
ను
విమర్శించలేదని..
జగనే
తన
పైన
ఆరోపణలు
చేసారని
గుర్తు
చేసారు.
తాను
ప్రలోభాలకు
లొంగాలనని
జగన్
చేసిన
వ్యాఖ్యలు
వెనక్కు
తీసుకోవాలని
సూచించారు.
అయితే..
సాయిరెడ్డి
వైసీపీని
వీడిన
సమయంలోనే
బీజేపీలో
చేరుతారనే
ప్రచారం
సాగింది.
ఆ
తరువాత
టీడీపీ
నుంచి
అభ్యంతరాల
మేరకు
ఆ
ప్రతిపాదన
నిలిచినట్లు
పొలిటికల్
సర్కిల్స్
లో
చర్చ
జరిగింది.
కాగా..
తిరిగి
పార్టీలోకి
సాయిరెడ్డిని
తీసుకొచ్చేందుకు
వైసీపీలోనూ
ప్రయత్నాలు
జరిగినట్లు
వార్తలు
వచ్చాయి.
ఇక..
సాయిరెడ్డి
జనసేనలో
చేరుతారని
మరి
కొందరు
భావించారు.
అయితే,
ఏపీలో
కూటమిలో
సాయిరెడ్డికి
ఛాన్స్
లేదని
చెబుతున్నారు.
దీంతో..
బీజేపీ
అధినాయకత్వంతో
సాయి
రెడ్డికి
ఉన్న
సత్సంబంధాలతో
కమలం
పార్టీకి
దగ్గరయ్యే
ఉందని
తెలుస్తోంది.
తాజాగ..
బీజేపీ
నుంచి
ఆహ్వానం
అందితే
పరిశీలిస్తానని
సాయిరెడ్డి
చెప్పటం
ద్వారా..
ఆయన
కొత్త
రాజకీయ
ప్రస్థానం..
వ్యూహాలు
ఏంటనేది
స్పష్టం
అవుతోంది.


