సిగరెట్లపై పెంచిన ట్యాక్సులు తగ్గించాలని కేంద్రమంత్రికి ఏపీ నుండి షాకింగ్ విజ్ఞప్తి

Date:


Andhra Pradesh

oi-Dr Veena Srinivas

పొగ
తాగటం
ఆరోగ్యానికి
హానికరం.
పొగతాగడం
వల్ల
క్యాన్సర్
బారిన
పడే
ప్రమాదం
ఉంటుంది
అని
పదేపదే
ఊదరగొడుతున్న
కేంద్ర
ప్రభుత్వం
సిగరెట్లపైన
అదనంగా
జీఎస్టీ
ని,
ఎక్సైజ్
డ్యూటీని
విధించి,
పొగ
తాగడాన్ని
తగ్గించడానికి
తనవంతుగా
ప్రయత్నం
చేసింది.
అయితే
తాజాగా
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రానికి
చెందిన
పలువురు
కేంద్రమంత్రి
నిర్మల
సీతారామన్
ను
కలిసి
సిగరెట్ల
పైన
పెంచిన
టాక్స్
లు
తగ్గించండి
అంటూ
ఊహించని
వినతిని
పెట్టారు.


సిగరెట్లపైన
ట్యాక్స్
లు

ఆరోగ్యాన్ని
పాడుచేసే
సిగరెట్ల
పైన
టాక్స్
లు
తగ్గించాలని,
ఏపీకి
చెందిన
వారు
కేంద్ర
మంత్రి
నిర్మల
సీతారామన్
ను
ఎందుకు
కలిశారు..
వారి
విజ్ఞప్తి
వెనుక
అసలు
కారణం
ఏంటి?
అంటే
కేంద్రం
డిసెంబర్
31వ
తేదీన
సిగరెట్ల
పై
జిఎస్టి
28
శాతం
నుంచి
40
శాతానికి
పెంచుతున్నట్టు
నోటిఫికేషన్
జారీ
చేసింది.

కొత్త
పన్ను
ఫిబ్రవరి
1వ
తేదీ
నుండి
అమలులోకి
వస్తుందని
పేర్కొంది.


కేంద్రమంత్రిని
కలిసిన
ఏపీ
పొగాకు
రైతులు


క్రమంలో
కేంద్రం
తీసుకున్న

నిర్ణయం
పొగాకు
రైతులు
ధరలు
పడిపోయే
ప్రమాదం
ఉందని
ఆందోళన
వ్యక్తం
చేస్తున్నారు.
ఇప్పటికే
fcv
పొగాకు
ధర
కిలోకు
60
నుండి
70
రూపాయలు
మేర
తగ్గిందని,
కేంద్ర
నిర్ణయంతో
భవిష్యత్తులో
పొగాకు
రైతులు
మరింత
కష్టాలను
ఎదుర్కోవాల్సి
వస్తుందని
భావించిన
వారంతా
కేంద్ర
మంత్రిని
కలిశారు.


నిర్మలా
సీతారామన్
కు
వినతి
పత్రం

ఆంధ్రప్రదేశ్
రాష్ట్రానికి
చెందిన
పొగాకు
రైతులు
సిగరెట్ల
పై
కేంద్రం
అదనంగా
విధించిన
జిఎస్టి,
ఎక్సైజ్
డ్యూటీని
తగ్గించాలని
కోరుతూ
బిజెపి
ఎంపీ
దగ్గుబాటి
పురందరేశ్వరి
తో
పాటు
వెళ్లి
కేంద్ర
ఆర్థిక
శాఖ
మంత్రి
నిర్మల
సీతారామన్
కలిసి
వినతిపత్రం
సమర్పించారు.

పన్నుల
పెంపు
తమ
పొగాకు
ఉత్పత్తుల
అమ్మకాల
పైన,
పరిశ్రమ
పైన
తీవ్రంగా
ప్రభావాన్ని
చూపిస్తున్నాయని
వారు
ఆందోళన
వ్యక్తం
చేశారు.


పన్నుల
పెంపుతో
తమ
నష్టాలపై
ఆవేదన

పన్నుల
పెంపు
వల్ల
పొగాకు
సాగు
చేసేవారు,
ఆధారపడిన
వేలాది
మంది
కుటుంబాల
జీవనోపాధి
దెబ్బతింటుందని
రైతులు
ఆర్థిక
శాఖ
మంత్రి
నిర్మల
సీతారామన్
కు
వివరించారు.
పన్నుల
పెరుగుదల
కారణంగా
తమవద్ద
ఉన్న
పొగాకు
నిల్వలను
ఎవరు
కొనడం
లేదని,
ప్రస్తుతం
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో
రైతుల
వద్ద
40
నుంచి
50
మిలియన్
టన్నుల
పొగాకు
నిలువ
ఉండగా,
మార్కెటింగ్
కష్టంగా
మారిందని
వారు
ఆవేదన
వ్యక్తం
చేశారు.


నిర్మలా
సీతారామన్
కు
ఎంపీ
పురందేశ్వరి
విజ్ఞప్తులు

ఆంధ్రప్రదేశ్,
కర్ణాటక
వంటి
అధిక
పొగాకు
సాగుచేస్తే
రాష్ట్రప్రభుత్వాలతో
పాటు,
పొగాకుబోర్డు,
ఇతర
భాగస్వామ్య
పక్షాలతో
కూడా
చర్చించి
కేంద్రం

విషయంలో
సరైన
నిర్ణయం
తీసుకోవాలని
వారు
ఆర్థికశాఖ
మంత్రికి
విజ్ఞప్తి
చేశారు.
ఎంపీ
దగ్గుబాటి
పురంధరేశ్వరి
కూడా
రైతులు
దేశీయ
పరిశ్రమలతోపాటు,
ఎగుమతులను
బలోపేతం
చేసే
దిశగా
పొగాకు
రంగానికి
దీర్ఘకాలిక
స్థిరత్వం
కల్పించే
దిశగా
చర్యలు
తీసుకోవాలని
తాను
నిర్మల
సీతారామన్
ను
కోరినట్లు
తెలిపారు.


సానుకూలంగా
స్పందించారన్న
బీజేపీ
ఎంపీ

దేశంలో
సులభ
వాణిజ్య
వాతావరణంలో
పెంపొందించడానికి
1.2
కోట్ల
వార్షిక
ఆదాయం
కలిగిన
స్టార్టప్
లకు
కూడా
పండు
మినహాయింపులు
ఇవ్వాలని
తాను
కోరినట్లు
బిజెపి
ఎంపీ
పురందేశ్వరి
తెలిపారు.
ఆర్థిక
శాఖ
మంత్రి
నిర్మల
సీతారామన్
పొగాకు
రైతులతో
పాటు,
తన
విజ్ఞప్తి
లకు
సానుకూలంగానే
స్పందించారని
ఆమె
వెల్లడించారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related