International
oi-Bomma Shivakumar
ఆస్ట్రేలియాలోని
బోండీ
బీచ్
లో
యూదులపై
జరిగిన
ఉగ్రదాడిలో
16
మంది
ప్రాణాలు
కోల్పోయారు.
పలువురు
తీవ్రంగా
గాయపడ్డారు.
అయితే
ఈ
దాడి
అనంతరం
అధికారులు
జరిపిన
దర్యాప్తులో
షాకింగ్
విషయాలు
వెలుగులోకి
వచ్చాయి.
ఈ
దాడికి
పాల్పడిన
ఆ
ఉగ్రవాదిని
సాజిద్
అక్రమ్
గా
అధికారులు
గుర్తించారు.
అయితే
నిందితుడు
సాజిద్
అక్రమ్
వద్ద
ఇండియా
పాస్
పోర్టు
లభ్యం
అయింది.
సాజిద్..
హైదరాబాద్
లో
పాస్
పోర్టు
పొందినట్లు
దర్యాప్తులో
అధికారులు
గుర్తించారు.
పహల్గామ్
ఉగ్రదాడి
అనంతరం
యావత్
ప్రపంచాన్ని
మరోసారి
ఉలిక్కిపడేలా
చేసిన
ఘటన
ఆస్ట్రేలియాలోని
పోండీ
బీచ్
మారణహోమం.
ఉగ్రమూకలు
జరిపిన
ఈ
నరమేధంలో
ఇప్పటివరకూ
16
మంది
మృతి
చెందినట్లు
స్పష్టం
అవుతోంది.
అలాగే
పలువురు
తీవ్రంగా
గాయపడ్డారు.
యూదులు
ఎంతో
ఉత్సాహంగా
బీచ్
వద్ద
వేడుక
జరుపుకుంటున్న
సమయంలో
ఉగ్రమూకలు
కాల్పులకు
పాల్పడ్డారు.
నలుపు
దుస్తులు
ధరించిన
ఇద్దరు
ఉగ్రవాదులు
అక్కడకు
వచ్చి
తుపాకులతో
కాల్పులు
జరిపారు.
దర్యాప్తులో
దాడికి
పాల్పడింది
సాజిద్
అక్రమ్
(50),
నవీద్
అక్రమ్
(24)
ఇద్దరూ
తండ్రీ
కొడుకులు
అని
తేలింది.
అధికారుల
విచారణలో
సాజిద్
అక్రమ్
వద్ద
ఇండియా
పాస్
పోర్టు
లభ్యం
అయింది.
సాజిద్
హైదరాబాద్
లో
పాస్
పోర్టు
పొందినట్లు
గుర్తించారు.
సాజిద్
అక్రమ్..
1988లోనే
స్టూడెంట్
వీసాపై
ఆస్ట్రేలియా
వెళ్లినట్లు
సమాచారం.
గత
పాతికేళ్లలో
అతడు
రెండుసార్లు
హైదరాబాద్
వచ్చినట్లు
దర్యాప్తులో
తేలింది.
హైదరాబాద్
నుంచి
ఫిలిప్పీన్స్,
పాకిస్థాన్
వెళ్లినట్లు
నిఘా
వర్గాలు
గుర్తించాయి.
హైదరాబాద్
లో
ఉగ్ర
లింకులు
బయటకు
రావడంతో
భద్రతాదళాలు
పూర్తిస్థాయిలో
అప్రమత్తం
అయ్యాయి.
ఇక
ఉగ్రవాదులు
కాల్పులు
జరుపుతున్న
సమయంలో
అక్కడి
ప్రజలు
ప్రాణాలు
అరచేతిలో
పెట్టుకుని
పరారయ్యారు.
అయితే
అహ్మద్
అనే
వ్యక్తి
మాత్రం
తెగించి..
ఉగ్రవాదులతో
వీరోచితంగా
పోరాడారు.
దాంతో
అహ్మద్
ను
యావత్
ప్రపంచం
మొత్తం
ప్రశంసలతో
ముంచెత్తుతోంది.
అటు
అమెరికా
అధ్యక్షుడు
ట్రంప్
సైతం
అహ్మద్
హీరో
అంటూ
కామెంట్
చేయడం
ఆశ్చర్యకరంగా
చెప్పవచ్చు.


